• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా కూర్పులో గందరగోళం

    ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయంతో దూరం కావడంతో టీమిండియా కూర్పులో గందరగోళం నెలకొంది. రేపు ఇంగ్లాండ్‌తో లక్నో వేదికగా మ్యాచ్ జరగనుంది. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండనుండటంతో థర్డ్‌ స్పిన్నర్‌గా అశ్విన్‌ను తీసుకునే ఛాన్స్‌ కనిపిస్తోంది. అదే జరిగితే పేసర్లలో బుమ్రాకు తోడుగా షమీ లేదా సిరాజ్‌లలో ఎవర్నీ తీసుకోవాలన్న సందిగ్దం నెలకొంది. అటు బ్యాటింగ్‌లో కివీస్‌ మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్‌ను కొనసాగించాలా? లేదా ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌కు చోటివ్వాలా అన్న ప్రశ్న టీమిండియాకు ఎదురవుతోంది.

    వరల్డ్‌కప్‌లో కోహ్లీ ఆహారం ఇదే..!

    ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ ఆహార నియమాల గురించి ఆయన బస చేసిన హోటల్‌ చెఫ్‌ అనుష్మాన్‌ బాలి వెల్లడించాడు. విరాట్‌ శాఖాహారి కాబట్టి ఉడకబెట్టిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘విరాట్ ఆవిరితో ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. డిమ్‌ సమ్స్‌, సోయా, మాక్‌ మీట్‌, టోఫూ, లీన్‌ వంటి ప్రోటీన్‌ ఆధారిత ఆహారాన్ని ఫుడ్‌ మెనూగా ఎంచుకుంటున్నారు’ అని చెప్పారు. అటు చాలా మంది ఆటగాళ్లు అధిక ప్రోటీన్‌లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నట్లు బాలి వెల్లడించారు.

    మనకు మంచే జరుగుతుంది: ధోని

    వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రదర్శనపై మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్‌ ధోని తొలిసారి స్పందించాడు. ‘ఇప్పుడు వరల్డ్‌ కప్‌లో ఆడుతున్న టీమ్‌ఇండియా బాగుంది. అన్ని విభాగాలూ సమతూకంగా, పటిష్ఠంగా ఉన్నాయి. ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌నూ గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పను. కచ్చితంగా మనకు శుభం జరుగుతుందనే నమ్మకం ఉంది. 2019లో కొద్దిలో ఓడిపోయి సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టడం బాధించింది’ అని అన్నాడు.

    నేడు పాకిస్తాన్‌కు చావో రేవో

    ప్రపంచకప్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాతో పాక్‌ తలపడనుంది. ఐదు మ్యాచ్‌లు ఆడిన పాక్‌ రెండింట్లో మాత్రమే గెలిచి ఆరో స్థానానికి పడిపోయింది. దీంతో సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌ పాక్‌కు కీలకం కానుంది. పాక్‌ సెమీస్‌కు వెళ్లాలంటే ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్‌లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అయితే నిలకడలేని బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ కూడా ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మరోవైపు సౌతాఫ్రికా అన్ని రంగాల్లో పాక్‌ కంటే ఎంతో బలంగా ఉంది. చెన్నైలో మ. 2.00 గం.లకు మ్యాచ్‌ ప్రారంభం … Read more

    వరల్డ్‌కప్‌ నుంచి హార్దిక్‌ ఔట్‌..!

    వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత్‌కు బిగ్‌ షాక్‌ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. గాయంతో కివీస్‌తో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్‌ పాండ్య టోర్నీ మెుత్తానికి దూరమయ్యే ఛాన్సెస్‌ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. హార్దిక్‌ది చీలమండ గాయమని భావించినప్పటికీ లిగమెంట్‌లోనూ చీలిక బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కథనాలే వాస్తవమైతే హార్దిక్‌కు కనీసం నాలుగు వారాల విశ్రాంతి అవసరం ఉంటుంది. అప్పుడు ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు సైతం హార్దిక్‌ దూరం కావచ్చు.

