రష్మిక వీడియోపై నాగచైతన్య స్పందన
హీరోయిన్ రష్మిక మార్ఫింగ్ వీడియోపై హీరో నాగ చైతన్య స్పందించాడు. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘టెక్నాలజీని దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధకలుగుతుంది. భవిష్యత్తులో రాబోయే మార్పులను తలచుకుంటే భయమేస్తోంది. బాధితులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలి’.అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు రష్మిక స్పందిస్తూ థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చింది.