• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PAK vs SL శ్రీలంక భారీ స్కోరు

    వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా నేడు పాకిస్థాన్‌, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. లంక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇచ్చింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లు 9 వికెట్లు కోల్పోయి 344 పరుగుల భారీ స్కోరు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్ కుశాల్ మెండిస్ 77 బంతుల్లో 122 పరుగులు చేశాడు. సధీరా సమరవిక్రమ 89 బంతుల్లో 108 పరుగులు రాబట్టాడు, ఓపెనర్ పాథుమ్ నిశాంక 61 బంతుల్లో 51 పరుగులు చేసి పాక్ బ్యాటర్లు ముందు భారీ స్కోరు … Read more

    RSA vs SL: సౌతాఫ్రికా భారీ స్కోరు

    వరల్డ్ కప్‌లో నేడు సౌతాఫ్రికా, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా విధ్వంసం సృష్టించింది. శ్రీలంకపై రికార్డు స్థాయిలో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 428కి పైగా పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేశారు. క్వింటన్‌ డికాక్‌ (84 బంతుల్లో 100), రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ (110 బంతుల్లో 108), ఆఖర్లో ఎయిడెన్‌ మార్క్రమ్‌ (106) సెంచరీలతో విరుచుకుపడ్డారు.

    మరో ప్రేమాయణం: లంక నుంచి ఏపీకి

    ఓ యువతి తన ప్రియుడి కోసం శ్రీలంక నుంచి ఏపీకి వచ్చింది. శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్‌లు ఆరేళ్లుగా ఫేస్‌బుక్‌లో ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో జూలై 8న విఘ్నేశ్వరి వీసాపై లంక నుంచి ఇండియాకు వచ్చింది. చెన్నై విమానాశ్రయంలో దిగి.. అక్కడి నుంచి చిత్తూరుకు చేరుకుంది. అనంతరం తన ప్రియుడు లక్ష్మణ్‌ను వివాహం చేసుకుంది.ఆమె వీసా గడువు ముగుస్తుండటంతో భారత్ విడిచివెళ్లాలని పోలీసులు హెచ్చరించారు. ఫేస్‌బుక్ ద్వారా ప్రేమించి ఏపీకి వచ్చిన శ్రీలంక యువతి శ్రీలంకకు చెందిన విఘ్నేశ్వరి చిత్తూరు … Read more

    బంతి వికెట్లను తాకినా బెయిల్స్‌ పడలేదు

    [VIDEO](url): న్యూజిలాండ్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కివీస్‌ బ్యాటింగ్ సందర్భంగా లంక బౌలర్‌ కాసున్‌ రజితా వేసిన బంతి వేగంగా వికెట్లను తాకినప్పటికీ బెయిల్స్‌ కింద పడలేదు. దీంతో ఆటగాళ్లు, కామెంటేటర్‌లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. మూడో ఓవర్‌లో ఫిన్‌ అలెన్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న అలెన్‌ అర్ధశతకంతో రాణించాడు. Crazy! The bails didn't come off Watch BLACKCAPS v Sri … Read more

    సుడులు తిరిగిన బంతి.. బిత్తరపోయిన బ్యాటర్

    [వీడియో;](url) న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టులో విచిత్రకర సంఘటన చోటుచేసుకుంది. కివీస్ స్పిన్నర్ మైఖేల్ బ్రేస్‌వెల్ వేసిన ఓ బంతి బలమైన గాలుల ధాటికి వైడ్‌గా వెళ్లింది. సరిగ్గా అతడు బంతి వేసే సమయంలోనే గాలులు రావడంతో అనూహ్యంగా టర్న్ అయ్యింది. ఇది చూసిన లంక బ్యాట్స్‌మెన్ జయసూరియా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా న్యూజిలాండ్‌లో దాదాపు గంటకు 55 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. Just when you think you’ve … Read more

    ప్రభాకరన్ బతికే ఉన్నాడు; త్వరలోనే ప్రజల ముందుకు?

    ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చనిపోలేదని, ఇంకా బతికే ఉన్నాడని తమిళ నేషనలిస్ట్ నాయకుడు పర నెడుమారన్ [సంచలన](url) వ్యాఖ్యలు చేశారు. ప్రభాకరన్ అనుమతితోనే తాను ఈ విషయం వెల్లడిస్తున్నట్లు తెలిపారు. శ్రీలంక సైన్యంతో జరిగిన యుద్ధంలో ప్రభాకరన్ చనిపోలేదని పేర్కొన్నాడు. ఆయన ఇప్పటికీ తన కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారని చెప్పారు. కాగా 2009లో శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో ప్రభాకరన్, ఆయన కుమారుడు చార్లెస్ ఆంటోనీ ఇద్దరూ మరణించారు. #BREAKING பிரபாகரன் நலமுடன் உள்ளார்: பழ.நெடுமாறன்#Prabhakaran #News18TamilNadu | https://t.co/7dpn9FD15R pic.twitter.com/CrpQKJJz4q — News18 Tamil … Read more

    మిత్రుడికి వానరం కన్నీటి నివాళి

    తనకు అన్నం పెట్టిన వ్యక్తి చనిపోయాడని తెలుసుకుని ఓ కోతి ఏడ్చి, ముద్దు పెట్టుకుని నివాళి అర్పించింది. ఈ సంఘటన శ్రీలంకలోని బట్టికలోవా జిల్లాలో చోటుచేసుకుంది. బట్టికలోవాలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కోతి స్నేహంగా ఉండేవాడు. రోజూ ఆహారం పెట్టేవాడు. దానితో సరదాగా ఆడుకునేవాడు. కానీ ఇటీవల అతడు మరణించాడు. అతని మృతదేహం దగ్గరికి వెళ్లి రోదించి, ముద్దు పెట్టి నివాళులర్పించింది. దీంతో ఆ దృశ్యాలు చూసి అక్కడున్నవారి హృదయాలు ద్రవించిపోయాయి. இலங்கை: மட்டக்களப்பில், தினமும் உணவளித்த மனிதருக்கு இறுதி அஞ்சலி செலுத்திய … Read more

    BREAKING: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్

    శ్రీలంక రణరంగంగా మారింది. అక్కడ పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయాయి. గత వారం అధ్యక్ష భవనాన్ని హస్తగతం చేసుకున్న ఆందోళన కారులు ఈరోజు ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే నివాసంపై దాడి చేశారు. ప్రధాని నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న నిరసనకారులు.. కర్రలు, రాళ్లతో దాడి చేస్తువ్నారు. వారిని చెదరగొట్టేందుకు శ్రీలంక ఆర్మీ టియర్ గ్యాస్ ప్రయోగించింది. అయినా వెనక్కి తగ్గని ఆందోళనకారులు ప్రధాని నివాసాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే నియమించబడ్డారు. #WATCH | Sri Lanka: … Read more