నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘హనుమాన్’తో యావత్ దేశాన్ని అలరించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతడు ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి సింబ’ (Simba) అనే సాలిడ్ పేరును సైతం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నిర్మించనుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం తన లుక్‌ను మార్చుకునే పనిలో మోక్షజ్ఞ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడికి సంబంధించిన తాజా లుక్ బయటకు వచ్చింది. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అతడి మేకోవర్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
లుక్ ఎలా ఉందంటే?
ఒకప్పుడు మోక్షజ్ఞ (Mokshagna Teja)ను చూస్తే చాలా బొద్దుగా హీరో మెటీరియల్ లాగానే అనిపించేవాడు కాదు. అయితే సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైన నేపథ్యంలోనే ఈ యంగ్ నట సింహం తన మేకోవర్‌పై దృష్టి పట్టింది. ఫిట్నెస్ పెంచుకోవడంతో పాటు హ్యాండ్సమ్గా కనిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలోనే ఇటీవల మోక్షజ్ఞ సంబంధించిన నయా మేకోవర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హీరో అంటే ఇలా కదా ఉండాని అనేంతలా అతడు మారిపోయాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఫొటోనే మోక్షజ్ఞకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో మోక్షజ్ఞ గత ఫొటోల్లోకంటే మరింత హ్యాండ్సమ్గా కనిపించాడు. లుక్స్‌లో తనకు సాటి ఎవరు రాలేరు అన్న విధంగా మెస్మరైజ్ చేశాడు.
‘యాక్షన్‌కు సిద్ధమా?’
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) మోక్షజ్ఞకు సంబంధించిన నయా ఫొటోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. అది క్షణాల్లో నెట్టింట వైరల్ మారింది. మోక్షజ్ఞ ఫొటోను షేర్ చేస్తూ ‘యాక్షన్ కోసం సిద్ధమా?’ అంటూ ప్రశాంత్ వర్మ క్యాప్షన్ ఇచ్చాడు. ‘సింబా ఈజ్ కమింగ్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను దానికి జోడించారు. దీంతో ‘సింబా’ సినిమాలో మోక్షజ్ఞ ఈ లుక్‌లోనే కనిపిస్తాడని స్పష్టమవుతోంది. ఇక టాలీవుడ్లో మరో ప్రిన్స్ అడుగుపెట్టబోతున్నారంటూ నందమూరి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచి మరో అందగాడు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. బాలయ్య కుమారుడు అంటే ఆ మాత్రం గ్లామర్ తప్పనిసరి అంటూ ఆకాశానికెత్తుతున్నారు.
ఇతిహాసాల స్ఫూర్తితో..
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ‘సింబా’ ప్రాజెక్ట్ రూపొందనుంది. లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి S.L.V. సినిమాస్ పతాకంపై సుధారర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు. ఇతిహాసాల ఆధారంగా రూపొందనున్న సోషియో ఫాంటసీ చిత్రమిదని గతంలోనే ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చేసారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆఖరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మూవీ లాంచ్ గురించి ఏర్పాట్లు కూడా మెుదలుకానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో పక్కాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ‘యాక్షన్ కోసం సిద్ధమా?’ అంటూ ప్రశాంత్ పెట్టిన లేటెస్ట్ పోస్టును బట్టే ఈ సినిమా పట్టాలెక్కేందుకు ఎక్కువ రోజుల సమయం లేదని స్పష్టమవుతోంది.
విలన్, హీరోయిన్ ఫిక్స్!
మోక్షజ్ఞ (Mokshagna Teja) సినిమాలో హీరోయిన్, విలన్ సైతం ఫిక్సయినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా థడాని (Rasha Thadani) ఇందులో కథానాయికగా చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను ఆడిషన్ సైతం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. మరోవైపు విలన్ పాత్రను కూడా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫైనల్ చేశారని అంటున్నారు. రానా (Rana Daggubati) పేరును విలన్ క్యారెక్టర్‌కు పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఆయన సంప్రదిస్తారని ప్రచారం జరుగుతోంది. రానా ఓకే చెప్పేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ సైతం మోక్షజ్ఞ సినిమాలో స్పెషల్ రోల్ చేసే ఛాన్స్ ఉందని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమా పట్టాలెక్కకముందే మోక్షజ్ఞ ప్రాజెక్ట్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