    అది భయానక అనుభవం: మ్యాక్స్‌వెల్

    ఆసీస్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో నిర్వహించిన లైటింగ్‌ షో హైలెట్‌గా నిలిచింది. అయితే దీనిపై ఆసీస్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దాని వల్ల క్రికెటర్లకు తలనొప్పి వచ్చేస్తోందని అన్నారు. ‘బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ ఇలాంటి లైటింగ్‌ షోనే నిర్వహించారు. అప్పుడు నాతో పాటు క్రికెటర్లందరూ ఇబ్బందిపడ్డారు. అందుకే ఆ షో జరిగే 2 నిమిషాలు కళ్లు మూసుకోవడానికే ప్రయత్నిస్తా. లైటింగ్‌ వల్ల అభిమానులు గొప్ప అనుభూతిని పొందుతారేమో. క్రికెటర్లకు మాత్రం అది భయానక అనుభవమే అవుతుంది’ అని మ్యాక్సీ అన్నాడు. … Read more

    ప్రతిక్షణం మెరుగయ్యేందుకే యత్నిస్తా: కోహ్లీ

    ప్రతిక్షణం మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తుంటానని భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. అందుకోసం నిరంతరం శ్రమిస్తుంటానని తెలిపాడు. ‘ప్రదర్శన మాత్రమే లక్ష్యమైతే కొంతకాలం తర్వాత సంతృప్తి చెందొచ్చు. ఆటపై పనిచేయడం మానేయొచ్చు. కానీ నేను ఎప్పుడూ నైపుణ్యం మెరుగుపరుచుకోడానికే ప్రయత్నిస్తుంటా. దానికి హద్దు లేదన్నది నా నమ్మకం. కాబట్టే సుదీర్ఘ కాలం ఆడుతూ ఉత్తమ ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోహ్లీ 118 సగటుతో 354 పరుగులు చేశాడు.

    అగ్రస్థానానికి చేరువలో గిల్‌

    భారత ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకింగ్‌కు చేరువయ్యాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో 823 పాయింట్లతో గిల్‌ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న బాబర్‌ అజాం (829), గిల్‌ మధ్య తేడా ఆరు పాయింట్లు మాత్రమే. ప్రపంచకప్‌లో గిల్‌ నిలకడగా రాణిస్తే త్వరలోనే నంబన్‌వన్‌ ర్యాంకు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. డెంగీ కారణంగా వరల్డ్‌కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన గిల్‌.. తర్వాతి మూడింట్లో 95 పరుగులు రాబట్టడం గమనార్హం.

    బాబర్‌ను కెప్టెన్‌గా తీసేయండి: మాజీలు

    అఫ్గాన్‌ చేతిలో ఓటమితో పాక్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌పై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ పేసర్ అకీబ్ జావెద్ మాట్లాడుతూ ‘వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత బాబర్ అజామ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలి. అతడి స్థానంలో వైట్‌బాల్‌ క్రికెట్‌కు షహీన్ అఫ్రిదిని కెప్టెన్‌గా చేస్తే బాగుంటుంది’ అని అన్నాడు. మరోవైపు ‘బాబర్‌ అజామ్ కెప్టెన్సీ దారుణంగా ఉంది. బౌలర్లను వినియోగించుకున్న తీరు సరికాదు. పవర్‌ ప్లే ఓవర్లలో హారిస్‌ రవూఫ్‌ను తీసుకురావడం శుద్ధ దండగ. ఫీల్డింగ్‌ సెటప్‌ కూడా దారుణంగా ఉంది’ అని … Read more

    ‘8 కిలోల మటన్‌ తింటున్నారు.. ఫిట్‌నెస్‌ ఏది?’

    అఫ్గనిస్తాన్ చేతిలో పాక్‌ ఓటమిని ఆ జట్టు మాజీలు జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్‌ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ మాజీ ప్లేయర్‌ వసీం అక్రమ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘పాక్‌ జట్టు ఫీల్డింగ్‌, ఫిట్‌నెస్‌ స్థాయి ఎలా ఉందో చూడండి. రెండేళ్లుగా ఈ ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించలేదని గత మూడు వారాలుగా మొత్తుకుంటున్నాం. ఒక్కొక్కరి పేర్లు చెబితే వారి ముఖాలు చిన్నబోతాయి. వీళ్లు రోజుకు 8 కిలోల మటన్‌ తింటున్నారు. మరి ఫిట్‌నెస్‌ పరీక్షలు ఉండకూడదా?’ అని అక్రమ్‌ విమర్శించాడు.