• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆమెను నేను కొట్టలేదు; నవీన్ రెడ్డి

    డెంటల్ విద్యార్థిని వైశాలిని తాను కొట్టలేదని, మాట్లాడటానికే కిడ్నాప్ చేశానని నిందితుడు నవీన్‌రెడ్డి తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఏముందంటే‘‘ వైశాలి, నేను ప్రేమించుకున్నాం. ఆమె తల్లిడండ్రులే మమ్మల్ని విడదీశారు. ఆమె కోసం చాలా ఖర్చు చేశా. ఇటీవల వైశాలికి ఎన్నారై సంబంధం వస్తున్నట్లు తెలిసింది.దానిని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే వైశాలి ఇంటికి వెళ్లా. తప్పక కిడ్నాప్ చేశా.’’ అంటూ చెప్పుకొచ్చాడు.

    శునకం..అశ్వం.. ఓ మహిళ..!

    [VIDEO:](url) అప్పుడే తెలవారుతోంది. సూర్యుడు ఒళ్లు విరిచి తూర్పున ఉదయించేందుకు సిద్ధమవుతున్న వేళ ఓ శునకం, అశ్వం, మహిళ.. అలా రోడ్డుపై కలిసి ప్రయాణిస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. ఆ మహిళ స్కేటింగ్ చేస్తూ రోడ్డుపై ప్రయాణిస్తుంటే ఆమె వెంట గుర్రం, శునకం పరుగెత్తడం చూపరులకు ఆహ్లాదం కలిగించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘వాటి మధ్యనున్న అనుబంధం ఎంత మధురమైందో. అసలైన ఆనందం అంటే ఇదే’ అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమకూ ఇలా చేయాలని ఉందని … Read more

    కాపాడబోయి కన్ను పోగొట్టుకుంది

    [VIDEO](url): అమెరికాలోని కాలిఫోర్నియా ఓ వికలాంగుడికి మద్దతుగా నిలిచినందుకు మహిళ కంటిని కోల్పోయింది. ఓ రెస్టారెంట్‌లో పనిచేసే ఓ మహిళ… అక్కడ ఒక వికలాంగుడిని కొంతమంది ఏడిపిస్తుంటే అడ్డు చెప్పింది. దీంతో ఆ గుంపులోని వ్యక్తులు మహిళపై దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఆమె కంటికి తీవ్ర గాయమై..చూపు కోల్పోయింది. వారు అలా దాడి చేస్తారని తాను అస్సలు ఊహించలేదని మహిళ బాధను వ్యక్తం చేసింది. @raulbrindis Un hombre golpeó repetidamente a Bianca Palomera, 19, … Read more

    ర్యాగింగ్‌ అంటూ బాలికకు ముద్దులు

    [VIDEO](url): ర్యాగింగ్‌పై ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ పలుచోట్ల వికృత చేష్టలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఒడిశాలో ఓ విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బరంపురంలోని బినాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఇందులో ఇప్పటికే ఐదుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. In Binayak acharya college campus what's going sir @SP_BERHAMPUR In simple word it's called … Read more

    వైరల్ అవుతున్న మహేశ్ వీడియో

    [VIDEO:](url) సూపర్ స్టార్ కృష్ణ మృతికి నెట్టిళ్లు కూడా శోక సంద్రమైంది. కృష్ణ గురించి మహేశ్ బాబు చెప్పిన మాటల్ని అభిమానులు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది తొలినాళ్లలో మహేశ్ తన సోదరుడిని కోల్పోయాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ బాబు.. అభిమానుల ప్రేమకు తరించిపోయాడు. ‘ఈ మధ్య నాకు బాగా దగ్గరగా ఉండేవారు ఉన్నట్టుండి దూరమయ్యారు. అయినా, మీ అభిమానం అలాగే ఉంది. ఇదొక్కటి చాలు నన్ను ముందుకు నడిపించడానికి’ అని మహేశ్ భావోద్వేగంతో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. రెండు … Read more

