టీమిండియా U19 జట్టు చరిత్రను తిరగరాస్తూ ఈ రోజు ఇంగ్లండ్ U19 జట్టు మీద 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ U19 జట్టు కేవలం 189 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియన్ బౌలర్లలో రాజ్ బవ 5 వికెట్లతో సత్తా చాటాడు. చేధనలో ఆంధ్ర కుర్రాడు టీమిండియా U19 వైస్ కెప్టెన్ రషీద్ (50), నిషాంత్ సింధు (50*) రాణించడంతో ఇండియా విజయం సాధించింది. టీమిండియా యువ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం కైవసం చేసుకుంది. ఇప్పటికే నాలుగు సార్లు టీమిండియాకు U19 టైటిళ్లు వచ్చాయి. ఇది ఐదో U19 వరల్డ్‌కప్ టైటిల్.
U19 వరల్డ్ కప్‌ని గెలవడం మన దేశానికి ఇదేం తొలి సారి కాకపోయినా కానీ ఎందుకో ఈ గెలుపు మాత్రం చాలా స్పెషల్‌గా కనిపిస్తోంది. కుర్రాళ్లు కనబర్చిన ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది.
కరోనా కంగారు పెట్టినా..
U19 వరల్డ్ కప్‌లో అడుగుపెట్టిన యువ భారత్‌ను కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేసింది. కొన్ని మ్యాచుల తర్వాత కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో పాటు జట్టులోని చాలా మంది సభ్యులు కరోనా బారినపడ్డారు. అయినా కానీ భారత జట్టు ఇక్కడి వరకు వచ్చి కప్పును కైవసం చేసుకుందంటే కుర్రాళ్లు తెగువ, వారి ఆటపై వారికున్న నమ్మకం, దేశంపై ఉన్న ప్రేమ వెలకట్టలేనివి.
ఇండియా జర్నీ సాగిందిలా..
గ్రూప్ బీలో ఉన్న ఇండియా అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఫైనల్ గడప తొక్కే క్రమంలో ఏ జట్టుతో ఎలా విజయం సాధించిందో చూసుకుంటే…
Dt | VS | ఫలితం | MOM |
15 జనవరి | సౌతాఫ్రికా | 45 పరుగులతో విజయం. | విక్కీ ఓస్వ్తాల్ |
19 జనవరి | ఐర్లాండ్ | 174 పరుగులతో విజయం | హర్నూర్ సింగ్ |
22 జనవరి | ఉగాండ | 326 పరుగులతో విజయం | రాజ్ బవ |
29 జనవరి | బంగ్లాదేశ్ | 5 వికెట్ల తేడాతో విజయం | రవి కుమార్ |
2 ఫిబ్రవరి | ఆస్ట్రేలియా | 96 పరుగులతో విజయం | యశ్ ధుల్ |
5 ఫిబ్రవరి | ఇంగ్లండ్ | 4 వికెట్లతో విజయం | రాజ్ బవ |
మన ఆంధ్రా ఆటగాడు..
ఇండియా U19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ తెలుగు వాడు కావడం విశేషం. రషీద్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా. ఆసీస్ U19 జట్టుతో జరిగిన సెమీ ఫైనల్లో రషీద్ 94 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. సెంచరీ చేయకపోయినా రషీద్ నిలకడైన తన ఆట తీరుతో లక్షల మంది అభిమానుల మనసులను గెల్చుకున్నాడు. ఫైనల్లో కూడా రషీద్ అర్ధ సెంచరీ చేశాడు.
U19 కప్ కోసం పోటీ పడ్డ జట్ల వివరాలు..
- అఫ్ఘనిస్తాన్ U19
- ఆస్ట్రేలియా U19
- ఇంగ్లండ్ U19
- బంగ్లాదేశ్ U19
- శ్రీలంక U19
- ఇండియా U19
- పాకిస్తాన్ U19
- ఐర్లాండ్ U19
- సౌతాఫ్రికా U19
- వెస్టిండీస్ U19
- జ్వింబాంబే U19
- కెనడా U19
- పుపువా న్యూ గినియా U19
- స్కాట్లాండ్ U19
- ఉగాండ U19
- UAE U19
ఇండియా స్వ్కాడ్..
- యశ్ ధుల్ (కెప్టెన్)
- షేక్ రషీద్ (వైస్ కెప్టెన్)
- దినేష్ బన (కీపర్)
- రాజ్ అంగడ్ బవ
- అనీశ్వర్ గౌతమ్
- రాజ్‌వర్ధన్ హంగర్కర్
- విక్కీ ఓస్వ్తాల్
- మనవ్ ప్రకాశ్
- అంగ్‌క్రిష్ రఘువన్షి
- రవి కుమార్
- గౌరవ్ సంగ్వాన్
- నిషాంత్ సింధు
- హర్నూర్ సింగ్
- కౌశల్ తంబే
- వాసు వట్స్
- ఆరాధ్య యాదవ్ (కీపర్)
- సిద్ధార్థ్ యాదవ్
- రిషిత్ రెడ్డి, ఉదయ్ సహరన్, అన్ష్ గోసాయ్, అమ్రిత్ రాజ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోర్ (రిజర్వ్ ప్లేయర్స్)
సపోర్ట్ స్టాఫ్..
U19 వరల్డ్‌కప్ గ్రూపులు..
గ్రూప్ | జట్లు | టాపర్ |
గ్రూప్ A | ఇంగ్లండ్ బంగ్లాదేశ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కెనడా | ఇంగ్లండ్ |
గ్రూప్ B | ఇండియా సౌతాఫ్రికా ఐర్లాండ్ ఉగాండ | ఇండియా |
గ్రూప్ C | పాకిస్తాన్ అఫ్ఘనిస్తాన్ జ్వింబాంబే పుపువాన్యూగినియా | పాకిస్తాన్ |
గ్రూప్ D | శ్రీలంక ఆస్ట్రేలియా వెస్టిండీస్ స్కాట్లాండ్ | శ్రీలంక |
U19 వరల్డ్‌కప్‌లో టీమిండియా రికార్డులు
ఇప్పటి వరకు ఇండియా 14 పర్యాయాలు U19 వరల్డ్ కప్‌లో పాల్గొంటే అందులో 4 సార్లు టైటిల్ నెగ్గింది. (నేటి విజయంతో కలిపి ఐదో సారి) అలాగే మూడు సార్లు రన్నరప్స్‌గా నిలిచింది. U19 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన జట్టేదైనా ఉందా అంటే అది కేవలం ఇండియన్ U19 జట్టు మాత్రమే. మన U19 జట్టు తర్వాతే ప్రపంచంలో ఏ U19 జట్టైనా. అంతలా మన కుర్రాళ్లు సత్తా చాటారు.
సత్తా చాటుతున్న U19 ప్లేయర్లు..
U19 టీమ్ ద్వారా తమ ప్రతిభను నలుగురికీ పరిచయం చేసి తర్వాత టీమిండియా గడపతొక్కిన క్రికెటర్లెందరో ఉన్నారు. వారంతా ఇప్పుడు స్టార్ హోదాను అనుభవిస్తున్నారు.