• TFIDB EN
  • మనమే
    U/ATelugu
    విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    YouSay Review

    Manamey Movie Review: శర్వానంద్‌, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్‌ పెట్టిందా?

    యంగ్‌ హీరో శర్వానంద్‌ చేసిన చిత్రాలకు టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలుస్తాయి. పక్కింటి అబ్బాయిలా కనిపించే చిత్రాల్లో నటించి చాలా సార్లు ఆడియన్స్‌ను మెప్పి...read more

    How was the movie?

    తారాగణం
    శర్వానంద్
    కృతి శెట్టి
    రాహుల్ రామకృష్ణ
    సీరత్ కపూర్
    రాహుల్ రవీంద్రన్
    అయేషా ఖాన్
    వెన్నెల కిషోర్
    సిబ్బంది
    శ్రీరామ్ ఆదిత్య
    దర్శకుడు
    టీజీ విశ్వ ప్రసాద్నిర్మాత
    హేషామ్ అబ్దుల్ వహాబ్
    సంగీతకారుడు
    విష్ణు శర్మసినిమాటోగ్రాఫర్
    కథనాలు
    Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్‌ విన్నర్‌ ఏది?
    Movie Collections: ‘మనమే’, ‘సత్యభామ’ చిత్రాల్లో ఫ్రైడే బాక్సాఫీస్‌ విన్నర్‌ ఏది?
    గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్‌ వద్ద చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ వద్ద 10 చిత్రాలు బరిలో నిలిచాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు. ఒకటి శర్వానంద్‌ నటించిన ‘మనమే’ (Manamey) కాగా.. రెండో కాజల్ చేసిన ‘సత్యభామ’ (Satyabhama) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు తొలి ఆటతోనే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే కాజల్‌, శర్వానంద్‌ చిత్రాలలో ఏది తొలిరోజు బాక్సాఫీస్‌ విజేతగా నిలిచింది? ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.  మనమే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం 'మనమే'. ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. హీరో రామ్‌ చరణ్‌ టీజర్‌ రిలీజ్‌ చేయడం, పలువురు సెలబ్రిటీలు సినిమాపై ఎక్స్‌లో పోస్టులు పెట్టడంతో 'మనమే' ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా తొలిరోజు రూ.2.8 కోట్ల గ్రాస్‌ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. రూ. కోటి మేర షేర్‌ కలెక్ట్ చేసింది. తొలిరోజు ఆశించిన మేర కలెక్షన్స్‌ రానప్పటికీ.. శని, ఆదివారాల్లో ప్రేక్షకుల తాకిడీ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.  ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ నటుడు శర్వానంద్‌.. ‘మనమే’ చిత్రంలో అదరగొట్టాడు. విక్రమ్‌ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్‌ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. హీరోయిన్‌ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్‌ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య.. తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్‌ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్‌ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్‌ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్‌ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది.  కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.  సత్యభామ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారి ఖాకీ డ్రెస్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన లేడీ ఒరియెంటెడ్‌ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రానికి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. అయితే సినిమాపై మంచి టాక్‌ వచ్చినప్పటికీ డే 1 కలెక్షన్స్ పరంగా సత్యభామ నిరాశ పరిచింది. తొలి రోజు ఈ చిత్రం రూ.1.20 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.50 లక్షల వరకూ షేర్‌ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాజ‌ల్‌ నటనపై ప్రశంసలు కమర్షియల్‌ చిత్రాల్లో ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన కాజల్‌ అగర్వాల్‌.. ఏసీపీ సత్యభామ పాత్రలో ఆకట్టుకుంది. ఖాకీ దుస్తుల్లో ఎంతో హుషారుగా కనిపిస్తూ.. పోరాట ఘట్టాల్లో అద్భుతంగా చేసింది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన మార్క్‌ నటనతో మెప్పించింది. దర్శకుడు సుమన్‌ చిక్కాల.. ఇన్‌వెస్టిగేటివ్‌ క్రైమ్ థ్రిల్లర్‌గా 'సత్యభామ'ను తెరకెక్కించారు. ఓ నేరం చుట్టు భావోద్వేగాలతో కూడిన కథను అల్లుకొని ఆకట్టుకున్నాడు. ఓ మహిళా పోలీసు అధికారి.. కేసును వ్యక్తిగతంగా తీసుకున్న క్రమంలో వచ్చే భావోద్వేగాలు మెప్పిస్తాయి. గృహ హింస, మహిళల అక్రమ రవాణా, టెర్రరిజం వంటి అంశాలను టచ్‌ చేస్తూ డైరెక్టర్‌ కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది.  కథేంటి ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ.  https://telugu.yousay.tv/manamey-movie-review-has-manamey-put-a-check-on-sharwanand-kriti-shettys-series-of-failures.html https://telugu.yousay.tv/satyabhama-movie-review-did-kajal-rock-in-khaki-shirt-what-is-the-satyabhama-talk.html
    జూన్ 08 , 2024
    Manamey Movie Review: శర్వానంద్‌, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్‌ పెట్టిందా?
    Manamey Movie Review: శర్వానంద్‌, కృతి శెట్టి వరుస ఫెయిల్యూర్స్‌కు ‘మనమే’ చెక్‌ పెట్టిందా?
    నటీనటులు : శర్వానంద్‌, కృతి శెట్టి, సీరత్ కపూర్‌, అయేషా ఖాన్‌, రాహుల్‌, రామకృష్ణ, రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీరామ్‌ ఆదిత్య సంగీతం : హీషం అబ్దుల్‌ వహాబ్‌ సినిమాటోగ్రాఫర్‌ : విష్ణు శర్మ నిర్మాతలు : వివేక్‌ కుచిబొట్ల, కృతి ప్రసాద్‌ విడుదల తేదీ: 07 జూన్‌, 2024 యంగ్‌ హీరో శర్వానంద్‌ చేసిన చిత్రాలకు టాలీవుడ్‌లో ప్రత్యేకంగా నిలుస్తాయి. పక్కింటి అబ్బాయిలా కనిపించే చిత్రాల్లో నటించి చాలా సార్లు ఆడియన్స్‌ను మెప్పించాడు. ఇప్పుడు కూడా అలాంటి కథతోనే శర్వానంద్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఎంతో కాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.  కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే నటుడు శర్వానంద్‌.. విక్రమ్‌ పాత్రలో చాలా సెటిల్డ్‌గా నటించాడు. ఫుల్‌ ఎనర్జీతో కనిపించి ఆకట్టున్నాడు. కామెడీ, లవ్‌, ఎమోషన్‌తూ కూడిన సన్నివేశాల్లో తనదైన మార్క్‌తో అలరించాడు. హీరోయిన్‌ కృతి శెట్టికి ఇందులో ప్రాధాన్యం ఉన్న పాత్రనే లభించింది. శర్వానంద్‌ - కృతిశెట్టి కెమెస్ట్రీ ఆకట్టుకుంది. అటు మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య.. ఖుషీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆ బాలుడి పాత్రే ఎంతో కీలకం. ఇక రాజ్‌ కందుకూరి, త్రిగుణ్‌ పాత్రలు కథకు ఎంతో బలాన్ని అందించాయి. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. విలన్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో రాహుల్‌ రవీంద్రన్‌ మెప్పించాడు. సచిన్‌ ఖేదెకర్‌, సీత, ముఖేష్‌ రిషి, తులసి, సీరత్‌ కపూర్‌ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే  తల్లిదండ్రులు - పిల్లల మధ్య బాండింగ్‌ ఎలా ఉండాలన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య 'మనమే' సినిమాను తెరకెక్కించారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నంలో కొద్దిమేర సక్సెస్‌ అయ్యారు. జాలీగా తిరిగే హీరో.. ఫ్రెండ్‌ కొడుకు బాధ్యతను మోయాల్సి రావడం, ఇందుకు హీరోయిన్‌ సహకరించడం, వాటి తాలుకా వచ్చే సన్నివేశాలతో ఫస్ట్‌ హాఫ్‌ ఓ మాదిరిగా గడిచిపోయింది. ఇక సెకండాఫ్‌కు వచ్చేసరికి దర్శకుడు కథ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు అనిపిస్తుంది. కథతో సంబంధం లేని సన్నివేశాలు తెరపై జరుగుతుండటం కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేస్తాయి. ఇక క్లైమాక్స్‌ను మంచి ఎమోషనల్‌ సీన్స్‌తో ముగించడం సినిమాకు ప్లస్‌ అయ్యింది. అయితే విలన్‌ ట్రాక్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకుంటే బాగుండేది. సినిమాలో చాలా చోట్ల ఎమోషనల్‌ మిస్ అయ్యింది. మెుత్తంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అనుకున్న పాయింట్ బాగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించే క్రమంలోనే కాస్త తడబడ్డాడు.  టెక్నికల్‌గా  టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. లండన్‌ లొకేషన్స్‌ని బాగానే క్యాప్చర్ చేశారు. పాటలు పెద్దగా గుర్తుండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మూవీకి తగ్గట్లు ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాతలు పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ప్లస్‌ పాయింట్స్‌ శర్వానంద్‌, మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య నటనఎమోషనల్‌ సీన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్‌విలన్ ట్రాక్‌ఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 3/5  https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-kriti-shetty.html
    జూన్ 07 , 2024
    Weekend Box Office Collections: ఈ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా?
    Weekend Box Office Collections: ఈ వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా?
    గత శుక్రవారం (జూన్‌ 7) పది వరకూ చిత్రాలు విడుదలైనప్పటికీ అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు రెండు మాత్రమే. శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన ‘మనమే’ (Manamey) చిత్రం తొలి రోజు పాజిటివ్‌ టాక్‌తో పాటు మోస్తరు వసూళ్లు రాబట్టింది. ఇక కాజల్‌ పోలీసు ఆఫీసర్ పాత్రలో చేసిన ‘సత్యభామ’ (Satyabhama).. థియేటర్లలో మంచి టాక్‌ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా నిరాశ పరించింది. ఈ రెండు చిత్రాలు శని, ఆదివారాల్లో కలెక్షన్స్‌ను గణనీయంగా పెంచుకుంటాయని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరి వారి అంచనాలను ‘మనమే’, ‘సత్యభామ’ అందుకున్నాయా? వీకెండ్‌లో వాటి కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం.  ‘మనమే’ 3 డేస్‌ కలెక్షన్స్‌ శర్వానంద్‌ లేటెస్ట్ మూవీ 'మనమే'కు బాక్సాఫీస్‌ వద్ద చెప్పుకోతగ్గ స్థాయిలోనే కలెక్షన్స్ వస్తున్నాయి. వీకెండ్‌లో ఈ సినిమా మంచి జోరునే చూపించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.10.35 కోట్ల గ్రాస్‌ (Gross) సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఇక ఏపీ, తెలంగాణల్లో రూ.5.8 కోట్ల మేర వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. వర్కింగ్‌ డేస్‌లోనూ మంచి వసూళ్లు రాబడితే ఈ సినిమా లాభాల్లోకి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదని తెలిపాయి. కథేంటి విక్రమ్ (శర్వానంద్) పని పాట లేకుండా తాగుతూ తిరుగుతుంటాడు. కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్‌ చేస్తూ ప్లే బాయ్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు విక్రమ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ అనురాగ్‌ (త్రిగుణ్‌), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. దీంతో అనురాగ్‌ కొడుకు ఖుషీ (మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య)ని పెంచాల్సిన బాధ్యత విక్రమ్‌, సుభద్ర (కృతిశెట్టి)లపై పడుతుంది. వారిద్దరు పిల్లాడిని ఎలా పెంచారు? అసలు సుభద్ర ఎవరు? ఖుషీతో ఆమెకున్న సంబంధం ఏంటి? ఖుషీని పెంచే క్రమంలో సుభద్ర - విక్రమ్‌ ఎలా దగ్గరయ్యారు? అప్పటికే పెళ్లి నిశ్చయమైన సుభద్ర.. విక్రమ్‌తో రిలేషన్‌కు ఒప్పుకుందా? లేదా? అన్నది కథ.  వీకెండ్‌లో నిరాశ పరిచిన ‘సత్యభామ’ కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సత్యభామ'. సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత శుక్రవారం (జూన్‌ 7) విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ వీకెండ్‌ కలెక్షన్స్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. శుక్ర, శని, ఆదివారాలు కలిపి ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.3 కోట్ల వరకూ గ్రాస్‌ (Gross) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఈ వర్కింగ్‌ డేస్‌లో వచ్చే కలెక్షన్స్‌పై.. ఈ సినిమా లాభ నష్టాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నాయి. కథేంటి ఏసీపీ సత్యభామ షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ప్రశాంతంగా ఉంటూనే ఎంతో చాకచక్యంగా నేరస్థుల నుంచి నిజాలు రాబడుతుంటుంది. రచయిత అమరేందర్‌ (నవీన్‌ చంద్ర)ను ప్రేమ పెళ్లి చేసుకునప్పటికీ డ్యూటీనే ప్రాణంగా జీవిస్తుంటుంది. ఓ రోజు హసీనా అనే బాధితురాలు సత్యభామను కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెబుతుంది. దీంతో తాను చూసుకుంటానని సత్యభామ ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఈ క్రమంలో హసినా.. తన భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేధనకు గురైన సత్యభామ.. ఆమె భర్తను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఆ నేరస్థుడిని పట్టుకునే క్రమంలో సత్యభామకు ఎదురైన సవాళ్లు ఏంటి? నిందితుడు.. హసినాతో పాటు ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేశాడు? అన్నది కథ. 
    జూన్ 10 , 2024
    This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    ఈ సమ్మర్‌లో ఇప్పటివరకూ చిన్న చిత్రాలే థియేటర్లలో సందడి చేశాయి. అయితే జూన్‌ తొలి వారంలోనూ చిన్న సినిమాలే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన లేడీ ఒరియెంటేడ్‌ మూవీస్‌ ఉన్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లలో వస్తున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయో ఓ లుక్కేయండి. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు మనమే స్టార్‌ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యే చిత్రం ఇదని మూవీ టీమ్‌ తెలిపింది. ఫ్యామిలీగా వెళ్లి ఈ సినిమాను అస్వాదించవచ్చని పేర్కొంది.  సత్యభామ ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie). సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్‌.. పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఈ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. సత్యభామ ఓ విఫ్లవం అంటూ ఇటీవల కాజల్‌ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచింది.  రక్షణ స్టార్‌ నటి పాయల్‌ రాజ్‌పుత్‌ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’ (Rakshana). ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. ఓ పోలీసు ఆఫీసర్‌ జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.  లవ్‌ మౌళి నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’ (Love Mouli). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్‌ సంస్థ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని నిర్మించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  వెపన్‌ సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన ‘వెపన్‌’ చిత్రానికి గుహన్‌ సెన్నియ్యప్పన్‌ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్‌, రాజీవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీసీ, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. జూన్‌ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateShooting StarsMovieEnglishNetflixJune 03Hitler and NazeesSeriesEnglishNetflixJune 05How To Rob A BankMovieEnglishNetflixJune 05Bade Mia Chote MiaMovieHindiNetflixJune 06Sweet ToothSeriesEnglishNetflixJune 06Hit ManMovieEnglishNetflixJune 07Perfect Match 2SeriesEnglishNetflixJune 07MaidanMovieHindiAmazon PrimeJune 05GunahSeriesHindiDisney + HotstarJune 05ClippedSeriesEnglishDisney + HotstarJune 04Star Wars: The EcolightSeriesEnglishDisney + HotstarJune 04The Legend Hanuman SeriesHindiDisney + HotstarJune 05GullakSeriesHindiSonyLIVJune 07Varshangalkku SheshamMovieMalayalamSonyLIVJune 07Boomer UncleMovieTamilAhaJune 07AbigailMovieEnglishBook My ShowJune 07Black OutMovieHindiJio CinemaJune 07
    జూన్ 03 , 2024
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
    గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే థియేటర్లలో విడుదలై సందడి చేస్తూ వచ్చాయి. ఇందులో కొన్ని హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే మరికొన్ని ఫ్లాప్‌గా నిలిచి.. నెల అయినా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఈ వారం కూడా స్టార్‌ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాకపోవడం ఆడియన్స్‌ కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయితే ఈ వారం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న రెండు చిత్రాలు మాత్రం అందరిలో ఆసక్తి పెంచుతున్నాయి. ప్రముఖ హీరోయిన్స్‌ కాజల్‌ అగర్వాల్‌ నటించిన ‘సత్యభామ’, పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ‘రక్షణ’ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.  తొలిసారి ఖాకీ డ్రెసుల్లో.. కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో సుమన్‌ చిక్కాల తెరకెక్కించిన చిత్రం 'సత్యభామ' (Satyabhama). బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీసు అధికారిణిగా కనిపించనుంది. ఆమె పోలీసు ఆఫీసర్‌గా చేయడం కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. అటు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) చేసిన లేడీ ఓరియెంటేడ్‌ చిత్రం 'రక్షణ' (Rakshana) కూడా జూన్‌ 7వ తేదీనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇందులోనూ పాయల్‌ కూడా తొలిసారి ఖాకీ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్‌ కానుండటంతో కాజల్‌, పాయల్‌ మధ్య కోల్డ్‌ వార్‌ మెుదలైనట్లు కనిపిస్తోంది.  యాక్షన్‌తో రాణించేనా! కాజల్‌ అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ గత చిత్రాలను పరిశీలిస్తే.. వీరు గ్లామర్‌తోనే ఆడియన్స్‌ను ఎక్కువగా అలరించారు. అటువంటిది తొలిసారి వీరిద్దరు ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా ఎంతో పవర్‌ఫుల్‌ అయినా పోలీసు అధికారిణి పాత్రల్లో థియేటర్లలోకి వస్తున్నారు. మరి వీరు యాక్షన్ సీక్వెన్స్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదలైన ‘సత్యభామ’, ‘రక్షణ’ ట్రైలర్స్‌ రెండూ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కాజల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ఇద్దరూ తమ యాక్షన్‌తో దుమ్మురేపినట్లే కనిపిస్తోంది. కాజల్‌, పాయల్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న థగ్‌ ఆఫ్‌ వార్‌లో విజయం ఎవరిదో ఈ శుక్రవారం (జూన్‌ 7) తేలిపోనుంది.  ఇతర చిత్రాలు ఈ శుక్రవారం సత్యభామ, రక్షణ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందిన 'లవ్‌ మౌళి' (Love Mouli) చిత్రం.. అనేక వాయిదాల తర్వాత ఈ వారమే థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. అలాగే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Maname) కూడా ఈ నెల 7న రిలీజ్‌ కానుంది. ఈ మూవీకి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించాడు. మరోవైపు సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన 'వెపన్‌' (Weapon) చితరం కూడా ఈ శుక్రవారం మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. వార్నర్‌ బ్రదర్స్‌, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఈ కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.  https://telugu.yousay.tv/this-week-movies-these-are-the-films-series-that-will-double-your-happiness-this-week.html
    జూన్ 04 , 2024
    NETFLIX: కొరియన్ కంటెంట్‌పై రూ. 25,000 కోట్ల పెట్టుబడులు … ఈ ఓటీటీలో టాప్‌-7 కొరియన్ డ్రామాలు ఇవే !
    NETFLIX: కొరియన్ కంటెంట్‌పై రూ. 25,000 కోట్ల పెట్టుబడులు … ఈ ఓటీటీలో టాప్‌-7 కొరియన్ డ్రామాలు ఇవే !
    ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కొరియన్‌ కంటెంట్‌పై 2016 నుంచి పెట్టిన పెట్టుబడులు రెట్టింపు చేయనున్నారు. ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తుండటంతో రానున్న నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. భారత్‌లోనూ ఈ సినిమాలు, సిరీస్‌లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో చూడదగిన కొరియన్‌ డ్రామాలేంటో ఓసారి చూద్దాం.  1. SQUID GAME ఈ సిరీస్‌ 2021లో విడుదలై సంచలనమే సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10లో దాదాపు 90 దేశాల్లో మెుదటి స్థానంలో నిలిచింది. స్క్విడ్‌ గేమ్ ఓ థ్రిల్లర్‌ సర్వైవల్‌ డ్రామా. ఇందులో అప్పులతో సతమతమై డబ్బుల కోసం చూస్తున్న కొంతమందిని ఓ ఆట ఆడితే ప్రైజ్‌ మనీ ఇస్తామని తీసుకెళతారు. ప్రతి ఆటలో ఎలిమినేట్ అయినవారిని చంపుతుంటారు. చివరకు ఎవరు మిగిలారు. వాళ్లకు డబ్బులిచ్చారా లేదా? ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది కథ. మీరు చూడకపోయి ఉంటే కచ్చితంగా ఇప్పుడు చూడండి. https://www.youtube.com/watch?v=oqxAJKy0ii4 2. MY NAME మై నేమ్‌ కొరియన్ డ్రామా 2021లో విడుదలయ్యింది. క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చూడాలనుకునే వారికి ఇది మంచి ట్రీట్. గ్యాంగ్‌స్టర్‌ అయిన తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ఓ మహిళ. ఇందుకోసం ఓ గ్యాంగ్‌లో చేరుతుంది. నకిలీ పేరుతో చలామణీ అవుతూ పోలీసులను నమ్మిస్తుంటుంది. అంతేకాదు, నార్కోటిక్స్‌ అమ్మే ఓ డిటెక్టివ్‌తో జతకట్టి పగ తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి.  https://www.youtube.com/watch?v=ZOl7iOrD31Q 3. MR. SUNSHINE మిస్టర్‌ సన్‌ షైన్‌ లవ్‌ పొలిటికల్‌, హిస్టారికల్‌ డ్రామా. జోసియన్ దేశంలో బానిస కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తి యూఎస్‌ పారిపోతాడు. తిరిగి వచ్చిన తర్వాత చిన్నప్పుడే నిశ్చితార్థం అయిన ఓ యువతితో ప్రేమలో పడతాడు. కథ మెుత్తం వీరి ప్రేమ, రాజకీయం, చరిత్రతో ముడిపడుతూ ఉంటుంది. కొరియన్‌ దేశానికి సంబంధించిన చరిత్ర గురించి ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు.  https://www.youtube.com/watch?v=rPJSo4fhtRU 4. CRASH LANDING ON YOU రొమాంటిక్‌ డ్రామాలంటే ఇష్టముండే వారికి క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ ఓ అద్భుతమైన సిరీస్. ఇది హృదయాన్ని హత్తుకునే టెలివిజన్ డ్రామా. సౌత్‌ కొరియా రాజకుటుంబానికి చెందిన ఓ వారసురాలు అనుకోకుండా సైనిక రహిత జోన్ మీదుగా నార్త్‌ కొరియాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఓ యువ సోల్డియర్‌ ఆమెను తీసుకొని వెళతాడు. ఇది కొరియాలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. https://www.youtube.com/watch?v=eXMjTXL2Vks 5. OUR BLUES  ఈ సిరీస్‌ 2022లో విడుదలైన ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌. జెజూల్యాండ్‌ అనే ప్రాంతంలో రోజువారీ సంఘటనలు, మనుషుల జీవితాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్‌ చూస్తున్నప్పుడల్లా అందులో ఉన్నది మనమే అనే భావన కలిగేలా రూపుదిద్దుకుంది. కొరియన్ డ్రామాల్లో కాస్త రియలిస్టిక్‌గా ఉన్న సిరీస్‌ ఇది.  https://www.youtube.com/watch?v=vSBIJQOLKoY 6. SIGNAL షెర్‌లాక్‌, బ్రాడ్‌ చర్చ్‌ ఫ్యాన్స్‌ ఈ సిరీస్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. క్రైమ్ సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కింది. సిగ్నల్‌ ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఓ క్రిమినల్ ప్రొఫైల్‌కు 2015లో ఓ వాకీ టాకీ దొరకుతుంది. దానితో అతడు 1989లోని పోలీసుతో మాట్లాడతాడు. అలా ఓ కేసును చేధిస్తారు. ఇందులో దృష్టి మరల్చలేని ట్విస్టులతో సీటు అంచుల్లో కూర్చుంటారు.  https://www.youtube.com/watch?v=OonjouzGJKk 7. ALL OF US ARE DEAD జాంబీ జోనర్‌లో వచ్చిన సిరీస్‌ ఇది. కొందరు విద్యార్థులు ట్రాప్ చేయబడతారు. ఓ సైన్స్‌ ఎక్సపర్‌మెంట్‌ విఫలమైన జాంబీ వ్యాప్తిలో చిక్కుకున్నారని గ్రహిస్తారు. ఇది ప్రేక్షకులను చాలా థ్రిల్‌ చేస్తుంది. https://www.youtube.com/watch?v=IN5TD4VRcSM
    ఏప్రిల్ 26 , 2023
    Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
    Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
    కమెడియన్‌ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో తెరకెక్కడం విశేషం.  తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్‌ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం. చిత్రబృందం నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, రచ్చ రవి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి, వేణు టిల్లు తదితరులు దర్శకత్వం: వేణు ఎల్దండి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షిత https://www.youtube.com/watch?v=8R3Vcy5CaPc కథ: ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. దీనికి తోడు చావు ఇంట్లో జరిగిన గొడవతో పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇదే సమయంలో 20 ఏళ్ల క్రితమే ఊరి నుంచి వెళ్లిపోయిన కొమురయ్య చిన్న కొడుకు, కూతురు (సాయిలు మేనత్త) తండ్రి మరణవార్త విని ఊరికి వస్తారు.  సాయిలు మేనత్త తన కూతురు సంధ్యను తీసుకుని వస్తుంది. సంధ్యను చూసి ఇష్టపడిన సాయిలు, తనకు బాగా ఆస్తి కూడా ఉందని తెలుసుని ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ కర్మ రోజున కొమురయ్య పిండాన్ని ఏ కాకీ ముట్టుకోదు. అక్కడ సాయిలు మామ,బాబాయ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. కాకి ముట్టకపోవడం ఊరికి అరిష్టమని భావించిన గ్రామ పెద్దలు.. కొమురయ్య కోరిక తీరకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అనుకుంటారు. 11వ రోజు కాకి ముట్టకపోతే వారిని ఊరి నుంచి వెలివేస్తామని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, తాత చావును సాయిలు ఎలా వాడుకున్నాడు. చివరికి ఏం జరిగింది అనేదే కథ. ఎలా ఉంది:  చక్కటి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. పల్లెటూరి యాస, సంస్కృతి, అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం ఇలా అన్ని కోణాలను దర్శకుడు వేణు చక్కగా తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా అలా ఎక్కడా అనిపించదు. ప్రతి పాత్రా చాలా సహజంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ ఊరిలో ఉండి సాయిలును చూస్తున్నట్లు ఉంటుంది. భావోద్వేగాలు, కామెడీ చాలా సహజంగా ఉంటాయి. తెలంగాణ పల్లెటూరిలో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఉండే పరిస్థితిని చాలా సహజంగా తెరకెక్కించాడు. తాత చావు, ఓ కాకి చుట్టూ కథ నడిపిస్తూ.. కామెడీ పండిస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు. ఫస్టాఫ్‌ పాత్రల పరిచయం, కామెడీ ఉంటుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో చివరి 15 నిమిషాల సినిమా కంటతడి పెట్టిస్తుంది. మన ఇంట్లో ఉండే తాత, నాయినమ్మ, అమ్మమ్మలను గుర్తుచేసేలా ఉంటుంది. భావోద్వేగాలు ఎంత చక్కగా పండాయో, కామెడీ కూడా అంతే చక్కగా పండింది.  నటీ నటులు: సాయిలు పాత్రలో ప్రియదర్శి జీవించాడనే చెప్పాలి. నిజంగా మన ఇంటి పక్క సాయిలును చూసినట్టే ఉంటుంది. హీరోయిన్‌గా కావ్య బాగా నటించింది. సుధాకర్‌ రెడ్డి పాత్ర కాసేపే ఉన్నా చాలా బాగా చేశారు. రచ్చ రవి తన కామెడీతో మెప్పించాడు. ఇతర నటీ నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు. సాంకేతిక పనితీరు: దర్శకుడు వేణు తొలి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. స్టార్‌ క్యాస్ట్‌ లేకపోయినా సినిమాలో ఉన్న నటులంతా సహజంగా నటించారు. కథనం విషయంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. భీమ్స్‌ సిసిరోలియే సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయింది. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా చాలా సహజంగా కనిపించడానికి వేణు సినిమాటోగ్రఫీ చాలా సాయపడింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాసర్ల శ్యామ్‌ సాహిత్యం గురించి. చివరి 15 నిమిషాలు చక్కటి ఎమోషన్స్ పండాయంటే అందుకు కారణంగా చివర్లో వచ్చే బుర్ర కథ. దీనికి కాసర్ల శ్యామ్‌ రాసిన లిరిక్స్‌ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకు ఏ లోటు లేదు.  బలాలు కథ కథా నేపథ్యం భావోద్వేగాలు కామెడీ పాటల్లో సాహిత్యం బలహీనతలు కొన్ని చోట్ల సాగదీత సీన్లు స్టార్‌ క్యాస్ట్‌ లేకపోవడం ఒక్కమాటలో చక్కటి భావోద్వేగాలతో ఉండే పల్లెటూరి కుటుంబ కథా చిత్రం బలగం. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటే ‘బలగం’ మిస్‌ కాకూడని సినిమా. రేటింగ్‌ 3/5
    మార్చి 03 , 2023
    Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్‌లో దిల్ రాజు సాహసం.. మొత్తానికి చేసేశాడు! 😊😊
    Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్‌లో దిల్ రాజు సాహసం.. మొత్తానికి చేసేశాడు! 😊😊
    ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీ హవానే కనిపిస్తోంది. శుక్రవారం (ఏప్రిల్‌ 5) ఈ మూవీ రిలీజ్‌ కానుండటంతో హీరో హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అటు నిర్మాత దిల్‌రాజు సైతం వారితో పాటు చురుగ్గా ప్రమోషన్స్‌ చేస్తూ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌రాజు చెలరేగిపోయారు. మూవీలోని పాటలకు స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  దిల్‌రాజు.. స్టెప్పులకే రారాజు! ఫ్యామిలీ స్టార్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత దిల్‌రాజు.. తాజాగా మీమర్స్‌, డిజిటల్‌ పేజ్‌ అడ్మిన్స్‌తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలోని ‘నంద నందన సాంగ్, కళ్యాణి వచ్చా వచ్చా’ పాటలకి అందరితో కలిసి స్టెప్పులు వేశారు. ఎలాంటి తడబాటు లేకుండా హుక్‌ స్టెప్పులు వేసి అదరగొట్టారు.  ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. ఇవి చూసి నెటిజన్లు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్‌లో దిల్ మామే హైలెట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇతర నిర్మాతలతో పోలిస్తే దిల్‌రాజు చాలా స్పోర్టివ్‌గా ఉంటారని ప్రశంసిస్తున్నారు.  https://twitter.com/mr_rowdi/status/1775554308127551770?s=20 https://twitter.com/mr_rowdi/status/1775581652800131408 విజయ్‌, మృణాల్‌ కూడా ఇంతే! ఫ్యామిలీ స్టార్‌ సినిమాలోని 'కళ్యాణి వచ్చా వచ్చా' సాంగ్‌ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా ట్రెండ్ అవుతోంది. దీంతో ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ విజయ్‌ దేవరకొండ - మృణాల్‌ ఠాకూర్‌ కూడా ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు. హుక్‌ స్టెప్పులతో ఆడియన్స్‌ అలరించారు. ఈ క్రమంలో నిర్మాత దిల్‌రాజు కూడా వారితో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియో కూడా రెండ్రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. మీరూ ఓ లుక్కేయండి. https://twitter.com/i/status/1775183286417125744 సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఇదే ఫ్యామిలీ స్టార్‌ చిత్రం తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్‌ బృందం.. యూ/ ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. రన్‌ టైమ్‌ను 2 గం.ల 30 నిమిషాలకు ఫిక్స్ చేసింది. 150 నిమిషాల పాటు ఫ్యామిలీ స్టార్‌ను ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండండంటూ మేకర్స్ ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. అయితే సినిమాలో మొత్తం నాలుగు డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించినట్లు  వార్తలు వచ్చాయి. ఇక సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలుస్తోంది. అయితే ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పినట్లు సమాచారం. ఇవి తప్ప సినిమాలో పెద్దగా అభ్యంతరక సన్నివేశాలు ఏమీ లేవని తెలుస్తోంది.  'హిట్ కొట్టేసారండీ'  ఫ్యామిలీ స్టార్‌ చిత్రాన్ని దిల్‌రాజు, విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీలు.. తాజాగా స్పెషల్‌ షో వేసుకొని చూశాయి. ఈ సినిమా చూసిన తర్వాత తన భార్య తేజస్విని 'హిట్ కొట్టేసారండీ' అని కంప్లీమెంట్‌ ఇచ్చినట్లు నిర్మాత దిల్‌రాజు తెలిపారు. మిడిల్‌ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె జడ్జిమెంట్‌ పర్ఫెక్ట్‌గా, క్రెడిబుల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. అటు దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా సినిమా చూసి.. కిల్డ్‌ ఇట్‌ అంటూ దేవరకొండను హగ్‌ చేసుకుందట. మరోవైపు విజయ్‌ దేవరకొండ తండ్రి కూడా ఈ సినిమా చూసి దిల్‌రాజు బయోపిక్‌లా ఉందని ప్రశంసించారు. 
    ఏప్రిల్ 04 , 2024
    Avantika Vandanapu: ఈ కుర్ర పిల్లలో విషయం బాగా ముదిరింది.. ఏకంగా హలీవుడే షేక్‌.!
    Avantika Vandanapu: ఈ కుర్ర పిల్లలో విషయం బాగా ముదిరింది.. ఏకంగా హలీవుడే షేక్‌.!
    బ్రహ్మోత్సవం చిత్రంలో బాలనటిగా అరంగేట్రం చేసిన 'అవంతిక వందనపు'.. ఇప్పుడు హాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది.  https://twitter.com/i/status/1747997141644251346 టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఇప్పుడు వరుస హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా మారింది. https://twitter.com/i/status/1746394374546559063 తాజాగా అవంతిక న‌టించిన హాలీవుడ్ చిత్రం ‘మీన్ గర్ల్స్’ (Mean Girls) విడుద‌లై మంచి విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు ఈ అమ్మ‌డి పేరు సోష‌ల్ మీడియాలో మారు మ్రోగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అమ్మ‌డు చాలా బోల్డ్‌గా క‌నిపించడంతో పాటు ఓ పాట‌లో శృతిమించి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. బాలనటిగా చేసిన అవంతని ఇలా బోల్డ్‌గా చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. https://twitter.com/i/status/1746552711666094366 మ‌నం చూస్తున్న‌ది అప్పుడు తెలుగు సినిమాల‌లో చూసిన అవంతికనేనా.. ఇంత‌లో అంత మార్పా అంటూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.  అవంతిక వందనపు.. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్‌ చెల్లెలిగా నటించింది. తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.  బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో మహేష్‌ను ఇంటర్యూ చేసి మంచి మార్కులు కొట్టేసింది. https://twitter.com/i/status/1746391190511952308 అవంతిక.. ఇండో-అమెరికన్‌ యువతి. కాలిఫోర్నియాలో తెలుగు మూలలున్న కుటుంబంలో 2005లో పుట్టింది. అక్కడే చదవుకుంటూ డ్యాన్స్‌, నటనలో శిక్షణ తీసుకుంది. 2014లో ప్రముఖ టీవీ ఛానల్‌ నిర్వహించిన డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌ (నార్త్‌ అమెరికన్‌ ఎడిషన్‌)లో రన్నరప్‌గా నిలిచి అవంతిక అందరిచేత ప్రశంసలు అందుకుంది.  ఆ తర్వాత 2016లో ‘బ్రహ్మోత్సవం’ సినిమా ద్వారా నటిగా మెప్పించి బాలనటిగా తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంది.  మనమంతా, ప్రేమమ్‌, రారండోయ్‌ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్‌, అజ్ఞాతవాసి చిత్రాల్లోనూ అవంతిక బాల నటిగా మెరిసింది. ఇటీవల తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా అవంతికకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె వాటిని తిరస్కరించినట్లు సమాచారం.  ప్రస్తుతం అవంతిక తన ఫోకస్‌ మెుత్తం హాలీవుడ్‌ పైనే పెట్టింది. హాలీవుడ్ యానిమేషన్ సిరీస్‌లైన మీరా: రాయల్ డిటెక్టివ్, డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్‌లోని పాత్రలకు ఆమె గాత్రదానం చేసింది. హాలీవుడ్లో నటించాలన్న అవంతిక ఆశకు డిస్నీ సంస్థ ఊపిరి పోసింది. స్పిన్ చిత్రం ద్వారా ఆమె కలను నెరవేర్చింది. ఆ తర్వాత ‘సీనియర్ ఇయర్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలోనూ అవంతిక కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ భామా హోరోస్కోప్‌, క్రౌన్‌ విషెష్‌ అనే రెండు హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అదే సమయంలో ఓ రెస్టారెంట్‌లో వర్క్‌ చేస్తూ అవంతిక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.  అమెరికా సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఎంత రిచ్‌ అయినా 18 ఏళ్లు నిండితే వారు స్వయం కృషితో స్వంతంగా బతకాలి. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమకాళ్లపై తాము నిలబడాలి. ఈ క్రమంలోనే అవంతిక (Avantika Vandanapu) త‌ల్లిదండ్రులు ఉన్న‌వాళ్లైన‌ప్ప‌టికీ త‌ను ఓ రెస్టారెంట్‌లో ప‌ని చేస్తూ మ‌రో వైపు సినిమాల‌లో న‌టిస్తూ చాలామంది యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది.
    జనవరి 19 , 2024
    Venkatesh Dual role Movies:  విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు ఇవే!
    Venkatesh Dual role Movies:  విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు ఇవే!
    టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ నటనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన సినిమాలు ఎన్నో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు వెంకటేష్ సూపర్ హీరో. ఈక్రమంలో వెంకటేష్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దాం. కూలీ నంబర్ 1 (1991) కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వెంకటేష్ తొలిసారి డబుల్ యాక్షన్‌లో కనించాడు. రాజు, భరత్ పాత్రల్లో కనిపించాడు. కానీ ఈ సినిమాలో కూలీగా ఉన్న రాజు హీరోయిన్‌కు బుద్ధి చెప్పడానికి మారువేషంలో భరత్‌లా నటిస్తాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ?????????????????????????????????????????????????????????????? ముద్దుల ప్రియుడు(1994) ఈ సినిమాలోనూ వెంకటేష్ డబుల్ యాక్షన్‌లో కనిపించినప్పటికీ..  ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో రాముడు- రాజుగా కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని కూడా కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. పోకిరి రాజా(1995) ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ తొలిసారి డ్యుయల్ రోల్‌(Venkatesh Dual role Movies)లో కనిపించాడు. చంటి, బాలరాజు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన రోజా, శుభశ్రీ నటించారు. సూర్య వంశం(1998) ఈ చిత్రాన్ని బీమినేని శ్రీనివాస్ రావు డైరెక్ట్ చేశారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ క్యారెక్టర్లలో నటించారు. వెంకటేష్ సరసన రాధిక, మీనా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. జయం మనదేరా(2000) జయం మనదేరా సినిమా ఎన్‌ శంకర్ డైరెక్షన్‌లో వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. మహదేవ నాయుడు, అభిరాం (రుద్రమ నాయుడు)గా(Venkatesh Dual role Movies) వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశాడు. దేవీ పుత్రుడు (2001) కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్ మరోసారి డ్యుయల్‌ రోల్‌లో కనిపించి మెప్పించాడు. బలరాం, కృష్ణ పాత్రల్లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన సౌందర్య, అంజలా జావేరి హీరోయిన్లుగా నటించారు. సుభాష్ చంద్ర బోస్ (2005) కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన 101వ చిత్రం ఇది. ఇందులో వెంకటేష్ స్వాతంత్ర్య సమరయోధుడు అమరచంద్ర , అశోక్ పాత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వెంకటేష్ సరసన శ్రియాసరన్, జెనిలియా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు.  నాగవల్లి(2010) ఈ చిత్రాన్ని పి.వాస్ డైరెక్ట్ చేశారు. నాగవల్లి సినిమాలో నాగభైరర, డా.విజయ్ పాత్రలో వెంకటేష్ డ్యుయల్(Venkatesh Dual role Movies) రోల్‌లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన కమల్ని ముఖర్జి, అనుష్క శెట్టి నటించారు. ఇప్పటి వరకు విక్టరీ వెంకటేష్ మొత్తం 8 చిత్రాల్లో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి అభిమానులను అలరించారు. వాటిలో ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.
    నవంబర్ 10 , 2023
    Venkatesh Soundarya Movies: వెంకటేష్ సౌందర్య జంటగా నటించిన చివరి చిత్రం ఏదో తెలుసా?
    Venkatesh Soundarya Movies: వెంకటేష్ సౌందర్య జంటగా నటించిన చివరి చిత్రం ఏదో తెలుసా?
    టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా విక్టరీ వెంకటేష్- సౌందర్యకు పేరుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్‌ స్క్రీన్‌పై బాగా పండేది. దాదాపు వీళ్లిద్దరు కలిసి నటించిన సినిమాలన్నీ హిట్లుగా నిలిచాయి. సౌందర్య- వెంకటేష్ జంటగా నటించిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. మరి వెంకటేష్- సౌందర్య కాంబోలో ఎన్ని చిత్రాలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం? సూపర్ పోలీస్ (1994) విక్టరీ వెంకటేష్- సౌందర్య జంటగా నటించిన తొలి చిత్రం సూపర్ పోలీస్. ఈ చిత్రాన్ని కే. మురళి మోహన్‌రావు డైరెక్ట్ చేయగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో జయసుధ కీలక పాత్రలో నటించారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్- సౌందర్య మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో  వెంకటేష్- సౌందర్య హిట్ పేయిర్‌గా గుర్తింపు పొందారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. పవిత్ర బంధం (1996) వెంకటేష్- సౌందర్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. టాలీవుడ్‌లో ఈ సినిమా ఆల్‌టైం క్లాసిక్ కల్ట్‌ మూవీల్లో ఒకటిగా నిలిచింది. పవిత్ర బంధం సినిమాను ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్ హిట్ సాధించింది. పెళ్లి చేసుకుందాం(1997)   ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మరోసారి వెంకటేష్- సౌందర్య జత కట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు లైలా కూడా నటించింది. రాజా (1999) ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. మరోసారి వెండితెర పర్ఫెక్ట్ పేయిర్ సౌందర్య- వెంకటేష్ జోడీగా నటించారు. ముప్పలనేని శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.  ఎస్‌ఏ రాజ్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది. ఈ సినిమా మొత్తం మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. జయం మనదేరా (2000)  ఎన్‌ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్-సౌందర్య మధ్య వచ్చే కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఈ చిత్రంలో వెంకటేష్ డ్యుయల్ రోల్ చేయగా... ఆయన సరసన భానుప్రియ, సౌందర్య నటించారు. దేవీ పుత్రుడు(2001) వెంకటేష్- సౌందర్య నటించిన చివరి చిత్రమిది. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు అంజలా జావేరి కూడా నటించింది.
    నవంబర్ 10 , 2023
    Nora Fatehi: కిర్రాక్ పోజులతో హీటెక్కిస్తున్న నోరా ఫతేహి.. త్వరలో వరుణ్ తేజ్‌తో రొమాన్స్!
    Nora Fatehi: కిర్రాక్ పోజులతో హీటెక్కిస్తున్న నోరా ఫతేహి.. త్వరలో వరుణ్ తేజ్‌తో రొమాన్స్!
    బాలీవుడ్ అందాల తెగింపు నోరా ఫతేహి మరోసారి తన హాట్ అందాలను సోషల్ మీడియాలో రచ్చకు పెట్టింది. చమ్కీలు పొదిగిన ట్రాన్సఫరెంట్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించింది.  చెవులకు లోతైన లోలాకులు వంటినిండా చమ్కీల మెరుపుతో నోరా అందం మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ రియల్లీ హాట్, ఏంజెల్‌లా ఉన్నావంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నోరా ఫతేహి తెలుగులో అడపా దడపా కనిపించినా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో ఇప్పటి వరకు నటించలేదు. బాహుబలి 1లో 'మనోహరి' అంటూ  ఐటెం సాంగ్ పాడిన ముగ్గురు వయ్యారి భామల్లో ఈ ముద్దుగుమ్మ కూడా ఉంది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్ సరసన మట్కా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో కనువిందు చేయనుంది. మట్కాలో నోరా ఫతేహితో పాటు మరో హీరోయిన్‌ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. ఈ సినిమా కరుణ కుమార్ డైరెక్షన్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అటు పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలోనూ ఈ సొగసుల కోవ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఇక నోరా పర్సనల్ విషయాలకొస్తే.. నోరా పుట్టి పెరిగింది కెనడాలో. చదువు కూడా బాగానే చదివింది. టోరంటోలోని యార్క్ యూనివర్సిసిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా సంపాదించింది. ఇక సుందరాంగికి డ్యాన్స్ అంటే మక్కువ. అందులోనూ బెల్లీ డ్యాన్స్‌ను ఇరగదీస్తుంది.  https://twitter.com/Paleolitelly/status/1696461720754008307?s=20 యాక్టింగ్‌పై ఉన్న ఇష్టంతో తొలుత మోడలింగ్ చేసిన నోరా.. ఆతర్వాత యాక్టింగ్‌ వైపు తన దృష్టి మరల్చింది. కెనడా నుంచి ఇండియాకు వచ్చాక ఇక్కడ కొన్ని చిన్న చిన్న యాడ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.  అలా బాలీవుడ్ నిర్మాతల దృష్టిలో పడిన  నోరా..2014లో బాలీవుడ్‌లో ‘రోర్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఊపిరి సినిమాలో నాట్య మయూరిగా కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ బాంబ్.. టెంపర్ చిత్రంలో 'ఇట్టాగే రెచ్చిపోదాం' పాటలో  రెచ్చిపోయింది. టెంపర్‌లో ఐటెం సాంగ్.. నోరాకు తెలుగులో మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. బాహుబలి, కిక్ 2, ఊపిరి, లోఫర్,  షేర్ చిత్రాల్లో తన అందచందాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం సెక్సీ డాల్ 100%, మడగావ్ ఎక్స్‌ప్రెస్, డ్యాన్సింగ్ డాడ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. నోరా తన అందం, నటనతోనే కాకుండా పలు రియాల్టీ షోలు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహహించింది. డ్యాన్స్ ప్లస్, డ్యాన్స్ దివానే 3,  ఇండియా బెస్ట్ డ్యాన్సర్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరించింది.అంతేకాదు పలు పాప్ సాంగ్స్ ఆల్బమ్స్‌లోని తన అందాల దాడితో రచ్చ చేసింది. 'బేబి మర్‌వాకే మనేగి', 'అచ్చా సిలా దియా', డ్యాన్స్ మేరీ రాణి వంటి వీడియో ఆల్బమ్స్ బాగా ఆకట్టుకున్నాయి.
    సెప్టెంబర్ 01 , 2023
    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..! 
    PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..! 
    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ ఏ హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్‌ క్రేజ్‌ సినిమాలకు అతీతమైనది కావడమే ఇందుకు కారణం. ఎందుకంటే పవన్‌ను హీరోగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా ఆరాధించేవారే ఎక్కువ. ఇక పవన్‌ తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు తీశాడు. ఆయన తీసిన తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది చిత్రాలు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రాలను ఇప్పటికీ పవన్‌ ఫ్యాన్స్ రిపీట్‌ మోడ్‌లో చూస్తుంటారు. ఈ నేపథ్యంలో IMDB (Internet Movie Database)లో టాప్‌ రేటెడ్‌ పవన్‌ మూవీస్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.  1. తొలి ప్రేమ IMDBలోని పవన్‌ కల్యాణ్‌ సినిమాల జాబితాలో ‘తొలి ప్రేమ’ (Tholi Prema) టాప్ రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రానికి IMDB 8.4 రేటింగ్ ఇచ్చింది. తొలి ప్రేమ చిత్రం పవన్‌ కెరీర్‌లో నాల్గో సినిమా. 1998లో విడుదలైన ఈ మూవీకి కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. పవన్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. కీర్తి రెడ్డి ఇందులో హీరోయిన్‌గా చేసింది. తొలి ప్రేమలోని పాటలు అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నీ మనసే’ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ అని సాంగ్‌. 2. ఖుషి  పవన్‌ సినిమాల్లో ‘ఖుషి’ (Kushi) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రానికి IMDB 8.1 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రంలో పవన్‌ మేనరిజమ్స్‌, సొంతంగా కొరియోగ్రాఫ్‌ చేసిన ఫైట్స్‌ మూవీకే హైలెట్‌ అని చెప్పొచ్చు. 2001లో వచ్చిన ఈ సినిమాకు S.J. సూర్య దర్శకత్వం వహించాడు. భూమిక చావ్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే ఈ చిత్రం రీ-రిలీజ్‌ కావడం విశేషం. తాజాాగా ఇదే సినిమా పేరుతో విజయ్‌ దేవరకొండ ఓ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది.  3. తమ్ముడు  1999లో వచ్చిన ‘తమ్ముడు’ (Thammudu) చిత్రం బిగ్గెస్ట్‌ హిట్ అందుకుంది. ఈ చిత్రం IMDBలో 7.9 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా పవన్‌ కల్యాణ్‌ నటించాడు. ఇందులో పవన్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా పవన్‌ పండించిన హాస్యం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రానికి P.A అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించాడు. ప్రీతి ఝూంగియాని, అదితి గోవరికర్ హీరోయిన్లుగా నటించారు.  4. జల్సా త్రివిక్రమ్‌ - పవన్‌ కల్యాణ్‌ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి బంధానికి బీజం వేసిన చిత్రం మాత్రం ‘జల్సా’ (Jalsa). త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో 2008లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ అప్పట్లో యూత్‌ను ఉర్రూతలూగించింది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ చిత్రానికి IMDB 7.4 రేటింగ్ ఇచ్చింది.  5. బద్రి పూరి జగన్నాథ్‌, పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మెుదటి సినిమా ‘బద్రి’ (Badri). ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ చెప్పే డైలాగ్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్‌' అనే డైలాగ్‌ ప్రేక్షకులను పవన్‌కు మరింత దగ్గర చేసింది. ఈ చిత్రానికి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది.  6. అత్తారింటికి దారేది మాటల మంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో పవన్‌ నటించిన రెండో చిత్రం ‘అత్తారింటికి దారేది’ (Attarintiki daredi). ఈ మూవీకి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది. 2013లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విడుదలకు ముందే ఈ సినిమా ఒరిజినల్‌ ప్రింట్‌ లీకైనప్పటికీ కలెక్షన్స్‌పై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. దీన్ని బట్టి ఫ్యాన్స్‌లో పవన్‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించారు.  7. గోపాల గోపాల పవన్ కల్యాణ్‌, వెంకటేష్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గోపాల గోపాల’ (Gopala Gopala). బాలీవుడ్ చిత్రం 'ఓఎంజీ' (OMG)కి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్‌ ప్రధాన పాత్ర పోషించగా.. పవన్‌ దేవుడిగా కనిపించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు IMDB సైతం ఈ మూవీకి 7.2 రేటింగ్ ఇచ్చింది. తాజాగా విడుదలైన ‘బ్రో’ చిత్రంలోనూ పవన్‌ దేవుడిలా కనిపించడం విశేషం. 8. గబ్బర్‌ సింగ్‌ హిందీలో సల్మాన్‌ ఖాన్‌ చేసిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్‌గా ‘గబ్బర్‌ సింగ్’ (Gabbar singh) చిత్రం రూపొందింది. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవన్‌ తనదైన స్టైల్‌లో పోలీసు పాత్రను పోషించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో  అభిమానుల చేత ఈలలు వేయించాడు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. కాగా, IMDB ఈ మూవీకి 7.1 రేటింగ్ ఇచ్చింది.  9. వకీల్‌సాబ్‌  వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం వకీల్‌ సాబ్‌ (Vakeel saab). హిందీ పింక్‌ చిత్రానికి ఇది రీమేక్‌. 2021లో కోర్టు రూమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌ లాయర్‌గా కనిపించాడు. ఇందులోనూ శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం IMDBలో 7.0 రేటింగ్‌ సంపాదించింది. 10. పంజా ‘పంజా’ (Panja) చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ రూపొందించారు. ఇందులో పవన్ స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. 2011లో విడుదలైన ఈ చిత్రంలో సారా జేన్‌, అంజలి  లవానియా హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి IMDB 6.5 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద పంజా పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం. 
