• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘వీరసింహారెడ్డి’ మేకింగ్ వీడియో చూశారా?

    నందమూరి బాలకృష్ణ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం నుంచి ఫ్యాన్స్‌కు న్యూఇయర్ గిఫ్ట్ వచ్చింది. ఈ మూవీ మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. మేకింగ్ వీడియోలో బాలయ్య యాక్షన్ అదిరిపోయింది. కాగా ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    చిన్నారి పిలుపునకు చలించిన బాలయ్య; గూస్‌బంప్స్ వీడియో

    ఓ చిన్నారి ‘బాలయ్య’ అని పిలవగానే నందమూరి నటసింహం చలించిపోయాడు. ఆ పాపను దగ్గరికి పిలిపించుకుని మరీ ముద్దాడాడు. అన్‌స్టాపబుల్ షో షూటింగ్ గ్యాప్‌లో బాలకృష్ణ బయట కూర్చుని ఉన్నారు. అక్కడే ఉన్న పవన్ అభిమానుల మధ్య నుంచి[ ‘బాలయ్య’ ](url)అనే పిలుపు వినిపించింది. గమనించిన బాలయ్య ఆ పాపను దగ్గరికి తీసుకురావాలని సూచించాడు. చిన్నారి తండ్రి ఆమెను ఎత్తుకుని బాలయ్య దగ్గరకు తీసుకెళ్లాడు. బాలయ్య చిన్నారిని ముద్దాడి వివరాలు అడిగా తెలుసుకున్నారు. "బాలయ్య" అని పాప పిలవగానే daggarki pilipinchukoni… ??❣️ Wholesome … Read more

    పవన్ వ్యాఖ్యల్ని గుర్తుచేస్తున్న నెటిజన్స్

    బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోకి పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు ఇస్తారా అన్నది చర్చనీయాంశం అవుతోంది. గతంలో బాలయ్యపై పవన్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తోడుతున్నారు. అప్పుడు బాలయ్యని విమర్శించి.. ఇప్పుడు ఆయన షోలో ఎలా వ్యవహరిస్తారనేది టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. కాగా, ఈ ఎపిసోడ్‌కి పవన్ కళ్యాణ్‌తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వస్తున్నట్లు టాక్. హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ కూడా … Read more

    ఊపేస్తున్న వీరసింహారెడ్డి ఐటెమ్ సాంగ్

    బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయె’ అంటూ సాగుతున్న ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. తమన్ స్వరాలను సమకూర్చారు. సాహితీ, సత్య యామిని, రేణు కుమార్ కలిసి పాటను ఆలపించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. జనవరి 12న విడుదల కానుంది.

    బాలయ్య షోలో జయప్రద, జయసుధ, రాశీఖన్నా

    బాలయ్య వ్యాఖ్యాతగా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్2’ షోకి అలనాటి నటీమణులు జయప్రద, జయసుధ అతిథులుగా వచ్చారు. వీరితో పాటు యువ నటి రాశీ ఖన్నా కూడా వచ్చింది. ఈ క్రమంలో రాశిఖన్నాతో బాలయ్య పాట పాడించారు. రాశీ నవ్వుకి పడిపోయానంటూ చమత్కరించారు. అనంతరం కొన్ని సున్నితమైన ప్రశ్నలు అడిగారు. ‘హీరోయిన్ కావాలంటే కొన్ని విషయాల్లో రాజీ పడాలా?’ అన్న ప్రశ్నకు ముగ్గురూ ‘ఊ’ అన్నారు. అలాగే ప్రస్తుతం ‘నేనూ, శ్రుతిహాసన్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ పెయిర్’ అంటూ వారిని కవ్వించారు. ఈ ఎపిసోడ్ రేపు ఆహాలో … Read more

    ఏం చెబుతున్నావ్ డార్లింగ్: ప్రభాస్

    బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ సీజన్2లో ప్రభాస్, గోపీచంద్ సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా మీడియా గ్లింప్స్‌ని విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ చాలా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చారు. మధ్యలో ఓ సెలబ్రిటీతో మాట్లాడుతూ.. ‘ఏయ్.. ఏం చెబుతున్నావ్, డార్లింగ్’ అంటూ ప్రభాస్ వారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చిన్న గ్లింప్స్ మాత్రమేనని.. అసలైన ప్రోమోను త్వరలో విడుదల చేస్తామని ఆహా ప్రకటించింది. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయర్ లేదా క్రిస్టమస్‌కి ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ … Read more

    చిరంజీవి, బాలకృష్ణతో సినిమా: అల్లు అరవింద్

    తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దనిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా తీయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న బాలయ్య అన్‌స్టాపబుల్‌ కార్యక్రమానికి సురేశ్‌ బాబుతో కలిసి వెళ్లారు. ఇందులో వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనతో సినిమా ఎందుకు చేయలేదని ప్రశ్నించగా.. చిరంజీవి, బాలయ్యతో కలిసి తీయాలని ఉందన్నారు. సంక్రాంతికి ఎన్ని థియేటర్లు ఇస్తారని బాలయ్య సరాదాగా ప్రశ్నించారు.

    ఫుల్ ఎనర్జిటిక్‌గా ‘జై బాలయ్య’ సాంగ్

    నటసింహం నందమూరి బాలక్రిష్ణ హీరోగా తెరకెక్కిన వీరశివారెడ్డి చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ‘జై బాలయ్య’ పాటను మూవీ మేకర్స్ విడుదల చేశారు. హీరో పాత్రను తెలియజేసేలా ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటకు థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఫ్యాక్షన్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.

    ఆదిత్య 999పై బాలకృష్ణ కీలక ప్రకటన

    [VIDEO:](url) యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ మూవీ ట్రైలర్ లాంఛ్ సందర్భంగా అగ్రహీరో బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 999 వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఫలక్ నుమా దాస్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా వంటి వైవిధ్యమైన సినిమాలతో ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన విశ్వక్ ఇప్పుడు ధమ్కీ తో మరొక్కసారి మిమ్మల్ని అలరించేందుకు సిద్ధం అవుతున్నారని చెప్పారు. ఈ మూవీకి హీరోగా, నిర్మాతగా దర్శకుడిగా … Read more

    విశ్వక్ ‘ధమ్కీ’ ఇచ్చేశాడుగా!

    మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘ధమ్కీ’ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను నటసింహిం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. చిత్రంలో విశ్వక్ డ్యూయెల్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేధా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. రావు రమేష్, రోహిణీ, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషించారు. విశ్వక్ స్వీయ దర్శకత్వం చేపట్టిన ఈ సినిమాను వచ్చే ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.