Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?

    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?

    October 22, 2024

    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

    సూపర్ స్టార్ మహేష్ బాబు

    సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి.

    వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు.

    జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S – Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5  (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది. 

    వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన  రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు.

    జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది.

    విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం.

    ప్రభాస్ కార్ కలెక్షన్లు

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం.

    ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే?

    ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.

     Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది.

     Rolls Royce Ghost

    ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు

    Jaguar XJL 

    ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత  కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు.

     Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు 

    BMW X5 

    ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 

    Lamborghini Aventador Roadster 

     లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.  ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది.

    Range Rover SV Autobiography 

    ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది.

    అల్లు అర్జున్ లగ్జరీ  కార్ కలెక్షన్స్

    పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం.

    జాగ్వార్ XJL 

    దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది.

    హమ్మర్ H2 

    అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు… హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ ‘బ్యాడ్ బాయ్‌’గా పిలుచుకుంటారు. 

    వోల్వో XC90 T8

    ఇది  వోల్వో  ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు  

    ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని ‘ది బీస్ట్‌గా’ పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు. 

    ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే.

    రామ్‌చరణ్ లగ్జరీ  కార్ కలెక్షన్లు

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.  విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం.

    Ferrari Portofino

    రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు.

    ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది.

    రోల్స్ రాయిస్ ఫాంటమ్ – రూ 9.57 కోట్లు

    మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు 

    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు

    ఫెరారీ పోర్టోఫినో – రూ 3.50 కోట్లు

    రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ – రూ 2.75 కోట్లు

    BMW 7 సిరీస్ – రూ. 1.75 కోట్లు

    Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి

    ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు.

    విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు

    రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు  లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.  అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.  Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.  తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు.

    నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు

    అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది.

    ఫెరారీ 488GTB — (రూ. 3.88cr)

    నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)

    Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr)

    BMW 740 Li — (రూ. 1.30cr)

    నిస్సాన్ GT-R — (రూ. 2.12cr)

    2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr)

    MV అగస్టా F4 — (రూ. 35L)

    BMW 9RT — (రూ. 18.50L)

    నాని లగ్జరీ కారు కలెక్షన్

    నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,  టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు.

    రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్

    రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు. 

    అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా

     రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్,

     రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR,

    రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ .

    రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-  

    రూ. కోటి విలువైన BMW X3.

    విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్

    విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. ‘వెళ్లిపోమాకే’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఫలక్‌నామాదాస్’ చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘హిట్’, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘దాస్‌కా ధమ్కీ’, ‘ఓరిదేవుడా’ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.

    విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు

    శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్

    శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.  విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన ‘గమ్యం’ సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, ‘పడి పడి లేచె మనసు’, జర్నీ ‘శ్రీకారం’ వంటి హిట్ చిత్రాలతో  స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం.

    రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు

    ఆడి Q7- రూ. 90 లక్షలు

    BMW 530D- రూ. 75 లక్షలు

    ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు

    నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్

     హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం.

    రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ – రూ.3.43కోట్లు

    Fiery Red Mercedes Sports Coupe-  దీని ధర రూ.3.33కోట్లు

    రోల్స్ రాయిస్ గోస్ట్ – రూ.7.50 కోట్లు

    సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్  

    సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు.

    సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version