    జూలై 31 , 2023
    Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
    Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
    వేటూరి సుందరరామమూర్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. గేయ రచయితగా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన కెరీర్‌లో 5 వేలకు పైగా పాటలకు సాహిత్య దానం చేశారు వేటూరి. వేటూరి పాటను కీర్తిస్తూ ఎన్నో పాటలు పుట్టుకు రావడం సుందర రామమూర్తి సాహిత్యానికి నిదర్శనం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా తన పాటలతో అందరినీ మరిపించగలరు. మంచి మెలోడీ పాటలనూ రాయగలరు. మరి, వేటూరి కలం నుంచి జాలువారిన కొన్ని మెలోడీ గీతాలేంటో తెలుసుకుందామా.  పూసింది పూసింది పున్నాగ సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని ‘పూసింది పూసింది పున్నాగ’ గేయం ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంది. పదాలను ప్రాసలో వాడటంలో వేటూరి ప్రావీణ్యమేంటో ఈ పాటలో తెలిసిపోతుంది. ఈ పాటలోని లిరిక్స్ ఆహ్లాదంగా ఉంటాయి. వేటూరి మాటకు కీరవాణి బాణీ కడితే ఈ పాటలా ఉంటుంది. మీరూ వినేయండి మరి. https://www.youtube.com/watch?v=sBG_Z3zv96s యమహా నగరి కలకత్తా పురి చూడాలని వుంది సినిమాలోని పాట ఇది. కలకత్తా నగర విశిష్ఠతను తెలియజేస్తూ సాగిపోతుంటుందీ గీతం. బెంగాళీ చరిత్రను ఒక పాటలో అవపోసన పడితే వచ్చేదే ఈ గేయం. ‘కలలకు నెలవట.. కళలకు కొలువుట.. విధులకు సెలవట.. అతిథుల గొడవట.. కలకట నగరపు కిటకిటలో’ అంటూ ప్రాసలో చేర్చేశారు. వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్(నేతాజీ)లకు జన్మనిచ్చిన చోటు అంటూ గేయంలో చరిత్రను ఇనుమడించారు. https://www.youtube.com/watch?v=q2mt5XNgFVE యమునాతీరం ఆనంద్ సినిమాలోని ‘యమునాతీరం’ పాట చాలా మందికి ఎంతో ఇష్టం. ఉదయం లేవగానే ఈ పాటను ఎంతో మంది వింటుంటారు. ఉల్లాసంగా ఉంటూ.. కొత్త ఉత్సాహాన్ని నింపుతుందీ పాట. ‘శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ.. చిగురించే రుతువల్లే విరబూసే ప్రేమ’ అంటూ సాగే గీతం నూతనోత్తేజాన్ని నింపుతుంది. హరిహరన్, చిత్ర వేటూరి సాహిత్యానికి ప్రాణం పోశారు. https://www.youtube.com/watch?v=375j2vlMbxM ఉప్పొంగెలే గోదావరి గోదావరి సినిమాలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ఎంతో అద్భుతం. గోదావరి గొప్పదనాన్ని వేటూరి పాటకన్నా గొప్పగా ఏదీ వర్ణించదేమో అన్నట్లుగా ఉంటుందీ గీతం. ‘వెతలు తీర్చే మా దేవేరి.. వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారి..రామ చరితకే పూదారి’ అంటూ గోదారి విశిష్ఠతను వర్ణించారు. బాల సుబ్రహ్మణ్యం పాటను మరోస్థాయికి తీసుకెళ్లారు.  https://www.youtube.com/watch?v=yWnhTwJeKbQ తొలిసారి మిమ్మల్ని శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోని పాట ఇది. ఓ అబ్బాయిని చూసి మనసు పారేసుకున్న యువతి పాట పాడితే ఎలా ఉంటుందో ఈ గేయం చెబుతుంది. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు’ అంటూ నివేదిస్తుంది.  https://www.youtube.com/watch?v=VZEIVEjC5TE చుక్కల్లారా చూపుల్లారా ఆపద్భాందవుడు సినిమాలోని మధురమైన పాట ఇది. ‘చుక్కల్లారా చూపుల్లారా.. ఎక్కడమ్మా జాబిలీ.. మబ్బుల్లారా, మంచుల్లారా తప్పుకోండీ దారికీ’ అంటూ గేయం మొదలవుతుంది. ఇందులోని లిరిక్స్ శ్రోతలను కట్టిపడేస్తాయి. మీరూ ఈ మధుర గీతాన్ని ఆస్వాదించండి.  https://www.youtube.com/watch?v=5QYZGxyg1ZE పచ్చందనమే సఖి సినిమాలోని తెలుగు వెర్షన్ పాటలను రాసింది వేటూరీనే. ఇందులో పచ్చందనమే పాట మ్యూజిక్ లవర్స్‌కి ఫేవరేట్ సాంగ్. ‘ఎర్రని రూపం ఉడికే కోపం.. మసకే పడితే మరకత వర్ణం.. అందం చందం అలిగిన వర్ణం’ అని సాగే లిరిక్స్ మెస్మరైజ్ చేసేస్తాయి.  https://www.youtube.com/watch?v=XruNLPI0yQc జిలిబిలి పలుకుల సితార సినిమాలోని ‘జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘కలలను తెంచకు.. కలతను దాచకు’, ‘అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా.. చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా’ వంటి వాక్యాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయీ పాటలో. https://www.youtube.com/watch?v=yJNSkGafGJw మౌనమేళనోయి సాగర సంగమం సినిమాలోని పాటలన్నీ ప్రత్యేకం. అందులోనూ ‘మౌనమేళనోయి’ మెలోడీ మరెంతో స్పెషల్. ‘ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల.. తారాడే హాయిల’ అంటూ శ్రోతలను హాయిని చేకూర్చారు వేటూరి. అందుకే ఇప్పటికీ ఈ పాట వెంటాడుతూనే ఉంటుంది.  https://www.youtube.com/watch?v=N-J2YjDtBGs రెక్కలొచ్చిన ప్రేమ బస్ స్టాప్ సినిమాలోని ‘రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా’ పాట మ్యూజిక్ లవర్స్‌కి ఎంతో ఇష్టం. ‘ఆకాశం ఇల్లవుతుందా రెక్కలొచ్చాక.. అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక’ అంటూ ప్రశ్నిస్తూనే తత్వాన్ని చెప్పారు వేటూరి. ఈ పాటను ఓసారి వినేయండి మరి. https://www.youtube.com/watch?v=hQ7EaelCpP8
    జూన్ 21 , 2023
    SSMB 29: మహేష్ బాబు సినిమాతో రాజమౌళి మళ్లీ ఆస్కార్ గెలవనున్నాడా?.. ఫ్యాన్స్‌లో భారీగా హైప్!
    SSMB 29: మహేష్ బాబు సినిమాతో రాజమౌళి మళ్లీ ఆస్కార్ గెలవనున్నాడా?.. ఫ్యాన్స్‌లో భారీగా హైప్!
    RRR చిత్రానికి ఆస్కార్ రావటంతో రాజమౌళి తెరకెక్కించబోయే తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే మహేశ్‌ బాబు హీరోగా ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ కావటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. RRRను మించి చిత్రం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి క్రేజ్ పెరగటంతో ఇప్పుడు పాన్ వరల్డ్‌ను మెప్పించే సినిమాను తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది. SSMB29 ట్రెండింగ్ RRR ఆస్కార్ అవార్డు అందుకోవటంతో ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు సినిమా గురించి ట్రెండ్ చేస్తుంటే… మహేశ్‌ ఫ్యాన్స్‌ కూడా రెచ్చిపోయారు. #SSMB 29 కూడా ట్రెండ్ చేశారు. రాజమౌళి, మహేశ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంచనాలు ఎలా ఉన్నాయంటూ పోస్టులు పెట్టి హోరెత్తించారు.  https://twitter.com/i/status/1635126271427624961 పూనకాలు లోడింగ్ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా లాంఛ్‌ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రకటన కాకముందే ఇలా ఉంటే అనౌన్స్‌మెంట్ చేస్తే సగం చచ్చిపోతారేమో అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. జక్కన్న, సూపర్‌ స్టార్‌ ఫొటోలను పెట్టి అగ్నిపర్వతం బద్ధలు కాబోతుందనే రేంజ్‌లో హైప్ పెంచుతున్నారు. https://twitter.com/TribhuvanRishi/status/1635290226062147584 హాలీవుడ్ హీరోయిన్‌ మహేశ్ సరసన హీరోయిన్ గురించి చర్చ మెుదలయ్యింది. ఆస్కార్ వేడుకలో దీపికా పదుకొణె రాజమౌళిని కలిసిందని.. మహేశ్‌తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పిందని టాక్. ఇక ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. “ జక్కన్న హాలీవుడ్ హీరోయిన్లను చూశావు కదా.. అందులో ఎవర్నైనా టాలీవుడ్‌లోకి దింపేయ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.  https://twitter.com/UrsPrakash_07/status/1635172159688671233 మనదే ఆస్కార్ మహేశ్‌తో పాన్ వరల్డ్ చిత్రం తీయబోతున్న జక్కన్న బాక్సాఫీస్ షేక్ చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచేలా చేస్తాడంటూ అభిమానులు ట్విటర్‌లో సందడి చేస్తున్నారు. ఉత్తమ నటుడు, చిత్రం అవార్డులు మళ్లీ మనదే అనే కామెంట్లు చేస్తున్నారు. https://twitter.com/sri_cultdhfm/status/1635131220832165888 శరవేగంగా పనులు రాజమౌళి-మహేశ్‌ బాబు సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. కథను సిద్ధం చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. జేమ్స్‌ బాండ్ తరహాలో స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మిగతా పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అన్ని సవ్యంగా కుదిరితే ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్రస్తుతం బిజీ రాజమౌళి సినిమా ప్రారంభం కావటానికి దాదాపు సంవత్సరం సమయం ఉంది.  ఇలాంటి సమయంలో ఫ్యాన్స్‌ను నిరాశ పరచకూడదని భావించిన సూపర్ స్టార్ మహేష్… త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుస షెడ్యూల్స్ జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు మహేశ్. ఆ తర్వాత దర్శక ధీరుడితో సినిమా పట్టాలెక్కనుంది.
