• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఈ సారి వరల్డ్‌ కప్‌ మనదే: రజనీకాంత్‌

  వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా సెమీఫైనల్ గురించి మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్ బ్యాటింగ్ అప్పుడూ మొదట కాసేపు టెన్షన్‌ పడ్డాం. ఒక్కో వికెట్‌ పడేకొద్దీ పరిస్థితి మనకు అనుకూలంగా మారింది. ఈసారి ప్రపంచకప్‌ వందశాతం భారత్‌కే వస్తుంది’ అని రజనీ చెప్పుకొచ్చారు. అలాగే సెమీఫైనల్స్‌లో రికార్డులు సృష్టించిన కోహ్లీ, షమీలకు రజనీ శుభాకాంక్షలు తెలిపారు.

  ప్రపంచకప్‌లో వైఫల్యంపై స్పందించిన పాక్ కెప్టెన్

  ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ వైఫల్యంపై వస్తున్న విమర్శలపై కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ స్పందించారు. టీవీలో మాటలు చెప్పడం సులువని వ్యాఖ్యానించాడు. ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే తనకు నేరుగా ఫోన్‌ చేయొచ్చన్నారు. మూడేళ్లుగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. సారథ్యాన్ని ఎప్పుడూ భారంగా భావించలేదని చెప్పారు. ‘ప్రపంచకప్‌లో ఆడుతున్నప్పుడు ఒత్తిడిలో లేను. ఫీల్డింగ్‌లో నూటికి నూరు శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు పరుగులు రాబట్టి జట్టుకు విజయాన్ని అందించాలని ఆలోచిస్తా’. అని బాబర్‌ వివరించాడు.

  న్యూజిలాండ్‌ ఘన విజయం

  వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ అదరగొట్టింది. శ్రీలంక నిర్దేశించిన 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ ఐదు వికెట్లు కోల్పోయి 23.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే (45; 42 బంతుల్లో 9 ఫోర్లు), రచిన్‌ రవీంద్ర (42; 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కివీస్‌కు శుభారంభం అందించారు. తర్వాత వచ్చిన డారిల్‌ మిచెల్ (43; 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 2, మహీశ్ తీక్షణ, దుష్మంత … Read more

  NZ vs RSA: దక్షిణాఫ్రికా భారీ స్కోరు

  న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 స్కోరు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్వింటన్‌ డీకాక్‌ (114), డస్సెన్‌ (133) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు ఏకంగా 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివర్లో డేవిడ్‌ మిల్లర్‌ 53 (30 బంతుల్లో) క్లాసెన్ 15 (7 బంతుల్లో) వేగంగా రన్స్‌ చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌతీ 2 వికెట్లు పడగొట్టగా.. … Read more

  అఫ్గాన్‌కు సెమీస్‌ ఆశలు సజీవం.. ఎలాగంటే?

  ఈ వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ మూడు విజయాలు సాధించింది. అఫ్గాన్‌, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌, శ్రీలంకను ఓడించింది. ఒకప్పుడు ఛాంపియన్‌గా నిలిచిన జట్టపై ఆఫ్గాన్ సంచలన విజయాలను నమోదు చేసింది. నిన్న లంకపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అఫ్గాన్ ఐదో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో అఫ్గాన్‌ ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు భారీ తేడాతో విజయం సాధిస్తే.. ఆస్ట్రేలియా ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచినా అఫ్గాన్‌ సెమీస్‌కు చేరే అవకాశం ఉంది.

  వికెట్లపై పడ్డ శ్రీలంక కీపర్‌

  శ్రీ‌లంక వికెట్ కీప‌ర్ కుశాల్ మెండిస్ వికెట్ల‌పై ప‌డిపోయాడు. సోమ‌వారం అఫ్గానిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అఫ్గ‌న్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో బంతిని అందుకునే క్ర‌మంలో బ్యాలెన్స్ త‌ప్పిన మెండిస్ అమాంతం వికెట్ల‌ను నెట్టుకుంటూ కింద పడ్డాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ చేతిలో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసింది. నాలుగు ఓటములతో ఆరో స్థానానికి పడిపోయింది. https://www.instagram.com/reel/CzB1oc-vufc/?utm_source=ig_web_copy_link

  బుమ్రా అత్యుత్తమ బౌలర్‌: వసీం

  ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రానే అత్యుత్తమ బౌలర్‌ అని పాక్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ అన్నారు. ‘ఇంగ్లాండ్‌ బ్యాటర్లను బుమ్రా భలే బోల్తా కొట్టించాడు. అతడి లెంగ్తే బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. బుమ్రా బౌలింగ్‌ వేగం, లెంగ్త్‌ అద్భుతం. నియంత్రణతో కూడిన వేగం, వైవిధ్యం వల్లే బుమ్రా స్థిరంగా రాణించగలుగుతున్నాడు. ఔట్‌ స్వింగర్లను నా మాదిరే వేస్తున్నాడు. అంతేకాదు కొన్నిసార్లు నన్ను మించిన నియంత్రణతో బౌలింగ్‌ చేస్తున్నాడు’ అని అక్రమ్‌ పొగడ్తలతో ముంచెత్తాడు.

  టీమిండియా సెమీస్‌ బెర్త్ ఖాయమైందా?

  ఇంగ్లాండ్‌పై విజయంతో టీమిండియా తన సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో అయిదు ఓడిన ఇంగ్లాండ్‌ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సెమీస్‌ చేరే ఛాన్స్ లేదు. బంగ్లాదేశ్‌ కూడా 5 ఓటములతో సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది. 6 మ్యాచ్‌ల్లో 5 నెగ్గిన దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరువలో ఉంది. ఆసీస్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), కివీస్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) సెమీస్ రేసులో మెరుగైన స్థితిలో ఉన్నాయి. శ్రీలంక (5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), … Read more

  ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయం

  ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో గెలుపొందింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు షాకిచ్చారు. దూకుడుగా బౌలింగ్ చేసి 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ చేశారు. షమీ 4 వికెట్లు పడగొట్టగా బుమ్రాకు 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ సాధించాడు. వరల్డ్ కప్‌లో ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి భారత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి … Read more

  AUS vs NZ: రెండు రికార్డులు బద్దలు

  ప్రస్తుతం జరుగుతున్న ఆసీస్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో రెండు రికార్డులు బద్దలయ్యాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌ తొలి పవర్‌ప్లేలో ఏకంగా 118 పరుగులు సాధించింది. వరల్డ్‌కప్‌లో ఆసీస్‌కు ఇదే అత్యధిక ఫస్ట్‌ పవర్‌ప్లే స్కోర్‌. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (81), ట్రావిడ్‌ హెడ్ (109) తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అటు హెడ్‌ 59 బంతుల్లోనే 6 సిక్సర్లు, 10 ఫోర్లతో సెంచరీ బాది వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (63 … Read more