• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మంత్రి గంగులపై సీబీఐ ప్రశ్నల వర్షం

  తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను దాదాపు 9 గంటలపాటు ఢిల్లీలో సీబీఐ విచారించింది. నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాసరావు కాల్ లిస్ట్, ఫొటోల ఆధారంగా వీరిద్దరినీ సీబీఐ విచారించింది. శ్రీనివాసరావు మీకు ఎలా తెలుసు? ఆయనకు మీకు సంబంధం ఏంటి? అంటూ ఇద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించారు. మున్నూరు కాపు సమావేశంలో కలుసుకున్నామని చెప్పారు. ఆయనతో ఎలాంటి లావాదేవీలు జరపలేదని వారు స్పష్టం చేశారు. సంతకాలు తీసుకుని వారిని వదిలేశారు.

  26 ఏళ్లకే దేశానికి మంత్రిగా బాధ్యతలు

  26 ఏళ్ల వయసులో ఇంకా కెరీర్ ఏంటో కూడా నిర్ణయించుకోలేని కన్ఫ్యూజన్‌లో బతుకుతుంటారు కొందరు యువత. కానీ ఆ వయసులో దేశానికి మంత్రిగా ఎన్నికైంది స్వీడన్‌కు చెందిన రోమినా పౌర్‌మోఖ్తారీ. దేశ పర్యావరణ మంత్రిగా స్వీడన్‌ ప్రభుత్వ మంగళవారం ఆమె పేరును ప్రకటించింది. అత్యంత పిన్న వయస్కురాలైన పర్యావరణ ఉద్యమకారిణిగా పేరున్న గ్రెటా థన్‌బర్గ్‌ ఇదే దేశస్థురాలు. రోమినా ఇప్పటివరకూ లిబరల్స్‌ పార్టీ యువజన విభాగానికి నాయకురాలిగా ఉన్నారు.

  ఫైర్ అయి సమస్యను సాల్వ్ చేసిన మంత్రి కేటీఆర్

  సిరిసిల్ల మున్సిపాలిటీలో తలెత్తిన సమస్యను మంత్రి కేటీఆర్ సాల్వ్ చేశారు. పరువు తీస్తున్నారంటూ పాలకవర్గం మీదికి ఫైర్ అయిన కేటీఆర్ అందరినీ సముదాయించారు. కోట్లాది రూపాయలతో సిరిసిల్లను డెవలప్ చేస్తుంటే తన పరువు తీసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన గుస్సా అయినట్లు సమాచారం. మున్సిపల్ చైర్ పర్సన్ తో కౌన్సిలర్లంతా కలిసి ఉండాలని ఆయన చెప్పారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని.. సొంత పార్టీలోనే గొడవలు పెట్టుకుంటే ప్రజల్లో చులకన అవుతామని పేర్కొన్నారు. ఎవరూ వివాదాల జోలికి పోకుండా కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. … Read more

  కేంద్ర మంత్రి రాజీనామా

  కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. నఖ్వీ ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ రోజు చివరిసారిగా మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. నఖ్వీ యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రధాని మోదీ నఖ్వీ సేవలను ప్రశంసించారు. నఖ్వీ 1957లో జన్మించారు. రాజ్యసభ ఎంపీగా నఖ్వీ పదవీకాలం ముగిసింది. ఎన్నికల వేళ రాజీనామా చేయడంతో ఆయన ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

  కరోనా టెస్టుల సంఖ్యను పెంచండి: మంత్రి

  దేశంలో కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధికారులకు సూచించారు. థర్డ్ వేవ్‌తోనే అంతమైందని అనుకున్న మహమ్మారి కొద్ది రోజుల నుంచి మళ్లీ పంజా విసురుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తమయ్యారు. కేంద్ర మంత్రి ఆరోగ్య అధికారులతో సమావేశమై వ్యాక్సినేషన్, టెస్టులు, కేసుల సంఖ్యపై సమీక్ష నిర్వహించారు. RT-PCR టెస్టుల సంఖ్యను పెంచాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ జరపాలని రాష్ట్రాలను ఆదేశించారు. రాష్ట్రాల వారీగా నివేదిక అందజేయాలని పేర్కొన్నారు.

  టీ తాగడం తగ్గించండని కోరుతున్న పాక్ మంత్రి… కారణమిదే

  పాకిస్తాన్ ప్రణాళికా అభివృద్ధి మంత్రి ఎహ్‌సాన్ ఇక్బాల్ దేశ ప్రజలను టీ తక్కువగా తాగమని సూచించాడు. టీ పొడి కోసం కూడా దేశం ఇతర దేశాల వద్ద అప్పులు చేయాల్సి వస్తోందని ఆయన వాపోయారు. గతేడాది పాక్ ప్రజలు రూ. 2 కోట్ల విలువైన టీ తాగారని చెప్పారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని ఆయన కోరారు. పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ పెట్రోల్, డీజిల్ మీద ప్రజలకు అందిస్తున్న సబ్సిడీని ప్రభుత్వం ఎత్తేయాలని లేకుంటే.. … Read more

  ఆ బాధ్యత ప్రభుత్వంపై లేదా?

  రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం ప్రారంభించిన రామగుండం యూరియా పరిశ్రమను కాలుష్యం పేరుతో నోటీసులిచ్చి తెలంగాణ ప్రభుత్వం మూసివేయించారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసమే ఇలా చేశారన్నారు. రైతులకు ఎరువుల కొరతకు ప్రభుత్వమే కారణం అని తెలిపారు.