    మార్చి 14 , 2023
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    Telugu Heroes Cars Collections: టాలీవుడ్‌లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
    టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ఘనంగా ఉంటున్నాయి. ఒక్కో హీరో రూ.10 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మరి ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న తెలుగు హీరోల లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వారు వాడే ప్రతి వస్తువు చాలా లగ్జరీగా, లావీష్‌గా ఉంటుంది. ఇక మన హీరోలు ఎలాంటి కార్లు వాడుతున్నారు. ఏ కారు ఎంత ధర ఉంది.టాలీవుడ్ హీరోల్లో ఎవరి దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన కారు ఎవరి దగ్గర ఉంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్‌బాబు దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఆయన దగ్గర రూ.14 కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. రీసెంట్‌గా ఆయన గోల్డ్‌ కలర్ రెంజ్ రోవర్ కొనుగోలు చేశాడు. దీని ధర రూ.5కోట్లు. మహేష్ బాబుకు మెర్సిడెస్ కార్లంటే తెగ ఇష్టం. ఈ బ్రాండ్‌కు సంబంధించిన అనేక కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ E క్లాస్‌తో పాటు.. మెర్సిడెస్ GL క్లాస్‌ కార్లు లగ్జరీ కార్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు రూ.1.90కోట్లు విలువ చేసే Audi E-Tron, రూ.2.80 కోట్ల విలువ చేసే లంబోర్గిని గాలర్డో వంటి విలాసవంతమైన కార్లు ఆయన సేకరించారు. జూనియర్ ఎన్టీఆర్ కార్ కలెక్షన్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర కూడా అదిరిపోయే లగ్జరీ కార్ల లైనప్‌ ఉంది. ఇటీవల ఆయన రెండు కార్లు కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్- క్లాస్(Mercedes-Benz Maybach S - Class) దీనిని తనకు ఇష్టమైన బ్లాక్ కలర్‌ వేరియంట్‌లో తీసుకున్నాడు. దీని ధర రూ.4.23 కోట్లు. మరో లగ్జరీ కారు హ్యూందాయ్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5  (hyundai electric car ioniq 5 black) తీసుకున్నారు. దీని ధర రూ.55.2 లక్షలు. ఈ రెండు కార్ల ధరే దాదాపు రూ.5 కోట్లు దాటింది.  https://twitter.com/sarathtarak9/status/1775161795440971956 వీటితో పాటు భారత దేశంలోని మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్‌ను ఆయన  రూ. 3.16 కోట్ల ధరతో ఇంటికి తీసుకొచ్చాడు. ఈ కారును 2021లో కొన్న ఎన్టీఆర్.. అప్పట్లో వార్తల్లో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే ఈ కారుకు తన లక్కీ నంబర్.. 9999 రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా ఆయన రూ.17 లక్షలు చెల్లించాడు. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రేంజ్ రోవర్ వోగే (Range Rover Vogue) కూడా ఉంది. దీని ధర అక్షరాల రూ.2 కోట్లు. దీనితో పాటు BMW 7 సిరీస్( రూ.1.799 కోట్లు), పోర్సే 718(Porsche 718 Cayman) దీని ధర రూ. 2.54 కోట్లు. ఇది కేవలం 3.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. విషేషమేటిటంటే ఈ లగ్జరీ కార్లన్నింటి నెంబర్లు 9999 కావడం గమనార్హం. ప్రభాస్ కార్ కలెక్షన్లు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లోనే కాదు.. లగ్జరీ కార్ల విషయంలోనూ బాహుబలే. ఏ హీరో దగ్గరలేనన్ని కార్లు ప్రభాస్ దగ్గర ఉన్నాయి. వాటిలో అత్యంత ఖరీదైన కార్లను ఇప్పుడు చూద్దాం. ప్రభాస్‌ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్‌ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్​లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే? ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్​ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.  Rolls Royce Phantom : ప్రభాస్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత విలువైనది. రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఇది ప్రప్రంచంలోని ఖరీదైన కార్లలో ఒకటి. దీని ధర రూ. 8-10 కోట్ల మధ్యలో ఉంటుంది. ఇలాంటి కారు మనదేశంలో కొద్ది మంది సెలబ్రెటీల దగ్గర మాత్రమే ఉంది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్ల దగ్గర ఈ కారు ఉంది.  Rolls Royce Ghost ప్రభాస్ గ్యారేజ్‌లో ఉన్న మరో లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్. దీని ధర ఏకంగా రూ.7.95కోట్లు Jaguar XJL  ప్రభాస్ ఇష్టమైన లగ్జరీ కార్లలో సిల్వర్ జాగ్వర్ XJLకు ప్రత్యేక స్ధానం ఉంది. ప్రభాస్ పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత  కొనుగోలు చేసిన తొలి విలాసవంతమైన కారు ఇదే. దీని ధర రూ.2 కోట్లు.  Audi R8: ప్రభాస్ లగ్జరీ కార్ల జాబితాలో చేరిన మరో విలాసవంతమైన కారు ఆడి R8. దీని ధర అక్షరాల రూ.2.30 కోట్లు  BMW X5  ప్రభాస్ గ్యారేజ్‌లో బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. దీని ధర రూ.1.2కోట్లకు పైగా ఉంటుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.  Lamborghini Aventador Roadster   లంబోర్గినీ వెంచర్‌లో ఇది ప్రత్యేకమైనది.  ఇది లీటర్‌కు 5.0 kmpl మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీనిలో ఇంధనం నిలిపేందుకు ఇచ్చిన ట్యాంక్ సామర్థ్యం 90లీటర్లు. అతి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ద్వారా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ధర అక్షరాల 6.5 కోట్లు ఉంటుంది. Range Rover SV Autobiography  ప్రభాస్ లగ్జరీ లైనప్‌లో ఇది మరో సూపర్బ్ కారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీని ధర రూ.6కోట్లకు పైనే ఉంటుంది. అల్లు అర్జున్ లగ్జరీ  కార్ కలెక్షన్స్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్యారెజీలో సూపర్బ్ లగ్జరీ కార్ల లైనప్‌ అయితే ఉంది వాటిపై ఓ లుక్ వేద్దాం. జాగ్వార్ XJL  దీని ధర రూ.2 కోట్లు. ఇది బన్నీ కొన్న మొదటి లగ్జరీ కార్. ఇదే కారు ప్రభాస్ దగ్గర కూడా ఉంది. ఇది వైట్‌ కలర్‌లో ఉంటుంది. హమ్మర్ H2  అల్లు అర్జున్ లగ్జరీ లైనప్‌లో ఉన్న మరో కారు... హమ్మర్ H2. దీని ధర రూ.75 లక్షలు. దీనిని ముద్దుగా బన్నీ 'బ్యాడ్ బాయ్‌'గా పిలుచుకుంటారు.  వోల్వో XC90 T8 ఇది  వోల్వో  ఫ్లాగ్‌షిప్ SUV దీని ధర ఏకంగా రూ.1.5 కోట్లు   ఇటీవల ఆయన గ్యారేజ్‌లోకి రేంజ్‌ రోవర్ చేరింది. అల్లు అర్జున్ దీనిని 'ది బీస్ట్‌గా' పిలుస్తారు. దీని ధర రూ.2.3కోట్లు.  ఇక అల్లు అర్జున్ వెహికల్ కలెక్షన్‌లో స్టార్ హీరో వ్యానిటీ వ్యాన్. దీనిని బన్నీ ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకున్నారు. దీని ధర రూ.7కోట్లకు పైమాటే. రామ్‌చరణ్ లగ్జరీ  కార్ కలెక్షన్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు.. కార్ల కలెక్షన్లలోనూ సూపర్ స్టారే.  విలాసవంతమైన కార్లకు చెర్రీ పెద్ద అభిమాని. మరి రామ్‌ చరణ్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ కార్లపై ఓలుక్కేద్దాం. Ferrari Portofino రామ్‌చరణ్ కలెక్షన్స్‌లో అత్యంత వార్తల్లో నిలిచింది ఫెరారీ పోర్టోఫినో. దీని ధర దాదాపు రూ. 3.50 కోట్లపైనే ఉంటుంది. ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈకారును అప్పుడప్పుడు హైదరాబాద్ వీధుల్లో చరణ్ తిప్పుతుంటాడు. View this post on Instagram A post shared by abhi's photography📸 (@abhi__photographyy) ఈ కార్ మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ దగ్గర అతి పెద్ద లగ్జరీ కార్ల వాహన శ్రేణి ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ - రూ 9.57 కోట్లు మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 — రూ. 4 కోట్లు  https://twitter.com/ManobalaV/status/1437059410321309702 ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ V8 — రూ. 3.2 కోట్లు ఫెరారీ పోర్టోఫినో - రూ 3.50 కోట్లు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ 2.75 కోట్లు BMW 7 సిరీస్ - రూ. 1.75 కోట్లు Mercedes Benz GLE 450 AMG కూపే — రూ. 1 కోటి ఈ లగ్జరీ కార్ల లైనప్‌తో పాటు రామ్ చరణ్ వద్ద ఓ ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. తరచుగా ఆ జెట్‌లో దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్లి వస్తుంటాడు. https://twitter.com/HelloMawa123/status/1502241248836349956 విజయ్ దేవరకొండ లగ్జరీ కార్ కలెక్షన్లు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు  లగ్జరీ కార్లంటే అందరి హీరోల్లాగే మక్కువ. విజయ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లలో అత్యంత ఖరీదైనది బెంట్లీ కాంటినెంటల్ జీటీ. దీని ధర సుమారు రూ.4కోట్లు. ఇదే కారు విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఉంది.  అతని దగ్గర ఆకట్టుకునే కలెక్షన్‌ ఉంది.BMW 5 సిరీస్ 520d దీని ధర సుమారు రూ.75 లక్షలు, అలాగే రూ.62 లక్షల విలువైన ఫోర్డ్ ముస్టాంగ్‌ను కలిగి ఉన్నాడు. దీనితో పాటు Benz GLS 350 వంటి హైఎండ్ కారు అతని గ్యారేజ్‌లో పార్క్ అయి ఉంది. దీని దాదాపు కోటి రూపాయలు.  Volvo XC90 (సుమారు INR 1.31 కోట్లు), Audi Q7 దీని ధర రూ.74 లక్షలుగా ఉంది. దీంతో పాటు విజయ్ దేవరకొండకు ఒక ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది.  తరచుగా తన కుటుంబంతో చార్టర్డ్ విమానాలలో ప్రయాణిస్తుంటాడు. https://www.youtube.com/watch?v=vkS_uio8ix8 నాగచైతన్య లగ్జరీ కార్‌ కలెక్షన్లు అక్కినేని నాగ చైతన్య గ్యారేజ్‌లో పార్క్ చేసిన విలాసవంతమైన కార్లు ఓసారి చూద్దాం. ఈ కార్ల వెరియంట్ల లిస్ట్ చూస్తే అతనికి లగ్జరీ కార్లంటే ఎంత ఇష్టమో అర్ధమవుతుంది. ఫెరారీ 488GTB — (రూ. 3.88cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) Mercedes –Benz G-Class G 63 AMG — (రూ. 2.28cr) BMW 740 Li — (రూ. 1.30cr) నిస్సాన్ GT-R — (రూ. 2.12cr) 2X ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ — (రూ. 1.18cr) MV అగస్టా F4 — (రూ. 35L) BMW 9RT — (రూ. 18.50L) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) https://twitter.com/baraju_SuperHit/status/859824197706465280 View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) నాని లగ్జరీ కారు కలెక్షన్ నాని దగ్గర లగ్జరీ కార్‌ కలెక్షన్ ఉంది. రేంజ్ రోవర్ వోగ్‌(range rover vogue) ఉంది. దీని ధర రూ.2కోట్ల 75 లక్షలు, BMW 5 సిరీస్- దీని ధర రూ.60లక్షలు,  టయోట ఫార్చునర్(రూ.42లక్షలు), టయోటా ఇన్నోవా క్రిస్టా(రూ.25లక్షలు) ఉన్నాయి. ఫోర్డ్ ఫియాస్టా కారు కూడా నాని గ్యారేజీలో ఉంది. ఈ కారంటే నానికి చాలా ఇష్టమని చాలా సందర్బాల్లో చెప్పాడు. https://www.youtube.com/watch?v=KuOxAHUisOg రామ్‌పొత్తినేని లగ్జరీ కారు కలెక్షన్ రామ్ పోతినేని దేవదాసుతో అరంగేట్రం చేసి మాస్‌ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రెడీ, కందిరీగ, పండగ చేస్కో, నేను శైలజ, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. సినిమాల్లో ఏ రేంజ్‌లో ఉన్నాడో విలాసవంతమైన కార్లున్న హీరోల్లోనూ రామ్‌ అదే స్థాయిలో ఉన్నాడు.  అతని కార్ కలెక్షన్లలో ప్రముఖంగా  రూ. 2.30 కోట్ల విలువైన రేంజ్ రోవర్,  రూ. 2.10 కోట్ల విలువైన నిస్సాన్ GTR, రూ.2.50 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ . రూ. 1.20 కోట్ల విలువైన పోర్సే సియానీ(porsche cayenne)-   రూ. కోటి విలువైన BMW X3. https://www.youtube.com/watch?v=hnhUYoAy0PE విష్వక్ సేన్ లగ్జరీ కారు కలెక్షన్ విశ్వక్ సేన్ నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగాను ఆయనకు గుర్తింపు ఉంది. 'వెళ్లిపోమాకే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ద్వారా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఇక తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'ఫలక్‌నామాదాస్' చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'హిట్', 'అశోకవనంలో అర్జున కళ్యాణం', 'దాస్‌కా ధమ్కీ', 'ఓరిదేవుడా' వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతను జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. విశ్వక్‌కు సినిమాలంటే ఎంత ఇంట్రెస్టో లగ్జరీ కార్లంటే అంత ఇష్టం. విశ్వక్ దగ్గర రూ.90 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారుతో పాటు ఇటీవల ఓ కొత్త కారును తన లగ్జరీ కార్ల లిస్ట్‌లోకి చేర్చాడు. బెంజ్ జీ క్లాస్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది తన డ్రీమ్ కారు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు శర్వానంద్ లగ్జరీ కార్ కలెక్షన్ శర్వానంద్ తెలుగులో స్టార్ హీరో.  విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌ ఆరంభంలో పెద్ద హీరోల సరసన చిన్న చిన్న పాత్రల్లో నటించడం వల్ల ఇతనికి గుర్తింపు లభించింది. క్రమంగా అవకాశాలు పెరిగాయి. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన 'గమ్యం' సినిమా ఇతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత సుజీత్ డెరెక్షన్‌లో వచ్చిన రన్ రాజా రన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, క్లాస్‌మేట్స్‌, శతమానంభవతి, రాధ, 'పడి పడి లేచె మనసు', జర్నీ 'శ్రీకారం' వంటి హిట్ చిత్రాలతో  స్టార్ హీరో స్థాయి ఎదిగాడు. ఈక్రమంలో శర్వానంద్ సెకరించిన లగ్జరీ వాహన శ్రేణిని ఓసారి చూద్దాం. రెంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ ప్రిమీయం వెర్షన్- రూ.3.34కోట్లు ఆడి Q7- రూ. 90 లక్షలు BMW 530D- రూ. 75 లక్షలు ఫోర్డ్ ఎండేవర్- రూ.36 లక్షలు నిఖిల్ సిద్ధార్థ్ లగ్జరీ కారు కలెక్షన్  హ్యాపీ డేస్ చిత్రంతో తెరంగేట్రం చేసిన నిఖిల్ సిద్ధార్థ.. అంచెలంచేలుగా ఎదిగాడు. ‘యువత’, ‘వీడు తేడా’ వంటి చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ కమర్షియల్ బ్రేక్ రాలేదు. కార్తికేయ(2014) చిత్రంతో కమర్షియల్‌గా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. కార్తికేయ 2 చిత్రం నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నిఖిల్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర విలువైన వాహన శ్రేణి ఉంది. ఓసారి దానిపై లుక్కేద్దాం. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ - రూ.3.43కోట్లు Fiery Red Mercedes Sports Coupe-  దీని ధర రూ.3.33కోట్లు https://twitter.com/actor_Nikhil/status/1353350557109424128 https://twitter.com/actor_Nikhil/status/612984749645148160 రోల్స్ రాయిస్ గోస్ట్ - రూ.7.50 కోట్లు https://www.youtube.com/watch?v=HAp_5y1FSSI సిద్ధు జొన్నలగడ్డ లగ్జరీ కార్ కలెక్షన్   సిద్ధు జొన్నలగడ్డ నటుడిగానే కాకుండా రచయితగాను మంచి పేరు సంపాదించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఎల్బీడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రానికి ముందు జోష్, ఆరంజ్, భీమిలి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించాడు. గుంటూరు టాకీస్ చిత్రం ద్వారా గుర్తింపు పొందాడు. ఈ చిత్రానికి రచయితగా వ్యవహరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కమర్షియల్‌గా బ్రేక్ రాలేదు. అయితే 2022లో విడుదలైన డిజె టిల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో సిద్ధు స్టార్ డం సంపాదించాడు. సిద్దు జొన్నల గడ్డ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ దగ్గర.. రూ.3.43 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది. ఈ కారును సిద్ధు.. డీజే టిల్లు సినిమా హిట్‌ తర్వాత కొనుగోలు చేశాడు. https://www.youtube.com/watch?v=8CM-HSifLsY
    మే 09 , 2024
    Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
    Creative Video songs In Tollywood: టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
    టాలీవుడ్‌ ప్రేక్షకులు సంగీత ప్రియులు. సినిమాలోని ఫైట్స్‌, కామెడీ, అడ్వెంచర్‌ సీన్లను ఎలాగైతే ఇష్టపడతారో అదే స్థాయిలో పాటలకు వారు పెద్ద పీట వేస్తుంటారు. అందుకే తెలుగులో చాలా సినిమాలు పాటలతోనే సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఈ కారణం చేతనే మన డైరెక్టర్లు మంచి కథతో పాటు.. అద్భుతమైన పాటలు, డ్యాన్స్ తమ సినిమాల్లో ఉండేలా జాగ్రత్తపడతారు. అయితే కొందరు డైరెక్టర్లు మరో అడుగు ముందుకేసి చాలా క్రియేటివ్‌గా తమ సినిమాల్లోని పాటలను చిత్రీకరించారు. అభిమానులను థ్రిల్‌ చేసి వారి అభిమానాన్ని సంపాదించారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన క్రియేటివ్‌ సాంగ్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.  వివాహభోజనంబు ‘మాయాబజార్‌’ (1957) సినిమాలోని ‘వివాహభోజనంబు’ పాటను డైరెక్టర్‌ కె.వి. రెడ్డి చాలా వినూత్నంగా తెరకెక్కించారు. పెళ్లి అంటే ఎటువంటి పంచభక్ష్య పరమాన్నాలు ఉండాలో కళ్లకు కట్టాడు. వంటశాలలోకి ప్రవేశించిన నటుడు ఘటోత్కచుడు (ఎస్వీ రంగరావు) పసందైన వంటకాలను పొగుడుతూ ఆరగిస్తాడు. ఈ సాంగ్ తెలుగు వారింట్లో శుభప్రదమైన పాటగా కొనసాగుతోంది. పెళ్లిళ్లలో ఈ సాంగ్ పరిపాటిగా మారింది.  https://www.youtube.com/watch?v=dZejdBmYC3k ‘సుందరి నీవంటి’ సాధారణంగా హీరో, హీరోయిన్లతో డైరెక్టర్లు సాంగ్ ప్లాన్‌ చేస్తారు. కానీ ‘మాయాబజార్‌’ సినిమాలోని ‘సుందరి నీవంటి’ ఇందుకు విరుద్ధం. హాస్యనటుడు రేలంగి.. హీరోయిన్‌ సావిత్రితో కలిసి ఈ సాంగ్‌లే నటించాడు. ఆమె అందాలను వర్ణిస్తూ పాడతాడు. అయితే సాంగ్‌ను ఈ జనరేషన్‌ వాళ్లు కూడా అన్వయించుకోవచ్చు. పెళ్లి చూపులకు వెళ్లిన వరుడు.. వధువు అందాలను ఈ స్థాయిలో పొగిడే సాంగ్‌ ఇప్పటివరకూ టాలీవుడ్‌లో రాలేదు.  https://www.youtube.com/watch?v=ScasolQHzxs 'నిలువరా వాలు కనులవాడా' జంబలకిడి పంబ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్‌ చాలా క్రియేటివ్‌గా తెరకెక్కించారు దర్శకుడు ఈ.వీ.వీ. సత్యనారాయణ. అన్ని పాటలను స్పూఫ్‌ చేస్తూ తీసిన తొలి తెలుగు సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్‌లో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారి వేషధారణ కనిపించి నవ్వులు పూయిస్తారు.  https://www.youtube.com/watch?v=CI4qkIdvSmA 'చెప్పమ్మా.. చెప్పమ్మా..' ‘మురారి’ సినిమాలోని ‘చెప్పమ్మా.. చెప్పమ్మా’ సాంగ్‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. మహేష్‌.. హీరోయిన్‌ను వదిలి కారులో బయల్దేరగా ఆమె జ్ఞాపకాలు అతడ్ని వెంటాడుతాయి. దారి పొడవునా హీరోయిన్‌ కనిపిస్తూ డిస్టర్బ్‌ చేస్తుంది. ఇష్టమైన వారితో ఎడబాటు రాగానే యువతులకు ముందుగా ఈ పాటనే గుర్తుకు వస్తుంది. ప్రియుడు దూరంగా వెళ్తున్న క్రమంలో ఓ యువతి ఎంతగా అతడ్ని మిస్‌ అవుతుందో ఈ సాంగ్‌ కళ్లకు కడుతుంది.  https://www.youtube.com/watch?v=9qC9XGOuhaI 'బుగ్గే బంగారమా..' ‘చందమామ’ సినిమాలోని ఈ పాట.. ఒక ‌అబ్బాయి ఎడబాటుకు అద్దం పడుతుంది. మనసుకు నచ్చిన అమ్మాయి పదే పదే కళ్లకు కనిపిస్తూ తన జ్ఞాపకాలతో మైమరిపిస్తుంటుంది. ప్రేయసి దూరంగా వెళ్లినప్పుడు అబ్బాయిలు ఆమెను గుర్తుచేసుకునేందుకు తరచూ ఈ సాంగ్ వింటూ ఉంటారు. https://www.youtube.com/watch?v=WABcMeOf0oM ‘అసలేం గుర్తుకు రాదు’ ‘అంతపురం’లోని ఈ సాంగ్‌.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో ఒకటిగా ఉంది. నచ్చిన వ్యక్తి తోడుంటే పెళ్లికాని యువతులకు ఇక ఏది గుర్తుకు రాదన్న కాన్సెప్ట్‌టో దర్శకుడు ఈ పాటను చిత్రీకరించారు. అప్పట్లో ఈ పాట ట్రెండ్ సెట్టర్‌. దీని తర్వాత ఈ తరహాలో ఎన్నో పాటలు టాలీవుడ్‌లో రావడం గమనార్హం.  https://youtu.be/sgMKZfdPads?si=8Lj2ooFdt-Q56Mss ‘ఇంకి పింకి పాంకీ’ సుడిగాలి సినిమాలోని ‘ఇంకి పింకి పాంకి’ చాలా గమ్మత్తుగా ఉంటుంది. తమ ఫ్యామిలీ సాంగ్ అంటూ అల్లరి నరేష్‌ పాడే ఈ సాంగ్ వినటానికి బాగుండటంతో పాటు నవ్వులు పూయిస్తుంది. మీరు ఓసారి వినండి. https://www.youtube.com/watch?v=FusD0RVkKAk ‘ఊ అంటావా.. ఉ ఊ అంటావా’ తెలుగులో రీసెంట్‌గా వచ్చిన ఐటెం సాంగ్‌లలో ‘పుష్ప’లోని ‘ఉ అంటావా.. ఉ ఊ అంటావా’ పాట సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. మాస్‌ సాంగ్స్‌లలో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఈ పాట లిరిక్స్‌ చాలా యూనిక్‌గా అనిపిస్తాయి. పైగా ఐటెం సాంగ్ అంటే దద్దరిల్లే మ్యూజిక్‌ అవసరం లేదని దేవిశ్రీ ఈ సాంగ్‌తో నిరూపించాడు.  https://www.youtube.com/watch?v=u_wB6byrl5k ‘ఐతే’ ఐదుగురు స్నేహితులు కలిస్తే ఎంత సరదాగా ఉంటారో.. అల్లరి చేస్తారో ‘ఐతే’ సినిమాలోని 'చిటపట చినుకులు' సాంగ్‌ కళ్లకు కడుతుంది. క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఒకచోట చేరితే ప్రపంచాన్ని మర్చిపోయి వారు ఎంత సంతోషంగా ఉంటారో ఈ పాట చెప్పేస్తుంది. ఫ్రెండ్స్‌ అంతా కలిసి ట్రిప్‌కు వెళ్లినప్పుడు ముందుగా వారికి ఈ పాటనే గుర్తుకు వస్తుంది.  https://www.youtube.com/watch?v=mGmYW7tp2B4 ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ ఒంటరి జీవితమని బాధ పడకుండా దాన్ని ఎంత అందంగా జీవించవచ్చో ‘జాను’ సినిమాలోని ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ తెలియజేస్తుంది. మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉందని కళ్లకు కడుతుంది. డిప్రెషన్‌లో ఉన్న వారు ఒక్కసారి ఈ పాట వింటే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ తరహా సాంగ్‌ తెలుగులో ఇప్పటివరకూ రాలేదని చెప్పవచ్చు.  https://www.youtube.com/watch?v=2a34XyiZO14 ‘చెలియా చెలియా’ ప్రేయసితో సంతోషంగా ఉన్నప్పుడు ముందుగా ‘ఖుషి’లోని ‘చెలియా చెలియా’ పాటనే గుర్తుకు వస్తుంది. నచ్చిన వ్యక్తి  పక్కన ఉంటే  ‘కోపాలు, తాపాలు మనకేలా.. సరదాగా కాలాన్ని గడపాలా’ అంటూ సాగే ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటుంది.  https://www.youtube.com/watch?v=-Z9jQn442Ts
    మార్చి 02 , 2024
    Chiranjeevi Dual Role Movies: మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా?
    Chiranjeevi Dual Role Movies: మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్ చేసిన సినిమాలు ఎన్నో తెలుసా?
    మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీకి మకుటంలేని మహారాజు. ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల చేత మెగాస్టార్‌గా పిలుపించుకున్నారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను రంజింపజేశారు. ఈ సందర్భంగా అనేక సినిమాల్లో డ్యూయర్ రోల్స్ చేసి తనదైన ముద్ర వేశారు. మరి మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్స్‌లో నటించిన చిత్రాలు ఏవో ఓసారి చూసేద్దామా.. 1. నకిలీ మనిషి (1980) చిరంజీవి తొలిసారి 'నకిలీ మనిషి' చిత్రంలో డ్యూయల్ (Chiranjeevi Dual Role Movies) రోల్‌లో కనిపించారు. ఈ సినిమాను ఎస్‌.డీ.లాల్ తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి.. ప్రసాద్, శ్యామ్ పాత్రల్లో కనిపించారు. 2. బిల్లా రంగా  (1982) ఈ చిత్రాన్ని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రాల్లో నటించారు. చిరుతో పాటు మోహన్ బాబు, రాధిక, ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. 3. రోషగాడు (1983)  చిరంజీవి ఈ సినిమాలో శ్రీకాంత్, సికిందర్ అనే రెండు పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కేఎస్‌ఆర్ దాస్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన మాధవి, సిల్క్‌ స్మిత నటించారు. 4. సింహపురి సింహం (1983)  కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి రాజశేఖరం, విజయ్ అనే తండ్రి, కొడుకు పాత్రల్లో అలరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. 5. జ్వాల(1985) రవిరాజా పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి అన్నదమ్ముడిగా(Chiranjeevi Dual Role Movies) నటించారు. ఆయన సరసన రాధిక, భానుప్రియ నటించారు. 6. రక్త సింధూరం (1985) రక్త సింధూరంలో కూడా చిరంజీవి అన్నదమ్ములుగా డబుల్‌ రోల్‌లో మెప్పించారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ గోపిగా, గండ్రగొడ్డలి క్యారెక్టర్‌లో నటించారు. ఈ సినిమాను ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. 7. దొంగమొగుడు (1987) ఎ.కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి.. రవితేజ, నాగరాజుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక, భానుప్రియ నటించారు. 8. యముడికి మొగుడు (1988) రావిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాళీ, బాలు పాత్రల్లో చిరంజీవి డ్యూయల్‌ రోల్‌లో మెప్పించారు. 9.రౌడీ అల్లుడు (1991) కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి ఆటో జానీగా, కళ్యాణ్‌బాబుగా (Chiranjeevi Doublel Role Movies)నటించారు.  10. ముగ్గురు మొనగాళ్లు (1994) ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి... పృథ్వీ, విక్రమ్, నటరాజ రామకృష్ణ దత్తాత్రేయగా మూడు పాత్రల్లో తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమాను కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 11. రిక్షావోడు (1995) కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రల్లో నటించారు. 12. స్నేహం కోసం (1999) కే.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలోనూ చిరంజీవి తండ్రి కొడుకులుగా(Chiranjeevi Dual Role Movies) నటించారు. చిరంజీవి సరసన మీనా నటించింది. 13. అందరివాడు (2005) చిరంజీవి ఈ సినిమాలో మరోసారి తండ్రి కోడుకుల పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. 14. ఖైదీ నంబర్ 150 (2017) ఖైదీ నంబర్ 150 చిత్రాన్ని వి.వి.నాయక్ డైరెక్ట్ చేశారు. మరోసారి రెండు పాత్రల్లో మెగాస్టార్ మెప్పించారు. కత్తి శీను, శంకర్‌గా అలరించారు. మెగాస్టార్ చిరంజీవి మొత్తంగా 14 చిత్రాల్లో డ్యూయల్ రోల్స్‌లో నటించి మెప్పించారు. ఇంకా ఆయన సినీ ప్రస్థానం ముందుకు సాగాలని మనమంత కోరుకుందాం.
    నవంబర్ 10 , 2023
    Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
    Heroines Tattoo: మన హీరోయిన్లు ఏ పార్ట్స్ మీద టాటూస్ వేసుకున్నారో తెలుసా?
    పచ్చబొట్టు (Tattoos) వేసుకోవడం నేడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు వేసుకునే టాటూస్‌పై అభిమానులతో పాటు మీడియా కూడా ఆసక్తిగా గమనిస్తుంటుంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టాటూస్‌లో చాలా మార్పులు వచ్చాయి. ప్రత్యేకించి టాటూస్ కోసం ఆర్టిస్టులు పుట్టుకొచ్చారు. ఆకర్షణీయమైన రంగుల్లో, కోరుకున్న ఆకృతులను వారు శరీరంపై వేస్తుంటారు. ఈ టాటూస్ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా కనిపించడంతో పాటు వారి అందాన్ని మరింత పెంచుతోందనడంలో సందేహం లేదు. మరి మన హీరోయిన్లు ఎలాంటి టాటూస్ ఏ శరీర భాగలపై వేయించుకున్నారో ఓసారి చూద్దాం. Eesha Rebba తెలుగింటి అందం ఈషా రెబ్బ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.   మోడల్ గా కేరిర్ ప్రారంభించిన ఈ భామ ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో 2013లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బందిపోటు, అమీ తుమి, సవ్యసాచి, అరవింద సమేత వీర రాఘవ, పిట్టకథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ లాంటి మూవీల్లో యాక్ట్ చేసింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళంలోనూ న‌టిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ నుంచి కొన్ని ఫ్యాషన్ టిప్స్ నేర్చుకోవచ్చు. ఈ ముద్దుగుమ్మ కుడి చేతి మణి కట్టు మీద నెమలి పించం టాటూను వేయించుకుంది. ఈ టాటూ ఆమె అందాన్ని మరింత పెంచిందనడంలో సందేహం లేదు. Tatoo images యుక్తిత రేజా రంగబలి హీరోయిన్ యుక్తిత రేజా తన నడుము మడతలకు పై భాగంలో కమలం పువ్వు గర్తును టాటూగా వేయించుకుంది. అసలె సెక్సీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఈ టాటూ మరింత హాట్‌గా తయారైంది. నిహారిక కొణిదెల  మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సైతం టాటూస్ అంటే పిచ్చి. ట్రెండీ టాటూస్‌ వేయించుకుంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె కుడి కాలు మడిమపైనా వర్షించే మేఘం చిత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. ఇది చాలా ట్రెండిగా ఉంటుంది. కొత్తగా టాటూస్ వెయించుకోవాలనుకునే వారికి ఇదొక మంచి ఐడియాగా చెప్పవచ్చు.  https://youtu.be/FQVYHolKhR0?si=0WfytTlwJwEcd9Lh గతంలో నిహారిక తన వీపు వెనుక భాగంలో ఓ పిట్ట బొమ్మను టాటూగా వేయించుకుంది. ఇది కూడా మంచి లుక్‌ను అందిస్తుంది. సంయుక్త మీనన్ మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నుంచి కూడా ట్రెండీ టాటూ ఐడియాలను ఫాలో అవ్వొచ్చు. ఆమె వీపు వెనుక భాగంలో మలయాళం అక్షరాల్లో సంచారి అని రాసి ఉంటుంది. ఆ అక్షరాలపైన ఎగిరే పక్షి గుర్తు టాటూగా కనిపిస్తుంది. అలాగే తన ఎడమ చేతి మణికట్టుపై మహా యంత్రం గుర్తును టాటూగా వేయించుకుంది. ఇది కూడా అమ్మాయిలకు మంచి అందాన్ని ఇస్తుంది. https://www.youtube.com/watch?v=f-3OJFK1IZs తృప్తి డిమ్రి టాటూస్  న్యూ నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి కుడి భుజం పై భాగంలో సూర్యుడు- నెలవంక గుర్తుతో టాటూ వేయించుకుంది. ఇది కూడా టాటూ లవర్స్‌కు మంచి ఐడియా అని చెప్పవచ్చు. సమంత టాటూస్ సమంత మొత్తం మూడు టాటూలను తన శరీరంపై వేయించుకుంది. మొదటిది.. తన వీపు వెనుక భాగంలో YMC  అని ఉంటుంది. అంటే ఆమె నటించిన మొదటి చిత్రం ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా ఈ టాటూ వేయించుకుంది. మరొక టాటూ తన మాజీ భర్త నాగచైతన్య పేరును 'చై' అని నడుముకు పై భాగంలో వేయించుకుంది. మూడో టాటూను తన మణికట్టు పై భాగంలో రోమన్ సింబల్స్(డబుల్ యారోస్) రూపంలో వేయించుకుంది. వీటి అర్థం సొంతంగా నువ్వే ఏదైనా సృష్టించు అని. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) శృతి హాసన్ టాటూస్ అందాల తారా శృతి హాసన్ తన వీపు వెనుక భాగంలో తన పేరును తమిళంలో స్టైలీష్ గా టాటూ వేయించుకుంది. అలాగే తన కుడి చేతి మణికట్టు మీద రోజ్ ప్లవర్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూల విషయాన్ని శృతి హాసన్ స్వయంగా ఓ వీడియో ద్వారా చెప్పింది.  https://youtu.be/p9n950dfSyU?si=3YYtZPTgh4ICnxrh రాశి ఖన్నా టాటూస్ గ్లామర్ డాల్ రాశి ఖన్నా తన రైట్ లెగ్ మడిమపైనా టిన్ని క్యాట్ చిత్రాన్ని టాటూగా వేయించుకుంది. ఈ తరహా టాటూలు కూడా సింప్లీ సూపర్బ్‌గా ఉంటాయి.  అనసూయ భరద్వాజ్ టాటూస్ అనసూయ ఒంటి మీద మొత్తం రెండు టాటూలు ఉన్నాయి. మొదటిది తన భర్త ముద్దు పేరును 'నిక్' అని ఇంగ్లీష్ తన చెస్ట్ మీద వేయించుకుంది. మరో టాటూను తన ఎడమ చేతి మణికట్టుపై కేలాన్ అని వేయించుకుంది. గ్రీకు భాషలో కేలాన్ అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ అని అర్థం. ఫరియా అబ్దుల్లా టాటూస్ పాత బస్తీ పిల్ల ఫరియా అబ్దుల్లా అందంతో పాటు ట్రెండీగాను ఉంటుంది. తన  ఎడమ కాలిపై ఎర్రటి వేర్ల గీతలు, నీలి రంగులో వృత్తం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో పైకి ఎదగాలంటే పునాది అనేది చాలా అవసరం. ఈ అర్ధాన్ని వేర్లు చూపిస్తాయి. మన రూట్స్ ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం అనేది ఈ టాటూ ఉద్దేశం. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) అనన్య నాగళ్ల టాటూ గ్లామరస్ డాల్ అనన్య నాగళ్ల తన ఎడమ చేతి మణికట్టుపై క్రేజీ లైన్‌ను టాటూగా వేయించుకుంది. బిలైవ్, స్మైలీ అనే పదాలతో పాటు రెండు ఎగిరే పక్షులను టాటూగా వేయించుకుంది.  View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) మమతా మోహన్ దాస్ టాటూ ఒకప్పుడూ టాలీవుడ్‌ గ్లామర్ డాల్‌గా గుర్తింపు పొందిన మమతా మోహన్ దాస్ తన ఎడమ చేతి భుజంపై వినాయకుడి ప్రతిమను టాటూగా వేయించుకుంది. టాటూ కింద శ్రీ ఓం గణేశా అని ఉంటుంది. నేహా శర్మ టాటూస్ అందాల భామ నేహా శర్మ తన మణికట్టుపై Excelsior అనే పదాన్ని టాటూగా వేయించుకుంది. ఇది ‘అద్భుతమైది, “ఉన్నతం” అనే పదాలను సూచిస్తుంది. శోభిత దూళిపాళ శోభిత దూళిపాళ తన ఎడమ చేతిపై హార్ట్ బీట్‌ గుర్తును టాటూగా వేయించుకుంది. ఈ టైప్ టాటూ చాల మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు.  షిర్లి షెటియా అందాల భామ షిర్లి షెటియా తన కుడి చేతి మణికట్టుపై డబుల్ యారోస్‌ను టాటూగా వేయించుకుంది. ఈ టాటూ అర్థం నువ్వు ఏదైనా సాధించగలవు అనే స్ఫూర్తి వ్యాఖ్యం గురించి చెబుతుంది. View this post on Instagram A post shared by Vaidehi [ I Am Hip Hop Kid ] (@vaidehi_theperformer) రుహాని శర్మ రుహాని శర్మ తన ఎడమ చేతి మీద అర్ధ చంద్రకారాన్ని టాటూగా వేయించుకుంది. అలాగే మెడ వంపులపై టిన్ని బర్డ్స్‌ను టాటూగా వేసుకుంది.
    మే 14 , 2024
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    దేశం మెచ్చిన నటుల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్‌ రికార్డులు, పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్‌కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్‌ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.  డైరెక్టర్స్‌కు భారీ విరాళం లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్‌ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్‌ డైరెక్టర్ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్‌ సభ్యులు తాజాగా ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్‌ చేయాలంటూ ప్రభాస్‌ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.  ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్‌ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. 
    ఏప్రిల్ 23 , 2024

    @2021 KTree