• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బట్లర్‌కు చాహల్ ఫన్నీ ప్రపోజల్: వీడియో వైరల్

    రాజస్తాన్ ప్లేయర్స్ జోష్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాహల్ ఫన్నీగా బట్లర్‌కు ప్రపోజ్ చేశాడు. ‘‘బట్లర్ నువ్వంటే చాలా ఇష్టం. తొలిసారి నిన్ను చూసినప్పుడే ప్రేమలో పడిపోయా. నువ్వే నా జీవితం. ప్రతి రోజూ గుర్తొస్తూనే ఉంటావ్. ప్లీజ్ నాతో డేటింగ్ చేస్తావా.’’ అంటూ చాహల్ ప్రపోజ్ చేశాడు. దీనికి బట్లర్ స్పందిస్తూ..‘‘ఓకే యుజీ.. ఖచ్చితంగా డేట్‌కు వస్తా.’’ అనగానే అక్కడున్న వారు గట్టిగా నవ్వుకున్నారు. The perfect proposal doesn’t exi- ? pic.twitter.com/vENeuVtfTq … Read more

    వధువును లాగిపెట్టి కొట్టిన వరుడు

    [వీడియో:](url) ఓ వధూవరుల జంట చేసిన పనికి అనుకోకుండా వైరల్ అయ్యారు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఓ నూతన జంట పెళ్లి రిసెప్షన్‌లో పాల్గొన్నారు. అక్కడ వారిద్దరి మధ్య ఓ సరదా గేమ్ పెట్టారు. ఈ గేమ్ ఎంతో ఆసక్తిగా సాగింది. చివరకు ఈ టాస్క్‌లో వధువే గెలిచింది. ఇక్కడే వరుడికి చిర్రెత్తుకొచ్చింది. వధువు గెలవడంతో పట్టరాని ఆవేశానికి గురయ్యాడు. ఇంకేముంది వధువను చాచిపెట్టి ఒక్కటి పీకాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #groom … Read more

    తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!

    [VIDEO](url): నడిరోడ్లపై బైక్‌ స్టంట్లు చేస్తూ యువత ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. అదేదో గొప్ప సాహసంలా భావిస్తూ కన్నవారికి కన్నీరు మిగుల్చుతున్నారు. ఇటీవల ఓ యువకుడు అర్ధరాత్రి వేళ బైక్‌ నడుపుతూ హ్యాండిల్‌ వదిలేసి, వెనక్కి పడుకున్నాడు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్‌లో షేర్ చేశారు. ‘తప్ప తాగి ఇదేం వెర్రి ఆనందమో!’ … Read more

    ఆగండయ్యా.. అలా అరవకండి ప్లీజ్

    [VIDEO](url): అనుష్క శర్మ వరుస ఈవెంట్లకు హాజరవుతోంది. తాజాగా బాలీవుడ్ హంగామా ఐకాన్ స్టైల్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా కెమెరామెన్లు అనుష్క.. అనుష్క అంటూ అరిచారు. ‘రిలాక్స్.. అలా ఎందుకు అరుస్తున్నారు.. నా చెవుల్లో గిల్లుమంటున్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే, నవ్వుతూనే ఇలా చెప్పడంతో ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. విరాట్ కోహ్లీతో కలిసి అనుష్క ఇండియన్ స్పోర్ట్స్ హానర్ ఈవెంట్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. Calm down??❤️#anushkasharma #viratkohli pic.twitter.com/LsWGMfPH0b … Read more

    ఇదండీ ఫిజిక్స్ అంటే.. ఈ వీడియోను చూశారా?

    [VIDEO:](url) సైన్స్‌లో రారాజుగా ఫిజిక్స్‌ని పిలుస్తుంటాం. భౌతిక శాస్త్ర నియమాలను ఆసరాగా చేసుకుని మ్యాజిక్ చేయొచ్చు. చాలామంది మెజీషియన్లకు ఫిజిక్స్ ఒక జీవనాధారం. అయితే, ఊహకు అందని కొన్ని చర్యలు ఫిజిక్స్ ద్వారా సాధ్యమవుతాయి. ఇందుకు ఈ వీడియోనే నిదర్శనం. ఇందులో కొన్ని ప్రయోగాలను చేసి చూపించారు. ఒక సొల్యూషన్‌లో వేస్తే రాగి తీగ వ్యాకోచం చెందడం, మరో సొల్యూషన్‌లో ఉంచితే తిరిగి యథాస్థితికి చేరడం; మాగ్నెటైజేషన్ ద్వారా ఓ వస్తువు తిరిగేలా చేయడం, చిన్నపాటి బొంగరాన్ని గాలిలో తిరిగేలా చేయడం.. ఇలా అన్నీ … Read more

