పెళ్లి చేసుకుంటానంటే పిల్లలు వద్దంటున్నారు: హీరోయిన్

తాను పెళ్లి చేసుకుంటానంటే తన పిల్లలు వద్దంటున్నారని హీరోయిన్ సుష్మితా సేన్ తెలిపింది. ‘‘నా పిల్లలు నాన్న లేడు అని బాధపడటం లేదు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా వారు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడెందుకు పెళ్లి.. మాకు నాన్నే అవసరం లేదంటున్నారు. నేను భర్తను కోరుకుంటున్నానని కూడా వారు తెలుసుకోవడం లేదు.’’ అంటూ సుష్మితా చెప్పుకొచ్చింది. కాగా రెనీ, అలీషా అనే ఇద్దరమ్మాయిలను సుష్మితా దత్తత తీసుకుంది.

రాహుల్‌ గాంధీకి పెళ్లి చేద్దామా..?

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన హరియాణా మహిళా రైతులు.. సోనియా గాంధీతో మాట్లాడుతూ రాహుల్‌ వివాహం గురించి అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి’ అని అన్నారు. దీంతో ‌అక్కడే ఉన్న రాహుల్‌ నవ్వుతూ ‘అవుతుంది.. అవుతుంది’ అని చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మరణం గురించి మహిళలు సోనియాను అడగ్గా ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. मां, प्रियंका और मेरे … Read more

పెళ్లి వయసు దాటిపోయింది: సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దుబాయిలో జరిగిన ఐఫా-2023 అవార్డు వేడుకల్లో పాల్గొన్న సల్మాన్‌.. పెళ్లి వయసు దాటిపోయిందంటూ వ్యాఖ్యానించాడు. ఓ మహిళా అభిమాని ప్రపోజ్‌ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ల క్రితం కలిసి ఉంటే బాగుండేది అంటూ సరదాగా బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా గతంలో ఓ ఇంటర్యూలో మాట్లాడిన సల్మాన్ సరైన వ్యక్తి ఎదురైనప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్పాడు. … Read more

ఆస్పత్రిబెడ్‌పై యువతికి తాళికట్టిన వరుడు

[VIDEO:](url) మధ్యప్రదేశ్‌లో ఓ వివాహం సినిమా సన్నివేశాన్ని తలపించింది. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వధువును వివాహామాడాడు వరుడు. ఉజ్జయిని భేర్‌ఘాట్‌కు చెందిన రాజేంద్రకు జుల్వానియా వాసి శివానితో పెళ్లి నిశ్చయమయ్యింది. బంధువుల సౌకర్యార్థం ఖాండ్వాలో వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఇంతలోనే వధువు ప్రమాదానికి గురై కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఆమెకు అండగా నిలవాలనుకున్న వరుడు రాజేంద్ర.. ఆస్పత్రిలోనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. జనరల్ వార్డునే ఫంక్షన్‌హాల్‌లా మార్చారు. दुल्हन हुई घायल तो अस्पताल पहुंची बारात, बेड पर ही दूल्हे ने … Read more