తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దనిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా తీయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న బాలయ్య అన్‌స్టాపబుల్ కార్యక్రమానికి సురేశ్ బాబుతో కలిసి వెళ్లారు. ఇందులో వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనతో సినిమా ఎందుకు చేయలేదని ప్రశ్నించగా.. చిరంజీవి, బాలయ్యతో కలిసి తీయాలని ఉందన్నారు. సంక్రాంతికి ఎన్ని థియేటర్లు ఇస్తారని బాలయ్య సరాదాగా ప్రశ్నించారు.