• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PAWAN KALYAN: IMDBలో పవర్‌ స్టార్‌ టాప్‌ రేటెడ్‌ చిత్రాలు.. వీటి పేరు చెబితే ఫ్యాన్స్‌కు పూనకాలే..! 

    టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆయనకు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ ఏ హీరోకు లేదనడంలో అతిశయోక్తి లేదు. పవన్‌ క్రేజ్‌ సినిమాలకు అతీతమైనది కావడమే ఇందుకు కారణం. ఎందుకంటే పవన్‌ను హీరోగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా ఆరాధించేవారే ఎక్కువ. ఇక పవన్‌ తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు తీశాడు. ఆయన తీసిన తమ్ముడు, తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్‌సింగ్‌, అత్తారింటికి దారేది చిత్రాలు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. ఈ చిత్రాలను ఇప్పటికీ పవన్‌ ఫ్యాన్స్ రిపీట్‌ మోడ్‌లో చూస్తుంటారు. ఈ నేపథ్యంలో IMDB (Internet Movie Database)లో టాప్‌ రేటెడ్‌ పవన్‌ మూవీస్‌ ఏవో ఇప్పుడు చూద్దాం. 

    1. తొలి ప్రేమ

    IMDBలోని పవన్‌ కల్యాణ్‌ సినిమాల జాబితాలో ‘తొలి ప్రేమ’ (Tholi Prema) టాప్ రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రానికి IMDB 8.4 రేటింగ్ ఇచ్చింది. తొలి ప్రేమ చిత్రం పవన్‌ కెరీర్‌లో నాల్గో సినిమా. 1998లో విడుదలైన ఈ మూవీకి కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. పవన్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. కీర్తి రెడ్డి ఇందులో హీరోయిన్‌గా చేసింది. తొలి ప్రేమలోని పాటలు అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘నీ మనసే’ పాట ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ అని సాంగ్‌.

    2. ఖుషి 

    పవన్‌ సినిమాల్లో ‘ఖుషి’ (Kushi) చిత్రం బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ చిత్రానికి IMDB 8.1 రేటింగ్ ఇచ్చింది. ఈ చిత్రంలో పవన్‌ మేనరిజమ్స్‌, సొంతంగా కొరియోగ్రాఫ్‌ చేసిన ఫైట్స్‌ మూవీకే హైలెట్‌ అని చెప్పొచ్చు. 2001లో వచ్చిన ఈ సినిమాకు S.J. సూర్య దర్శకత్వం వహించాడు. భూమిక చావ్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే ఈ చిత్రం రీ-రిలీజ్‌ కావడం విశేషం. తాజాాగా ఇదే సినిమా పేరుతో విజయ్‌ దేవరకొండ ఓ మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది. 

    3. తమ్ముడు 

    1999లో వచ్చిన ‘తమ్ముడు’ (Thammudu) చిత్రం బిగ్గెస్ట్‌ హిట్ అందుకుంది. ఈ చిత్రం IMDBలో 7.9 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అన్న కలను నెరవేర్చే తమ్ముడిగా పవన్‌ కల్యాణ్‌ నటించాడు. ఇందులో పవన్‌ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా పవన్‌ పండించిన హాస్యం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రానికి P.A అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహించాడు. ప్రీతి ఝూంగియాని, అదితి గోవరికర్ హీరోయిన్లుగా నటించారు. 

    4. జల్సా

    త్రివిక్రమ్‌ – పవన్‌ కల్యాణ్‌ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి బంధానికి బీజం వేసిన చిత్రం మాత్రం ‘జల్సా’ (Jalsa). త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో 2008లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ అప్పట్లో యూత్‌ను ఉర్రూతలూగించింది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ చిత్రానికి IMDB 7.4 రేటింగ్ ఇచ్చింది. 

    5. బద్రి

    పూరి జగన్నాథ్‌, పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మెుదటి సినిమా ‘బద్రి’ (Badri). ఈ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో పవన్‌ కల్యాణ్‌ చెప్పే డైలాగ్స్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ‘నువ్వు నందా అయితే నేను బద్రి.. బద్రినాథ్‌’ అనే డైలాగ్‌ ప్రేక్షకులను పవన్‌కు మరింత దగ్గర చేసింది. ఈ చిత్రానికి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది. 

    6. అత్తారింటికి దారేది

    మాటల మంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో పవన్‌ నటించిన రెండో చిత్రం ‘అత్తారింటికి దారేది’ (Attarintiki daredi). ఈ మూవీకి IMDB 7.3 రేటింగ్ ఇచ్చింది. 2013లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విడుదలకు ముందే ఈ సినిమా ఒరిజినల్‌ ప్రింట్‌ లీకైనప్పటికీ కలెక్షన్స్‌పై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. దీన్ని బట్టి ఫ్యాన్స్‌లో పవన్‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటించారు. 

    7. గోపాల గోపాల

    పవన్ కల్యాణ్‌, వెంకటేష్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం ‘గోపాల గోపాల’ (Gopala Gopala). బాలీవుడ్ చిత్రం ‘ఓఎంజీ’ (OMG)కి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 2015లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్‌ ప్రధాన పాత్ర పోషించగా.. పవన్‌ దేవుడిగా కనిపించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు IMDB సైతం ఈ మూవీకి 7.2 రేటింగ్ ఇచ్చింది. తాజాగా విడుదలైన ‘బ్రో’ చిత్రంలోనూ పవన్‌ దేవుడిలా కనిపించడం విశేషం.

    8. గబ్బర్‌ సింగ్‌

    హిందీలో సల్మాన్‌ ఖాన్‌ చేసిన ‘దబాంగ్’ చిత్రానికి రీమేక్‌గా ‘గబ్బర్‌ సింగ్’ (Gabbar singh) చిత్రం రూపొందింది. కథలో కొన్ని మార్పులు చేసి దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పవన్‌ తనదైన స్టైల్‌లో పోలీసు పాత్రను పోషించాడు. తన బాడీ లాంగ్వేజ్‌తో  అభిమానుల చేత ఈలలు వేయించాడు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇందులో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. కాగా, IMDB ఈ మూవీకి 7.1 రేటింగ్ ఇచ్చింది. 

    9. వకీల్‌సాబ్‌ 

    వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన చిత్రం వకీల్‌ సాబ్‌ (Vakeel saab). హిందీ పింక్‌ చిత్రానికి ఇది రీమేక్‌. 2021లో కోర్టు రూమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌ లాయర్‌గా కనిపించాడు. ఇందులోనూ శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం IMDBలో 7.0 రేటింగ్‌ సంపాదించింది.

    10. పంజా

    ‘పంజా’ (Panja) చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ రూపొందించారు. ఇందులో పవన్ స్టైలిష్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. 2011లో విడుదలైన ఈ చిత్రంలో సారా జేన్‌, అంజలి  లవానియా హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రానికి IMDB 6.5 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద పంజా పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv