• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాబోయ్.. ఇదేం కొండచిలువ..!

    పాములంటే చాలామందికి భయం. మరికొందరు వీటిని ఇష్టంగా పెంచుకుంటుంటారు. సాధారణంగా ఇలా పెంచుకున్నవి ఎలాంటి హానీ చేయవు. కానీ, ఓ మహిళపై కొండచిలువ దాడి చేసింది. బోనులో నుంచి బయటకు తీద్దామని ప్రయత్నించిన సంరక్షకురాలి చేతిని నోట కరిచి చుట్టేసింది. దీంతో ఆ మహిళ చేతికి తీవ్ర గాయం కాగా, రక్తం కూడా కారింది. కొండచిలువను విడిపించడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఎంత భయంకరంగా ఉందో..’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Snake attacks … Read more

    అతడి తెలివికి హ్యాట్సాప్

    సాధారణంగా టమాటాలను లోడింగ్ చేయాలంటే కష్టంతో కూడుకున్న పనే. కానీ ఓ వ్యక్తి మాత్రం అవలీలగా టమాటాలు లోడింగ్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి టమాటా బుట్టను గాల్లోకి విసిరేస్తే టమాటాలు ట్రక్కులోకి, బుట్ట వెనక్కి వచ్చి కింద పడిపోతోంది. దీంతో వేగంగా టమాటాలను ట్రక్కులో వేస్తున్నాడు. ఇతడి తెలివిపై ‘ఆర్నాల్డ్ పవర్.. ఐన్‌స్టీన్ తెలివి’ అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Power of Arnold, brain of Einstein pic.twitter.com/3W0dL3c1Dt — Sagar (@sagarcasm) October 18, … Read more

    VIRAL: బాలుడిని వేలాడదీసిన వ్యక్తి

    సెల్‌ఫోన్ దొంగలించాడని ఓ బాలుడిని బావికి వేలాడదీసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. తనకు ఏం తెలియదని.. ఆ దొంగతనం చేయలేదని బాలుడు ఎంత మొత్తుకున్నా కనికరించలేదు. పైగా, ‘నిజం చెప్తావా.. బావిలో తోసేయ్యనా’ అంటూ ఓ వ్యక్తి బాలుడిని బెదిరిస్తున్న వీడియో వైరల్ అయింది. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి.. సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ వీడియో తీసినందుకు పోలీసులు తనను బెదిరించారని మరో అబ్బాయి ఆరోపించగా.. అదేమీ లేదని పోలీసులు ఖండించారు. Video: Madhya Pradesh Boy … Read more

    రోడ్డుపై పెళ్లి చేసుకున్న స్కూల్‌ పిల్లలు

    సోషల్‌ మీడియా, ఫోన్ల వినియోగం పెరిగాక పిల్లల చేష్టలు మితిమీరుతున్నాయి. పిల్లల కదలికలను తల్లిదండ్రులు నిరంతరం కనిపెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా తమిళనాడులోని చిదంబరం జిల్లాలో ఓ ఇంటర్‌ అమ్మాయి, పాలిటెక్నిక్‌ అబ్బాయి బస్టాండులో పెళ్లి చేసుకున్నారు. స్నేహితులు ప్రోత్సహిస్తుండగా… ఆ కుర్రాడు బాలిక మెడలో తాళి కట్టాడు. ఇది సరదాగా చేశారో లేక నిజంగా పెళ్లి చేసుకోవాలని చేశారో తెలీదు గానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. காலேஜ் மாணவிகள் … Read more

    అల్లూరి జిల్లాలో అద్భుతం !

    ఏపీలోని అల్లూరి జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. కూనవరం మండలం జగ్గవరంలో దుర్గమ్మను పూజిస్తుండగా అక్కడున్న గాజుల వాటంతట అవే తిరగడం వైరల్‌గా మారింది. ఇది చూసిన అక్కడి భక్తులు అమ్మవారి మహత్యం వల్లే ఇలా జరిగిందని, తమ పూజలకు మెచ్చే తమపై చల్లని ఆశీస్సులు ఇలా చూపిందని చెబుతున్నారు.

