• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Venkatesh Soundarya Movies: వెంకటేష్ సౌందర్య జంటగా నటించిన చివరి చిత్రం ఏదో తెలుసా?

    టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా విక్టరీ వెంకటేష్- సౌందర్యకు పేరుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆన్‌ స్క్రీన్‌పై బాగా పండేది. దాదాపు వీళ్లిద్దరు కలిసి నటించిన సినిమాలన్నీ హిట్లుగా నిలిచాయి. సౌందర్య- వెంకటేష్ జంటగా నటించిన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. మరి వెంకటేష్- సౌందర్య కాంబోలో ఎన్ని చిత్రాలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం?

    సూపర్ పోలీస్ (1994)

    విక్టరీ వెంకటేష్- సౌందర్య జంటగా నటించిన తొలి చిత్రం సూపర్ పోలీస్. ఈ చిత్రాన్ని కే. మురళి మోహన్‌రావు డైరెక్ట్ చేయగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో జయసుధ కీలక పాత్రలో నటించారు.

    ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)

    ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్- సౌందర్య మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతో  వెంకటేష్- సౌందర్య హిట్ పేయిర్‌గా గుర్తింపు పొందారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.

    పవిత్ర బంధం (1996)

    వెంకటేష్- సౌందర్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. టాలీవుడ్‌లో ఈ సినిమా ఆల్‌టైం క్లాసిక్ కల్ట్‌ మూవీల్లో ఒకటిగా నిలిచింది. పవిత్ర బంధం సినిమాను ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్‌ బాస్టర్ హిట్ సాధించింది.

    పెళ్లి చేసుకుందాం(1997)  

    ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మరోసారి వెంకటేష్- సౌందర్య జత కట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు లైలా కూడా నటించింది.

    రాజా (1999)

    ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. మరోసారి వెండితెర పర్ఫెక్ట్ పేయిర్ సౌందర్య- వెంకటేష్ జోడీగా నటించారు. ముప్పలనేని శివ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.  ఎస్‌ఏ రాజ్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది. ఈ సినిమా మొత్తం మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది.

    జయం మనదేరా (2000) 

    ఎన్‌ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్-సౌందర్య మధ్య వచ్చే కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఈ చిత్రంలో వెంకటేష్ డ్యుయల్ రోల్ చేయగా… ఆయన సరసన భానుప్రియ, సౌందర్య నటించారు.

    దేవీ పుత్రుడు(2001)

    వెంకటేష్- సౌందర్య నటించిన చివరి చిత్రమిది. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. వెంకటేష్ సరసన సౌందర్యతో పాటు అంజలా జావేరి కూడా నటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv