రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం
మంచు కారణంగా పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు హాజరు కాలేకపోతున్నారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. కశ్మీర్లో తీవ్ర హిమపాతం కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు ఎంపీలు కశ్మీర్‌కు వెళ్లారు. దీంతో తిరిగి రావడం సాధ్యపడకపోవడంతో జైరాం రమేశ్ ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ హాజరుపై కూడా సందిగ్ధం నెలకొంది. మరోవైపు, సోనియాగాంధీ ప్రసంగానికి హాజరవుతారు. గతేడాది రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు … Read more