ప్రముఖ నటుడు అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), స్టార్ నటి శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంతతో విడాకుల అనంతరం చైతూ ఈ పెళ్లికి రెడీ కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. దానికి తోడు సామ్ తమ విడాకుల గురించి తరుచూ ఏదోక కామెంట్స్ చేస్తుండటం కూడా చైతూ సెకండ్ మ్యారేజ్‌పై అందరి ఫోకస్ పడేలా చేసింది. ఇదిలా ఉంటే చైతూ-శోభిత పెళ్లి పనులు మెుదలైనట్లు తెలుస్తోంది. వారిద్దరు హల్దీ వేడుకలు (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony) చేసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
పసుపు దుస్తుల్లో..
అక్కినేని నాగచైతన్య – శోభితా దూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న గ్రాండ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా హల్దీ వేడుకలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. హల్దీ వేడుకల్లో (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony) చైతూ-శోభితా చాలా సంతోషంగా కనిపించారు. కుటుంబ సభ్యులు వారికి పసుపు నీటితో మంగళ స్నానం చేయించారు. శోభితాపై నీళ్లు పోస్తున్న సందర్భంలో తీసిన ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఆ సమయంలో చైతన్య చిలిపి చేష్టలు చేసినట్లు తెలుస్తోంది. చేతిలోకి నీళ్లు తీసుకొని శోభిత ముఖాన చైతూ చల్లినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈ హల్దీ ఫొటోలు అక్కినేని అభిమానులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరూ చూసేయండి.
నాగేశ్వరరావు విగ్రహం ఎదుట..
నాగచైతన్య – శోభిత వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా జరగనుంది. అయితే ఇరుకుటుంబాలకు చెందిన అతి ముఖ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. రీసెంట్గా తమ పెళ్లి గురించి మాట్లాడిన నాగ చైతన్య ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. చాలా సింపుల్‌గా, సంప్రదాయబద్దంగా శోభిత తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదురుగా ఈ పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. అతిథుల జాబితాను శోభితాతో కలిసి తయారు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
అందులో వాస్తవం లేదట
నాగచైతన్య – శోభిత పెళ్లి (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony)ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్ వర్గాలు రూ.50 కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరిగింది. గతంలో నయనతార-విఘేష్ తరహాలోనే చైతూ కూడా తన పెళ్లిని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపించింది. అయితే అందులో వాస్తవం లేదని సమాచారం. స్ట్రీమింగ్కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు అక్కినేని ఫ్యామిలీని సంప్రదించలేదని తెలుస్తోంది. అవి జస్ట్ పుకార్లు మాత్రమేనని ఫిల్మ్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.
రెండేళ్లుగా ప్రేమాయణం
సమంతతో విడాకుల అనంతరం నటుడు నాగచైతన్య (Naga Chaitanya and Sobhita Dhulipala Haldi ceremony) శోభితకు దగ్గరయ్యాడు. వీరిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. క్యాండిల్ లైట్ డిన్నర్లు, డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరు కలిసి ఓ రెస్టారెంట్లో ఉన్న ఫొటోలు సైతం అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ చైతూ-శోభిత ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 4న బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు.
శోభితా సీక్రెట్స్ ఇవే
శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో పుట్టింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచి సత్తా చాటింది. హిందీలో వచ్చిన ‘రామన్ రాఘవన్ 2.0’ (2016) సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చిన గూఢచారి చిత్రంతో తొలిసారి టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ను కట్టిపడేసింది. ఆ తర్వాత ‘మేజర్’, ‘పొన్నియన్ సెల్వన్ 1 & 2’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇటీవల ‘మంకీ మాన్’ అనే అమెరికన్ ఫిల్మ్‌లోనూ శోభితా మెరిసింది. రీసెంట్గా హిందీలో ‘లవ్, సితారా’ అనే చిత్రం చేసింది. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