    మూడేళ్ల పాప స్వింగ్ జంప్.. సోషల్ మీడియా షేక్

    మూడేళ్ల పాప ఎటువంటి బెరుకు, భయం లేకుండా కొండపై నుంచి రోప్ స్వింగింగ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పర్వాతారోహకులు మైక్, జానెల్లీ స్మైలీల మూడేళ్ల కుమార్తె సైలా ఈ ఫీట్ చేసింది. ఈ పాపను వారు తమ వెంట పర్వాతారోహణకు తీసుకువెళ్తుంటారు. ఒకరోజు అనుకోకుండా ఆ పాపతో కూడా రోప్ స్వింగింగ్ చేయించారు. ఈ [వీడియో](url)ను ఇప్పటివరకు 40 మిలియన్ల మంది వీక్షించారు. ఈ వీడయో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. https://www.instagram.com/reel/CkQTPEsjQGA/?utm_source=ig_web_copy_link

    మైసూరులో చిరుత బీభత్సం

    కర్ణాటకలోని మైసూరులో చిరుతపులి కలకలం రేపుతోంది. జనావాసాల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. దీంతో భయం గుప్పిట్లో మైసూరు వాసులు గడుపుతున్నారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. జనాలు వెంట పడటంతో పొదల్లోకి వెళ్లింది. మళ్లీ తిరిగి వ్యక్తిపైకి దూసుకు రాగా.. తృటిలో తప్పించుకున్నారు. చిరుతపులి బెడదను తొలగించాలని కోరుతున్నారు. ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #NDTVBeeps | Video: Leopard Attacks Residents In Karnataka's Mysuru pic.twitter.com/yWuzy3HhCs — NDTV (@ndtv) … Read more

    IMA కార్యక్రమంలో డాక్టర్ల ఫైటింగ్‌

    జబాల్‌పూర్‌లో ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ వార్షిక సమావేశంలో ఘర్షణ తలెత్తింది. వైద్యులు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జబాల్‌పూర్‌ IMA నూతన అధ్యక్షుడు అభిజిత్ బిష్ణోయి చెప్పిన వివరాల ప్రకారం మాజీ IMA అధ్యక్షుడు, మరికొంత మంది వైద్యుల నడుమ వివాదం తెల్తితనట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో స్వాగతోపన్యాసం ఈ ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ये क्या दवा लिखने वाले हाथ मारपीट पर उतरे.. जबलपुर में #IMA के कार्यक्रम में डाक्टर आपस … Read more

    క్యాసెట్ రీల్‌తో టూ పీస్ బికినీ

    బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ ఓ వెరైటీ డ్రెస్ తయారు చేసి వార్తల్లో నిలిచింది. పాత టేప్ రికార్డ్ క్యాసెట్ రీల్‌తో ఒక ట్రెండీ డ్రెస్ తయారు చేసింది. టూ పీస్ బికినీలా తయారు చేసి ధరించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఉర్ఫీ డ్రెస్‌పై నెటిజన్లు కామెంట్ల హోరెత్తిస్తున్నారు. ‘‘టేప్ రికార్డు క్యాసెట్లు వృథాగా పడేయకండి.. ఉర్ఫీ వాటిని ఉపయోగించుకుంటుంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/reel/CkKvC1fOvqJ/?utm_source=ig_web_copy_link

    అందాల పోటీల్లో రచ్చ రచ్చ

    మిస్ శ్రీలంక న్యూయార్క్ అందాల పోటీల్లో ఘర్షణ చెలరేగింది. కొంతమంది యువకులు, యువతులు ఒకరినొకరు నెట్టుకోవడం, పిడిగుద్దులు కురిపించుకుంటున్న [వీడియో](url) వైరల్‌గా మారింది. అందాల పోటీలు ముగిసిన తర్వాత ఈ వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ స్టేటన్ ఐలాండ్‌లో జరిగింది. గొడవకు కారణం ఏంటనేది స్పష్టంగా తెలియరాలేదు. కాగా ఈ ఏడాది మిస్ శ్రీలంక న్యూయార్క్‌గా ఏంజెలియా గుణశేఖర కిరీటం కైవసం చేసుకుంది. Miss Sri Lanka New York after party. ?‍♂️?‍♂️?‍♂️?‍♂️?‍♂️?? pic.twitter.com/VIG09wgSPx — Under The … Read more