• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్ అంటే దగా పార్టీ: మల్లా రెడ్డి

    ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని మంత్రి మల్లా రెడ్డి అన్నారు. ‘బీఆర్ఎస్‌ పార్టీ అంటే చరిత్ర.. కేసీఆర్‌ సీఎం అయ్యాకే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. కేసీఆర్‌ కొత్తగా 10 పథకాలు తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ అంటే మోసం, దగా పార్టీ.. భూకబ్జా దారులు.. వాళ్లను జైలుకి పంపించే బాధ్యత నాదే. దళితులకు భూములను పంచే బాధ్యత నాదే’ అని చెప్పుకొచ్చారు.

    బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్… కాంగ్రెస్‌లోకి మరో నేత

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ బీఆర్ఎస్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. నిన్న బోథ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరగా తాజాగా .. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. 2014లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు 2018లో టికెట్ లభించలేదు. ఆ టికెట్‌ను మల్లారెడ్డికి ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు.

    చంద్రబాబుకు జైలు సరికాదు: మంత్రి మల్లారెడ్డి

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని జైలులో పెడతారా?అని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు లేకపోయినా ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీశారు. దేశంలోనే ది బెస్ట్‌ సీఎంగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. అలాంటి వ్యక్తిని జైలులో పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన తర్వాత చాలా బాధేసిందని మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

    మళ్లీ మాట జారిన మంత్రి మల్లారెడ్డి

    తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి మాట జారారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ఎన్నికల స్టంట్ అని ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. ‘‘టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ గుర్తించారు. ఎన్నికల స్టంట్ అనుకోండి.. ఏదైనా అనుకోండి. మాది రాజకీయ పార్టీ. ఎలక్షన్లకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల స్టంట్ ఉంటుంది.’’ అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. వెంటనే సవరించుకుని.. ఏదైతేనేం కార్మికులకు మంచి జరిగింది కదా అంటూ సర్దిచెప్పుకున్నారు. Mallareddy: మాది రాజకీయ పార్టీ.. ఎన్నికల స్టంట్ ఎట్లైనా ఉంటది: … Read more

    స్టెప్పులతో అదరగొట్టిన మల్లారెడ్డి

    తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో మరోమారు హల్‌చల్‌ చేశారు. తన డ్యాన్స్‌తో అందరినీ ఉత్సాహపరిచారు. మేడ్చల్‌ జిల్లా ఫిర్జాదిగూడలో నిర్వహించిన తెలంగాణ రన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై ఫుల్‌ జోష్‌తో స్పెప్పులు వేశారు. దీంతో అక్కడి వారంతా కేరింతలు కొడతూ మంత్రిని ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డీజే టిల్లు పాటకి డాన్స్ వేసిన మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ రన్ డే … Read more

    పవన్ సినిమాలో విలన్‌గా అవకాశం: మల్లారెడ్డి

    మేము ఫేమస్ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి క్రేజీ కామెంట్స్ చేశారు. తనకు పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా చేసే అవకాశం వచ్చిందని చెప్పారు. డైరెక్టర్ హరీష్ శంకర్ తన దగ్గరకు వచ్చి ఒప్పించేందుకు గంటసేపూ బతిలాడారని వివరించారు. కానీ తాను విలన్‌గా చేయనని చెప్పినట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ మూలాలపై నాలుగైదు సినిమాలు తీస్తానని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

    6వేల మందితో చిరు చిత్రం

    మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. తమ మైదానంలో మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు చిరు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని డ్రా చేసి.. ఆరు వేల మంది ఆ లైన్‌పై కూర్చున్నారు. ‘క్యాన్సర్‌పై పోరాటం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరుకి ఈ వీడియో చూపించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ వీడియో చూసిన చిరు ఎంతో మురిసిపోయి విద్యార్థులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియోను చిత్ర దర్శకుడు బాబీ ట్విటర్‌లో షేర్ చేయగా.. వావ్ సూపర్ అటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీడియో … Read more