• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణకు రాహుల్‌, ప్రియాంక

    కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ప్రియాంక పాల్గొంటారు. మ. 3 గంటలకు దేవరకద్రకు ఆమె చేరుకుంటారు. సా. 4.30 గంటలకు కొల్లాపూర్‌లోని పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొంటారు. అక్కడ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరోవైపు రాహుల్‌ నవంబర్‌ 1, 2 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

    తెలంగాణ గురించి చెబుతూ రాహుల్ ఎమోషనల్

    తెలంగాణ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. ‘తెలంగాణతో మాకు ఉన్నది రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం ఉంది. తెలంగాణతో మోదీ, కేసీఆర్‌లకు కేవలం రాజకీయ సంబంధమే ఉంది. మీరంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. మీకు మాకు మధ్య ఉంది రాజకీయ సంబంధం కాదు. మీ అభిమానం.. ఆశీర్వాదంతో కూడిన సంబంధం. అందుకే మా చెల్లె ప్రియాంకను తీసుకు వచ్చా. తెలంగాణతో మనకు రాజకీయ సంబంధం కాదు.. కుటుంబ సంబంధం అని చెప్పి తీసుకు వచ్చా’ అని చెప్పుకొచ్చారు.

    మీ కలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది: ప్రియాంక

    ములుగు బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ… ‘తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సోనియాకు తెలుసు. రాజకీయ లబ్దికోసం కాకుండా, తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాంతాచారికి నా నివాళి. ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు. మీ కలలు సాకారం అవుతాయని బీఆర్‌ఎస్‌ను నమ్మి ఓటేశారు. ఉద్యోగాలు వస్తాయని పిల్లల భవిష్యత్‌ మారుతుందని అనుకున్నారు. మీ కలను కాంగ్రెస్‌ అర్థం చేసుకుంది. సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్‌ సిద్ధాంతం’ అని చెప్పుకొచ్చారు.

    నేడు తెలంగాణకు రాహుల్, ప్రియాంక

    నేడు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రానున్నారు. సాయంత్రం 3:30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్న రాహుల్‌, ప్రియాంక.. బేగంపేట్‌ నుంచి హెలికాప్టర్‌లో రామప్ప టెంపుల్‌కు చేరుకోనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల తర్వాత సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. రామప్ప గుడి నుంచి బయల్దేరనున్న బస్సు యాత్ర ములుగు చేరుకోనుంది. ములుగులో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్, ప్రియాంకలు ప్రసంగిస్తారు.

    మహిళా రెజ్లర్ల ఆందోళనకు ప్రియాంక సంఘీభావం

    WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషన్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లింగ్ క్రీడాకారులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరంలో కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా రెజ్లర్లు సాక్షిమాలిక్, వినేశ్ ఫొగాట్.. ప్రియాంకకు తమ సమస్యలు వివరించారు. బ్రిజ్‌భూషణ్ లైంగికంగా మహిళా క్రీడాకారులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేజర్లకు కాంగ్రెస్ పార్టీతో పాటు యావత్ దేశం అండగా ఉంటుందని ప్రియాంక ఓదార్చారు. LIVE: Media byte by Smt. @priyankagandhi ji at Jantar … Read more

    మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు; వీడియో వైరల్

    కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మంచులో ఆడుకున్నారు. జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లో వీరిద్దరూ స్నో బాల్స్‌తో సరదాగా ఫైట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ తన సోదరి ప్రియాంకపై స్నో బాల్స్ విసరడం, మళ్లీ ప్రియాంకం రాహుల్‌పై మంచు గడ్డలు విసురుకున్నారు. మంచుగడ్డల్లో వారిద్దరూ చిన్న పిల్లల్లా మారిపోయారు. ఒకరిపై ఒకరు మంచు విసురుకుంటూ సరదాగా గడిపారు. Sheen Mubarak!? A beautiful last morning at the #BharatJodoYatra … Read more

    అన్నా చెల్లెలి అనురాగం; రాహుల్, ప్రియాంకల వీడియో వైరల్

    కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపురూప సన్నివేశం చోటుచేసుకుంది. అన్నాచెల్లెళ్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఒకే వేదిక పంచుకున్నారు. ప్రియాంకను దగ్గరకు లాక్కొని రాహుల్ [ముద్దు](url) పెట్టాడు. ఈ సన్నివేశం వారిద్దరి అనురాగానికి అద్దం పట్టేలా ఉంది. కాగా తన సోదరుడు బహిరంగంగా ఆప్యాయత పంచడంతో ప్రియాంక కొంత ఇబ్బంది పడింది. ప్రియాంక కాసేపు నవ్వాపుకోలేక పోయింది. కాగా జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ❤️❤️ pic.twitter.com/9MIQKMIdAQ — Congress (@INCIndia) January 3, … Read more

    రాహుల్‌‌కి కవచం ఉంది: ప్రియాంకా గాంధీ

    తన సోదరుడు రాహుల్ గాంధీ ‘సత్య కవచములు’ కలిగి ఉన్నాడని.. దేవుడే రాహుల్‌కి కాపు కాస్తున్నాడని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘అందరూ నన్ను అడుగుతున్నారు. ‘ఏంటీ మీ అన్నయ్య కేవలం ఒక టీషర్టుతోనే పాదయాత్ర చేస్తున్నారు. చలి వేయట్లేదా? పైగా పంజాబ్, జమ్ము కశ్మీర్‌లకు వెళ్లబోతున్నారు.. భద్రతను పెంచుకోవచ్చు కదా!’ అని. అప్పుడు నేను ‘ఆయన సత్యం అనే కవచాన్ని ధరించాడు. దేవుడే రక్షణ కల్పిస్తున్నాడు’ అని వాళ్లకి చెప్పాను’’ అని ప్రియాంకా గాంధీ వెల్లడించారు. ఇదే అంశంపై రాహుల్ గాంధీ … Read more