    VIRAL: కాలా చష్మాపై జపాన్ యువతుల డ్యాన్స్ !

    బాలీవుడ్ హీరోయిన్ కత్రినాకైఫ్ కాలా చష్మా అంటూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అప్పట్లో ఓ సంచలనం సృష్టించిన ఈ సాంగ్‌కు ఇప్పుడు నెటిజన్స్ రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా జపాన్‌కు చెందిన కొందరు అమ్మాయిలు ఈ పాటపై చేసిన డ్యాన్స్ వైరల్ అవుతుంది. అందరూ ఒకేరకమైన డ్రెస్, హెయిర్ స్టైల్‌లో అద్భుతంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. దీనిపై నెటిజన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియూను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.   View this … Read more

    GREAT: భార్యను ఎత్తుకొని తిరుమల మెట్లు ఎక్కాడు !

    తూ.గోకు చెందిన సత్తిబాబు, తన భార్య లావణ్యను ఎత్తుకొని తిరుమల కొండ ఎక్కుతున్న వీడియో వైరల్ అవుతుంది. లావణ్య విసిరిన సవాలును స్వీకరించిన సత్తిబాబు ఆమెను తన భుజాలపై ఎత్తుకొని 70 మెట్లు ఎక్కాడట. తన అల్లుడు మొక్కిన మొక్కు తీర్చేందుకు తిరుమల వెళ్లిన ఈ జంటకు 1998లోనే పెళ్లైందట. అయితే ఈ వీడియో చూసిన కొందరు యువత వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అంటుండగా.. మరికొందరు దేవుని దగ్గరకు వెళ్తున్నప్పుడు సవాలేంటి అని విమర్శిస్తున్నారు.

    VIRAL VIDEO: బుల్లెట్‌పై మండపానికి వెళ్లిన వధువు

    సోషల్ మీడియాలో వైరల్ కావడానికి వధువులు వివిధ రకాల ఫీట్లు చేస్తున్నారు. కొందరు ఫోటోషూట్లతో వైరల్ అవుతుండగా.. మరి కొందరు డ్యాన్స్‌తో వైరల్ అవుతున్నారు. తాజాగా ఓ వధువు పెళ్లి డ్రెస్‌లో రెడీ అయి, బుల్లెట్ బండిపై పెళ్లి మండపానికి వెళ్ళింది. స్వయంగా తనకు తానే డ్రైవింగ్ చేసుకుంటూ మండపానికి చేరుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Deepalimakeovers (@deera.makeovers)

    కన్నీళ్లు పెట్టుకున్న IAS అధికారి

    నిన్న యూపీలోని లఖింపూర్ ఖేరీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించడంతో పాటు పలువురు గాయాలపాలయ్యారు. దీంతో లక్నో డివిజనల్ కమిషనర్ రోషన్ జాకబ్ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ కదలలేని స్థితిలో ఉన్న ఓ బాలుడిని చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే వైద్యులను పిలిచి ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతనికి మంచి వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన [వీడియో ](url)వైరల్ అవుతోంది. #WATCH |Lakhimpur … Read more

    అభిమానిని లాగిపెట్టి కొట్టిన హీరోయిన్

    తమకు ఇష్టమైన సెలెబ్రిటీలు కనిపిస్తే అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు, వారిని టచ్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇలా కొన్నికొన్ని సార్లు వాళ్ళ బాడీగార్డ్‌ల చేత దెబ్బలు తింటూ ఉంటారు. అయితే తనను టచ్ చేసినందుకు ‘సాటర్‌డే నైట్’ సినిమా హీరోయిన్ సానియా అయ్యప్పన్ ఓ అభిమానిని కొట్టింది. బాడీ గార్డులు ఉన్నప్పటికీ అభిమాని, ఆమెను టచ్ చేయడంతో కోపంతో లాగిపెట్టి కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. Watch On Instagram గుర్తుపై క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు. View … Read more