• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bharateeyudu 2 Trolls: 106 ఏళ్ల వయసులో ఎగిరెగిరి ఆ ఫైట్స్ ఏంటి..? ఏకిపారేస్తున్న నెటిజన్లు!

    గ్లోబల్‌ స్టార్‌ కమల్‌ (Kamal Hassan) హాసన్‌ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2). స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై జాతీయ స్థాయిలో బజ్‌ ఉంది. విశ్వనటుడు కమల్‌ హాసన్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్‌ మూవీ ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2). హీరో సిద్ధార్థ్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు హీరోయిన్లుగా చేశారు. జులై 12న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం (జూన్‌ 25) ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సేనాపతి పాత్రలో కమల్‌ హాసన్‌ అదరగొట్టారు. అయితే కొందరు మాత్రం కమల్‌ పాత్రను టార్గెట్‌ చేస్తూ నెట్టింట ట్రోల్స్‌ చేస్తున్నారు. 

    ట్రోల్స్‌కు కారణమిదే?

    ‘భారతీయుడు 2’ సినిమాలో 106 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కమల్‌ హాసన్‌ కనిపించారు. ముఖం మెుత్తం ముడతలతో.. పార్ట్ -1 (భారతీయుడు)లోని సేనాపతి కంటే మరింత వయసు మళ్లిన వ్యక్తిగా దర్శకుడు కమల్‌ను చూపించారు. యంగ్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్ సీక్వెన్స్‌లు పెట్టినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. అవినీతిలో కూరుకుపోయిన అధికారులను ఎంతో సాహసోపేతంగా కమల్‌ హత్య చేయడం గమనించవచ్చు. అయితే వందేళ్లకు పైబడిన వ్యక్తి ఇలా యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్ములేపడం లాజిక్‌లెస్‌గా ఉందంటూ కొందరు సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ఆ వయసులో కాళ్లు, చేతులు కదపడానికే కష్టంగా ఉంటుందని.. కానీ, సేనాపతి మాత్రం అలవోకగా స్టంట్స్‌ చేసేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆ వయసులో ఉన్న తాత ఈ రేంజ్‌లో ఫైట్లు, ఎగిరెగిరి కొట్టడాలు ఎలా సాధ్యమవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమాటిక్‌ ఫ్రీడం ఉండొచ్చు కానీ, మరీ ఈ స్థాయిలో కాదని హితవు పలుకుతున్నారు. 

    శంకర్‌.. స్ట్రాంగ్‌ కౌంటర్‌

    ‘భారతీయుడు 2’లో కమల్‌ పాత్ర గురించి వస్తోన్న ట్రోల్స్‌పై డైరెక్టర్‌ శంకర్‌ స్పందించారు. తనదైన శైలిలో ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘106 సంవత్సరాల వ్యక్తి ఇలా ఫైట్స్ చేయడం సాధ్యమే. చైనా దేశంలో లూజియా అనే ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఇప్పటికీ 120 ఏళ్ల వయసులో కూడా గాల్లో ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నారు. ఆయన గాల్లో ఎగురుతూ కిక్స్ ఇస్తూ, ఫైట్స్ చేస్తున్నారు. ఆయన ప్రేరణతోనే సేనాపతి పాత్రను తీర్చిదిద్దాం’ అంటూ శంకర్‌ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్‌ శంకర్‌కు పలువురు నెటిజన్లు మద్దతిస్తున్నారు. సినిమాను సినిమాలాగా చూడాలని.. లాజిక్స్‌ గురించి ఆలోచిస్తే ఏ మూవీ చూడలేరని కామెంట్స్ చేస్తున్నారు. 

    ట్రైలర్ ఎలా ఉందంటే?

    ‘ఇండియన్‌ 2’ నుంచి విడుదలైన లేటెస్ట్ ట్రైలర్.. అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ట్రైలర్‌లో.. హీరో సిద్దార్థ్‌ను ఓ స్టూడెంట్‌లా చూపించారు. అన్యాయాలు, అక్రమాలను ఎదిరించే పాత్రలో అతడు కనిపించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో సమాజంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని ట్విటర్‌లో ‘ఆయన మళ్లీ రావాలి’ హ్యాష్‌టాగ్‌ను యూత్‌ ట్రెండ్‌ చేస్తారు. దీంతో సేనాపతి రీఎంట్రీ ఇస్తాడు. అవినీతి చేసిన కొందరిని శిక్షించడం ట్రైలర్‌లో చూడవచ్చు. విజువల్స్‌ పరంగా ట్రైలర్‌ చాలా రిచ్‌గా ఉంది. యాక్షన్‌ సన్నివేశాలను డైరెక్టర్‌ శంకర్‌ తనదైన మార్క్‌తో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. అనిరుధ్‌ అందించిన నేపథ్యం సంగీతం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv