• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌-కివీస్‌ మ్యాచ్‌.. బద్దలైన రికార్డ్స్‌

    నిన్న కివీస్‌తో జరిగిన టీమిండియా తరపున పలు రికార్డులు నమోదయ్యాయి. వన్డేల్లో వేగంగా 2000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ఘనత సాధించాడు. గిల్‌ 38 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయి చేరుకున్నాడు. ఐసీసీ టోర్నీల్లో 20 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌పై భారత్‌ తొలి విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో 36 వికెట్లు పడగొట్టి భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా షమీ నిలిచాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో కోహ్లీ రన్స్‌ 354కు చేరాయి. నిన్నటి మ్యాచ్‌తో రోహిత్‌ను (311) కోహ్లీ అధిగమించాడు.

    పాక్ పేసర్లను ఉతికారేస్తున్న ఆసీస్ ఓపెనర్లు

    వరల్డ్ కప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పాక్ బౌలర్లకు చుక్కలు, చూపిస్తున్నారు. ఓపెనర్లుగా వచ్చిన ఇద్దరు బ్యాటర్లు చెరో సెంచరీ నమోదు చేశారు. ప్రస్తుతం ఆసీస్ ఒక్క వికెట్ ‌కూడా నష్టపోకుండా 30 ఓవర్లలో 200పైగా పరుగులు చేసింది.

    టాస్‌ నెగ్గిన భారత్‌.. పాక్‌కు బ్యాటింగ్‌

    పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తుది జట్లు ఇలా.. భారత్‌: రోహిత్, గిల్‌, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్ యాదవ్, శార్దుల్‌ ఠాకూర్‌, బుమ్రా, సిరాజ్. పాక్‌: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజాం, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్‌

    రోహిత్‌తో జాగ్రత్త: పాక్‌ మాజీలు

    భారత్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో పాక్‌ బౌలర్లకు ఆ జట్టు మాజీలు వసీమ్‌ అక్రమ్, మిస్బా ఉల్ హక్‌ కీలక సూచనలు చేశారు. ‘రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడికి బౌలింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోహ్లీ కూడా రెండు వరుస హాఫ్‌ సెంచరీలతో ఫామ్‌లో ఉన్నాడు. కానీ, కోహ్లీ కంటే రోహిత్‌ విభిన్న తరహా బ్యాటర్‌. బంతిని ఎదుర్కోవడానికి రోహిత్ వద్ద అదనపు సమయం ఉన్నట్లు అనిపిస్తుంది. అతడికి బౌలింగ్‌ ఎక్కడ వేయాలనే దానిపై తీవ్ర కసరత్తు చేయాల్సిందే’ అని సలహా ఇచ్చారు.

    అహ్మదాబాద్‌కు చేరుకున్న పాక్ జట్టు

    వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబరు 14న ఈ రెండు జట్లు ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్‌ జట్టు అహ్మదాబాద్‌కు చేరుకుంది. మరోవైపు.. భారత్, ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ ముగించుకున్న తర్వాత అహ్మదాబాద్‌కు పయనం కానుంది.

    ENG vs BAN: ఇంగ్లాండ్ విజయం

    బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ భారీగా పరుగులు రాబట్టింది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 364 పరుగులు లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందుంచింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ప్రారంభంలోనే బంగ్లా మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ (74) రహీమ్ (51) హృదయ్ (39) పరుగులు చేసి పర్యాలేదనిపించారు.

    క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు

    ఆఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు చాటుకున్నాడు. ఆఫ్గాన్ భూకంప బాధితులకు తన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ఫీజును విరాళంగా ప్రకటించాడు. రషీద్ మాట్లాడుతూ.. ‘ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్, ఫరా, బాద్గీస్‌ ప్రాంతాల్లో సంభవించిన భూకంపం తీవ్రవిషాదం మిగిల్చింది. తాను ప్రపంచ కప్ 2023 కోసం మొత్తం ఫీజును కష్టాల్లో ఉన్న ప్రజలకు విరాళంగా ఇస్తున్నాను. భూకంపంలో దాదాపు 2400 పైగా మృతి చెందడం బాధను కలిగించింది’. అని రషీద్ పేర్కొన్నాడు.

    భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. కొత్తగా 14వేల టికెట్లు

    వరల్డ్‌కప్‌లో భారత్-పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 14న జరగనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడాలని భావించే వారికి బీసీసీఐ శుభవార్త చెప్పింది. కొత్తగా 14 వేల టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://tickets.cricketworldcup.com వెబ్‌సైట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. భారత్‌-పాక్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నరేంద్రమోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.

    రికార్డుల కోసం ఆడొద్దు: రోహిత్‌

    ఆసీస్‌తో తొలి మ్యాచ్‌కు ముందు సహచర క్రికెటర్లకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక సూచనలు చేశాడు. వరల్డ్‌ కప్‌ వంటి మెగా టోర్నీల్లో ఎవరూ వ్యక్తిగత రికార్డులకు ప్రాధాన్యత ఇవ్వొద్దని సూచించాడు. అందుకు మెగా సంగ్రామం వేదికగా కాదని పేర్కొన్నాడు. జట్టులో హార్దిక్ వంటి పేస్‌ ఆల్‌రౌండర్ ఉండటం వల్ల స్పిన్నర్లను అదనంగా తీసుకొనేందుకు వీలు కలుగుతుందని రోహిత్ వ్యాఖ్యానించాడు. ‘నాణ్యమైన పేస్‌, స్పీడ్‌తో హార్దిక్‌ బౌలింగ్‌ చేస్తాడు. దీంతో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో మ్యాచ్‌ ఆడేందుకు వీలుంది. ఇది జట్టుకు … Read more

    వరల్డ్‌కప్‌లో భారత్‌ తొలి పోరు నేడే

    వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తొలి పోరుకు సిద్ధమైంది. నేడు చెన్నై చెపాక్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ గిల్‌ అందుబాటులో లేకున్నా ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషనే అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. రోహిత్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజాలతో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక చెపాక్‌ స్టేడియంలో స్పిన్నర్లదే హవా. కాబట్టి జడేజా, కుల్‌దీప్‌లకు తోడుగా అశ్విన్‌ను ఆడించొచ్చు. బుమ్రా, సిరాజ్‌లను మాత్రమే పేసర్లుగా బరిలోకి దింపొచ్చు. మ. … Read more