• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Sonakshi Sinha: సోనాక్షి  ప్రెగ్నెంట్ అంటూ టార్గెట్‌ చేసిన నెటిజన్లు.. అసలు నిజం ఇదే!

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) అనే బాలీవుడ్‌ నటుడితో రెండేళ్లుగా రిలేషన్‌లో ఉన్న సోనాక్షి.. తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంది. జూన్ 23న కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోనాక్షి నెట్టింట పంచుకోవడంతో పెళ్లి విషయం వెలుగుచూసింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆసుపత్రి బయట సోనాక్షి సిన్హా కనిపించడం చర్చనీయాశంగా మారింది. పెళ్లైన ఐదు రోజులకే సోనాక్షి గర్భవతి అయ్యిదంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో వాస్తవమెంతా? సోనాక్షి ఎందుకు ఆస్పత్రికి వెళ్లింది? అందుకు గల కారణం ఏంటి? ఇప్పుడు చూద్దాం. 

  ఆస్పత్రి వీడియో వైరల్‌

  ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రికి తాజాగా నటి సోనాక్షి సిన్హా తన భర్త జహీర్‌ ఇక్బాల్‌తో కలిసి వెళ్లారు. దీంతో ఆమెకు పెగ్నెన్సీ వచ్చిందన్న రూమర్లు ఒక్కసారిగా బయటకొచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో పెళ్లైన ఐదు రోజులకే ఆమె ప్రెగ్నెంట్‌ అయ్యిందంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. చెకప్‌ చేయించుకోవడం కోసమే నవ దంపతులు ఆసుపత్రికి వెళ్లారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. పెళ్లై వారం కాకుండానే ప్రెగ్నెంట్‌ కావడం ఏంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

  నిజం ఏంటంటే?

  ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్న సిన్హా.. సోనాక్షి సిన్హాకు స్వయానా తండ్రి. అయితే ఒత్తిడి కారణంగా శత్రుఘ్న కాస్త అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబయిలో కోకిలా బెన్‌ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తండ్రిని యోగ క్షేమాలు తెలుసుకునేందుకు సోనాక్షి సిన్హా తన భర్తతో ఆసుపత్రికి వెళ్లినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశాయి. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్‌ కాదని క్లారిటీ ఇచ్చాయి.

  విందుతో పరిచయం

  బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్ ఇచ్చిన ఓ విందులో తొలిసారి సోనాక్షి, జహీర్‌ ఇక్బాల్‌ కలిశారు. అక్కడ ఏర్పడిన పరిచయం తొలుత స్నేహంగా మారింది. రెండేళ్ల క్రితం ఇద్దరూ కలిసి ‘డబుల్‌ ఎక్సెల్‌’ ఫిల్మ్‌ కూడా చేశారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురుంచినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే వారికి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగిందని రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లితో ఈ  రూమర్లకు సోనాక్షి జంట బ్రేక్‌ వేసింది. అయితే పెళ్లికి ముందే కాబోయే శ్రీమతికి రూ.3 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారును జహీర్‌ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

  సోనాక్షి స్టార్‌డమ్‌

  శత్రుఘ్న సిన్హా నట వారసురాలిగా సోనాక్షి సిన్హా.. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి చిత్రం ‘దబాంగ్‌’ (Dabangg) బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) సరసన రాజో పాండే పాత్రలో సోనాక్షి అదరగొట్టింది. తన తర్వాతి చిత్రం అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)తో ‘రౌడీ రాథోడ్‌’ (Rowdy Rathore)లో కనిపించి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు మారిపోయింది. ఆ తర్వాత వరుసగా ఓమై గాడ్‌, దబాంగ్‌ 2, యాక్షన్‌ జాక్సన్‌, లింగా, అకిరా, ఫోర్స్‌ 2, దంబాగ్‌ 3, డబుల్‌ ఎక్స్ఎల్‌ చిత్రాలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కకుడా, నికితా రాయ్ అండ్‌ ది బుక్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ చిత్రాల్లో సోనాక్షి నటిస్తోంది. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv