ఈ వారం రెండే చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. ఒకటి తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన ‘కంగువా’ (Kanguva) కాగా, మరొకటి మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) చేసిన ‘మట్కా’ (Matka) మూవీ. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. తెలుగు రాష్ట్రాల్లో దారుణ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. అంచనా వేసిన కలెక్షన్స్‌లో కనీసం సగం కూడా రాబట్టలేక అందరికీ షాకిచ్చాయి. తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎంత? వాటి ఫ్లాప్‌కు కారణాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
కంగువా కలెక్షన్స్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కంగువా‘ (Kanguva Day 1 Collections). బాహుబలితో ఈ సినిమాను పోల్చడం, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం (నవంబర్ 14) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే ప్రీమియర్స్ నుంచి కంగువాపై నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో డే 1 కలెక్షన్స్‌పై మేకర్స్ పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తమిళనాడులోనే రూ.12 కోట్ల గ్రాస్ రాబట్టింది. హిందీ బెల్ట్‌లో రూ.4 కోట్లు వసూలు చేసినట్లు టాక్. సూర్యకు మంచి మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 6 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. తొలి రోజు రూ.100 కోట్లు పైనే కలెక్షన్స్ ఆశించిన మూవీ టీమ్‌కు అందులో సగం కూడా రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఈ కలెక్షన్స్ కూడా పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం వల్లే వచ్చాయని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నేటి నుంచి కలెక్షన్స్‌లో మరింత కోత పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి.
‘కంగువా’ లెక్క ఎక్కడ తప్పిందంటే!
దర్శకుడు శివ కంగువాను వెయ్యేళ్ల కిందటి ఓ జానపద కథకి, ప్రస్తుత కాలానికి ముడిపెతూ రూపొందించారు. బలమైన కథనే దర్శకుడు ఎంచుకున్నప్పటికీ దానిని అర్థవంతంగా చెప్పడంలో పూర్తిగా తడబడ్డారు. కథని వర్తమానంతో ముడిపెట్టే క్రమంలో తొలి 20 నిమిషాల సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి. కంగువా పాత్ర తెరపైకి వచ్చాకైనా కథపై పట్టుసాధించాడా అంటే అదీ లేదు. ప్రణవకోన, కపాల కోన, సాగర కోన, అరణ్యకోన, హిమ కోన అంటూ ఐదు వంశాలను పరిచయం చేస్తూ గజిబిజి వాతావరణాన్ని సృష్టించారు. ఏ కోనతోనూ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఇవ్వలేదు. ప్రతి పాత్ర బిగ్గరగా అరుస్తూ సంభాషించుకోవడం వల్ల ప్రేక్షకుల్లో ఒకవిధమైన అసహనం కలిగింది. అయితే ఫ్రాన్సిస్, కంగువా పాత్రల్లో సూర్య నటన, రుధిర అనే పాత్రలో బాబీ దేవోల్ విలనిజం సినిమాకు కొంతమేర ఊపిరినిచ్చాయి.
మట్కా ఓపెనింగ్స్ మరీ దారుణం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) హీరోయిన్గా చేసిన ‘మట్కా’ (Matka Day 1 Collections) చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. గురువారం రిలీజైన ఈ చిత్రం కూడా నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. దీంతో తొలిరోజు ఈ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా కేవలం రూ. 1.2 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం రూ.కోటీ కూడా రాబట్టలేకపోయిందని పేర్కొన్నాయి. రూ.80 లక్షల నుంచి రూ.కోటి లోపు మాత్రమే వసూళ్లు వచ్చాయని స్పష్టం చేశాయి. తొలి రోజు ఆక్యూపెన్సీ 20 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపాయి. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రానికి ఇంత తక్కువ స్థాయిలో రెస్పాన్స్ రావడాన్ని చూసి ట్రెడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
మట్కా ఫ్లాప్‌కు కారణాలు ఇవే!
దర్శకుడు కరుణ కుమార్ చాలా రొటీన్ స్టోరీని మట్కాకు ఎంచుకున్నాడు. ‘చేతిలో చిల్లిగవ్వ లేని యువకుడు ఓ పెద్ద నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం’ ప్లాట్‌తో గతంలో చాలా చిత్రాలే వచ్చాయి. కథ వరకూ కాస్త పర్వాలేదని అనుకున్నా మూవీలోని పాత్రల మధ్య సంఘర్షణ పూర్తిగా కొరవడింది. ముఖ్యంగా హీరో ఎదుగుతున్న క్రమం మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఎక్కడా సహజంగా ఎదుగుతున్న ఫీల్ అనిపించదు. హీరో ఏం చేస్తున్నా ఒక్క సవాలు ఎదురుకాదు. దేశానికి ముప్పుగా మారిన వాసును పట్టుకునేందుకు సీబీఐ చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా అనిపించవు. అతడ్ని పడగొట్టేందుకు ప్రత్యర్థులు వేసే ఎత్తులు మరీ పేలవంగా ఉంటాయి. వరుణ్ తేజ్ నటన మినహా సినిమాలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ఒక్క పాయింట్ కూడా లేదని సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!