• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pak Vs Ned: 49 ఓవర్లలో పాక్‌ ఆలౌట్‌

    వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు పాకిస్తాన్‌‌తో నెదర్లాండ్స్ తలపడుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన నెదర్లాండ్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు రిజ్వాన్‌ (68) సౌద్‌ షకీల్‌ (68) మహ్మద్ నవాజ్ (39) పరుగులు చేసి జట్టు స్కోరును అందించడంతో తోడ్పడ్డారు.

    ఏది జరగాలని ఉందో అదే జరిగింది: సంజూ

    వన్డే వరల్డ్‌కప్‌-2023లో సంజూను శాంసన్ సెలక్టర్లు మొండిచేయి చూపిన విషయం తెలిసిందే. బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతడికి చోటివ్వలేదు. దీనిపై సంజూ స్పందిస్తూ. ‘‘ఏది జరగాలని ఉందో అదే జరిగింది. నేను మాత్రం ముందుకు సాగిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అంటూ సంజూ ట్వీట్ చేశారు. అతడు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

    ఇంగ్లాండ్‌ జట్టుకు చేదు అనుభవం

    వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌ జట్టుకు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. దాదాపు 38 గంటల పాటు ఆ జట్టు ఆటగాళ్లు ఎకానమీ క్లాస్‌లో విమానంలో ప్రయాణించారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ‘అంతా గందరగోళంగా ఉంది. విమానంలోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు 38 గంటలకుపైగా ప్రయాణం సాగింది’ అంటూ నవ్వుతున్న ఎమోజిని బెయిర్‌ స్టో క్యాప్షన్‌గా పెట్టాడు. ఆ ఫోటోలో కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌ … Read more

    కేఎల్ రాహుల్ మరో రికార్డ్

    లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధసెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 105 ఇన్నింగ్స్‌ల్లోనే 4 వేల రన్స్ పూర్తి చేసుకున్న ఆటగాడిగా రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో గేల్(112), వార్నర్(114), కోహ్లీ(128), డివిలియర్స్(131) లాంటి ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డుతో రాహుల్ మెరిశాడు. గత కొంతకాలంగా రాహుల్‌ సరైన ఫామ్‌లో లేడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లోనూ … Read more

    అతి పెద్ద హాకీ స్టిక్; పట్నాయక్ మరో కళాఖండం

    ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో అద్భుత కళాఖండం ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద హాకీ స్టిక్‌ను తయారు చేశారు. 5 టన్నుల ఇసుక, 5,000 వేల హాకీ బంతులతో 105 అడుగుల పొడవైన[ హాకీ స్టిక్](url) రూపొందించారు. కటక్‌లోని మహానది ఒడ్డును ఈ అద్భుతాన్ని పట్నాయక్ ఆవిష్కరించాడు. కాగా ఒడిశాలో 2023 ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్‌కప్ టోర్నమెంట్ జరగనుంది. జనవరి 13 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. భువనేశ్వర్‌లో తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. #WATCH … Read more

    డజను గోల్స్‌ను చూసి తీరాల్సిందే

    ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభమైన 12వ రోజు గోల్స్ వర్షం కురిసింది. ఆ రోజు మొత్తం 4 మ్యాచ్‌లు జరగ్గా 12 గోల్స్ నమోదయ్యాయి. ప్రపంచ అగ్ర శ్రేణి జట్టు బెల్జియం ఓటమితో ఇంటిదారి పట్టింది. తన చివరి మ్యాచ్‌లో క్రొయేషియాతో 0-0తో ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగింది. మరోవైపు అర్జెంటీనా ముందడుగు వేసింది. పోలాండ్‌ను ఓడించి ప్రి క్వార్టర్స్‌కు చేరింది. ఇక మెక్సికోను దురదృష్టం వెంటాడింది. చివరి మ్యాచ్‌లో గెలిచినా వరల్డ్‌కప్ నుంచి తప్పుకోక తప్పలేదు.

    India wins U19 2022 World cup and creates history

    టీమిండియా U19 జట్టు చరిత్రను తిరగరాస్తూ ఈ రోజు ఇంగ్లండ్ U19 జట్టు మీద 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ U19 జట్టు కేవలం 189 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియన్ బౌలర్లలో రాజ్ బవ 5 వికెట్లతో సత్తా చాటాడు. చేధనలో ఆంధ్ర కుర్రాడు టీమిండియా U19 వైస్ కెప్టెన్ రషీద్ (50), నిషాంత్ సింధు (50*) రాణించడంతో ఇండియా విజయం సాధించింది. టీమిండియా యువ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం … Read more