• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Avantika Vandanapu: ఈ కుర్ర పిల్లలో విషయం బాగా ముదిరింది.. ఏకంగా హలీవుడే షేక్‌.!

    బ్రహ్మోత్సవం చిత్రంలో బాలనటిగా అరంగేట్రం చేసిన ‘అవంతిక వందనపు’.. ఇప్పుడు హాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. 

    టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఇప్పుడు వరుస హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా మారింది.

    తాజాగా అవంతిక న‌టించిన హాలీవుడ్ చిత్రం ‘మీన్ గర్ల్స్’ (Mean Girls) విడుద‌లై మంచి విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు ఈ అమ్మ‌డి పేరు సోష‌ల్ మీడియాలో మారు మ్రోగుతుంది.

    ముఖ్యంగా ఈ సినిమాలో అమ్మ‌డు చాలా బోల్డ్‌గా క‌నిపించడంతో పాటు ఓ పాట‌లో శృతిమించి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. బాలనటిగా చేసిన అవంతని ఇలా బోల్డ్‌గా చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

    మ‌నం చూస్తున్న‌ది అప్పుడు తెలుగు సినిమాల‌లో చూసిన అవంతికనేనా.. ఇంత‌లో అంత మార్పా అంటూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. 

    అవంతిక వందనపు.. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్‌ చెల్లెలిగా నటించింది. తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. 

    బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో మహేష్‌ను ఇంటర్యూ చేసి మంచి మార్కులు కొట్టేసింది.

    అవంతిక.. ఇండో-అమెరికన్‌ యువతి. కాలిఫోర్నియాలో తెలుగు మూలలున్న కుటుంబంలో 2005లో పుట్టింది. అక్కడే చదవుకుంటూ డ్యాన్స్‌, నటనలో శిక్షణ తీసుకుంది.

    2014లో ప్రముఖ టీవీ ఛానల్‌ నిర్వహించిన డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌ (నార్త్‌ అమెరికన్‌ ఎడిషన్‌)లో రన్నరప్‌గా నిలిచి అవంతిక అందరిచేత ప్రశంసలు అందుకుంది. 

    ఆ తర్వాత 2016లో ‘బ్రహ్మోత్సవం’ సినిమా ద్వారా నటిగా మెప్పించి బాలనటిగా తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంది. 

    మనమంతా, ప్రేమమ్‌, రారండోయ్‌ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్‌, అజ్ఞాతవాసి చిత్రాల్లోనూ అవంతిక బాల నటిగా మెరిసింది.

    ఇటీవల తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా అవంతికకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె వాటిని తిరస్కరించినట్లు సమాచారం. 

    ప్రస్తుతం అవంతిక తన ఫోకస్‌ మెుత్తం హాలీవుడ్‌ పైనే పెట్టింది. హాలీవుడ్ యానిమేషన్ సిరీస్‌లైన మీరా: రాయల్ డిటెక్టివ్, డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్‌లోని పాత్రలకు ఆమె గాత్రదానం చేసింది.

    హాలీవుడ్లో నటించాలన్న అవంతిక ఆశకు డిస్నీ సంస్థ ఊపిరి పోసింది. స్పిన్ చిత్రం ద్వారా ఆమె కలను నెరవేర్చింది. ఆ తర్వాత ‘సీనియర్ ఇయర్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలోనూ అవంతిక కీలక పాత్ర పోషించింది.

    ప్రస్తుతం ఈ భామా హోరోస్కోప్‌, క్రౌన్‌ విషెష్‌ అనే రెండు హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అదే సమయంలో ఓ రెస్టారెంట్‌లో వర్క్‌ చేస్తూ అవంతిక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 

    అమెరికా సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఎంత రిచ్‌ అయినా 18 ఏళ్లు నిండితే వారు స్వయం కృషితో స్వంతంగా బతకాలి. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమకాళ్లపై తాము నిలబడాలి.

    ఈ క్రమంలోనే అవంతిక (Avantika Vandanapu) త‌ల్లిదండ్రులు ఉన్న‌వాళ్లైన‌ప్ప‌టికీ త‌ను ఓ రెస్టారెంట్‌లో ప‌ని చేస్తూ మ‌రో వైపు సినిమాల‌లో న‌టిస్తూ చాలామంది యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv