• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేషన్‌ కుంభకోణం.. మంత్రి అరెస్టు

    బంగాల్ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్‌ అరెస్టయ్యారు. తెల్లవారుజామున ఆయన్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. జ్యోతిప్రియో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి మాజీ వ్యక్తిగత సహాయకుడి నివాసంతో పాటు మొత్తం 8 ఫ్లాట్లలో తనిఖీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. 20 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం మంత్రిని తన ఇంట్లో అరెస్టు చేసి, ఈడీ కార్యాలయానికి తరలించారు.

    బ్యాలెట్ బాక్సు చేతపట్టుకుని పరుగో పరుగు!

    పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు దుండగులు పోలింగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను పట్టుకుని రోడ్లపై పరుగులు తీస్తూ కెమెరాకు చిక్కడం సంచలనమైంది. నేటి ఉదయం పోలింగు మొదలు కొని పలు చోట్ల విధ్వంసం, హత్యలు వంటి ఘటనలు చోటుచేసుంటూనే ఉన్నాయి. పకడ్బందీగా పోలీసులు పహారా కాస్తున్నప్పటికీ అల్లరిమూకలు మాత్రం హింసలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు ఈ ఘటనల్లో 9 మంది మృతి చెందారు. Video of person running with … Read more

    బ్యాలెట్ బాక్స్‌ని తగలబెట్టిన ఓటర్లు

    పంచాయతీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో అల్లకల్లోలం జరుగుతోంది. పార్టీల నేతల మధ్య జరిగిన ఘర్షణల్లో 9 మంది మృతి చెందారు. మరోవైపు, కూచ్ బిహార్ జిల్లాలోని దిన్హాటాలోని బరానచిరా పోలింగ్ కేంద్రంలో ఓటర్లు భగ్గుమన్నారు. బోగస్ ఓటింగ్ జరుగుతుందన్న ఆరోపణలతో బ్యాలెట్ బాక్స్‌ని తగలబెట్టారు. పోలింగ్ కేంద్రం నుంచి పెట్టెను బయటికి తీసుకొచ్చి నిప్పంటించారు. ఘర్షణలపై టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. #WATCH | West Bengal panchayat election | Ballot box at a polling … Read more

    కేంద్రమంత్రిపై బెంగాల్‌లో రాళ్ల దాడి

    [VIDEO:](url)కేంద్ర మంత్రి నిశిత్ ప్రామాణిక్‌పై బెంగాల్‌లో రాళ్ల దాడి జరిగింది. కూచ్‌బెహార్ జిల్లాలో మంత్రి కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్‌ని ప్రయోగించారు. బీజేపీ కార్యాలయానికి వెళ్తుండగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై నిశిత్ ప్రామాణిక్ స్పందించారు. టీఎంసీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పోలీసులు కూడా ప్రేక్షక పాత్రను పోషిస్తున్నారని విమర్శించారు. #WATCH | West Bengal: The convoy of Nisith Pramanik, MoS Home … Read more