నువ్వు తాత అయినా మాకు హీరోవే: రోజా
తల్లిదండ్రులైన మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు మంత్రి రోజా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తాత అయిన చిరంజీవికి శుభాకాంక్షలు. నువ్వు తాత అయినా మాకు ఎప్పటికీ హీరోవే. మెగా కుటుంబానికి మెగా ప్రిన్సెస్ రూపంలో దేవుడు ఆశీర్వాదం అందించాడు. రామ్‌చరణ్‌ను చిన్నప్పుడు నేను హత్తుకున్న రోజులు నాకింకా గుర్తున్నాయి. ఇప్పుడు చరణ్‌కు పాప పుట్టిందన్న వార్త విని చాలా సంతోషమేసింది. మీ ఇంటి చిన్ని మహాలక్ష్మికి నా ఆశీస్సులు.’’ అంటూ రోజా ట్విటర్‌లో ట్వీట్ చేసింది.