    ఫొటోలు తీయబోయి కాలువలో పడిన మహిళ

    [VIDEO](url): సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పెళ్లిలో ఓ మహిళ వధూవరుల ఫొటోలు తీస్తూ డ్రైనెజ్ కాలువలో పడిపోయింది. ఈ వైరల్ వీడియోను కోటి మందికిపైగా వీక్షించారు. ఈ ఘటన ఎక్కడో జరిగిందో మాత్రం తెలియదు. కాలువలో పడిన మహిళకు మాత్రం ఏమికాలేదని తెలిసింది. https://www.instagram.com/p/CotmH2QPKB3/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

    వ్యక్తిని కంగారు పెట్టించిన కంగారూ

    ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తిని కంగారూ పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఏమైందో ఏమో ఓ వ్యక్తిని కంగారూ వెంబడించింది. ఈ క్రమంలో అతడు అదుపుతప్పి కిందపడిపోతాడు. అప్పుడ అది అతడని కాళ్లతో తన్నుతుంటుంది. చివరకు దాని నుంచి తప్పించుకుని ఓ కర్ర సాయంతో అదుపు చేస్తాడు. కానీ కంగారూ అస్సలు పట్టు విడవడం లేదు. ఎలాగోలా దాని బారి నుంచి ఆ వ్యక్తి బయటపడతాడు.

    బోల్తా పడిన కారు.. ఇలా పోతుందేంటి!

    ఈ [వీడియో](url) చూడండి. ఇదేంటి బోల్తా పడిన కారు అలా ప్రయాణిస్తోంది? అని ఆశ్చర్యపోతున్నారా..! చూడ్డానికి అలాగే కనిపిస్తున్నా.. ఆ కారు బోల్తా పడలేదు. ఓ వాహన ప్రియుడు కారుని ఇలా డిజైన్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. ఈ వీడియో లాన్స్ అనే ట్విటర్ ఖాతా ద్వారా బయటికొచ్చింది. క్షణాల్లోనే ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇది ఎక్కడ అనేది స్పష్టంగా తెలియలేదు. సదరు వ్యక్తి ఆలోచనకి వావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘చూస్తుంటే కాస్త అయోమయానికి గురైనట్లు … Read more

    అదృష్టమంటే ఇతడిదే.. వీడియో వైరల్

    రోడ్డుపై వెళ్తున్న బైకర్‌ పెను ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నాడు. ఓ భారీ ట్రక్కును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఉండగా.. పక్కనే ఉన్న కారు డోర్‌ని తీశారు. దీంతో కారు డోర్ తగిలి బైకర్ ఎగిరి పడ్డాడు. ఈ లోపు ట్రక్కు అతడిపైకి దూసుకొచ్చింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ట్రక్కును అక్కడే నిలిపేశారు. ట్రక్కు కింద ఉన్న బైకర్ మెళ్లిగా బయటకొచ్చాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘ట్రక్కుకి కుడినుంచి ఓవర్‌టేక్ చేయడం సరికాదు’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ‘అదృష్టవంతుడు.. తృటిలో తప్పించుకున్నాడు’ … Read more

    ఇంట్లో తోడుదొంగలు.. వీడియో వైరల్

    ఇంట్లో ఎవరూ లేకపోతే టీవీ చూడటానికి, ఆడుకోవడానికే పిల్లలు మొగ్గు చూపుతారు. అప్పుడు ఎంత హోం వర్క్ ఉన్నా సరే పక్కనపెట్టేస్తారు. అమ్మా, నాన్న చూస్తున్నారని తెలిస్తే అప్రమత్తమై చదువుతున్నట్లు నటిస్తారు. అయితే, డాడీ వచ్చారని తెలియక ఓ చిన్నారి టీవీ చూస్తూనే ఉంది. ఇంతలో అప్రమత్తమైన పెంపుడు శునకం యజమాని రాకను గుర్తించి చిన్నారిని అప్రమత్తం చేసింది. దీంతో ఆ బాలిక టీవీ కట్టేసి చదువుకున్నట్లుగా నటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి, శునకం ఇంట్లో తోడు … Read more