ప్రస్తుతం యావత్ దేశం ‘పుష్ప 2’ (Pushpa 2) మేనియా నడుస్తోంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘పుష్ప’ (2021)కు సీక్వెల్‌గా ఇది వస్తుండటంతో సహజంగానే అందరి దృష్టి ఈ మూవీపై పడింది. రిలీజ్‌కు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో హీరో బన్నీతో పాటు మూవీ టీమ్ దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. పాట్నా, చెన్నై, కొచ్చి నగరాల్లో భారీ ఈవెంట్లు నిర్వహించి సినిమా మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇటీవల కొచ్చి ఈవెంట్లో ‘పీలింగ్స్’(peelings) అనే సాంగ్‌ను మలయాళ ప్రేక్షకుల కోసం బన్నీ స్పెషల్‌గా ప్లే చేశారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్‌ను సైతం ప్రకటించారు. అయితే ఈ పాటను ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)కు పోటీగా తీసుకొస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా చేసింది. ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. జగపతిబాబు, సునీల్, అనసూయ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ‘పుష్ప 2’ టీమ్ నాలుగో పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. కొచ్చి ఈవెంట్లో కొద్ది సెకన్ల పాటు ప్లే చేసిన ‘పీలింగ్స్’ పాటకు సంబంధించి ఈ ప్రోమోను విడుదల చేశారు. ఆ ఈవెంట్లో బన్నీ చెప్పినట్లుగానే మలయాళ లిరిక్స్‌తో పాట మెుదలైంది. 25 సెకన్ల పాటు ఉన్న ఈ ప్రోమో మంచి బీట్తో ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 1 ఆదివారం రోజున ఈ పాటకు సంబంధించి లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘నానా హైరానా’కు పోటీగా రిలీజ్?
రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి గురువారం (నవంబర్ 28) మూడో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నానా హైరానా’ (Naanaa Hyraanaa) అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కు మ్యూజిక్ లవర్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. ఇటీవల ‘పుష్ప 2’ నుంచి రిలీజైన ‘కిస్సిక్’ పాట కంటే ‘నానా హైరానా’ చాలా బాగుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి. పలు యూట్యూబ్ చానెళ్లు సైతం దీనిపై పోల్స్ నిర్వహించగా మెజారిటీ ప్రేక్షకులు ‘నానా హైరానా’కు అనుకూలంగా ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో ఆ మెలోడీ సాంగ్‌కు పోటీగా మంచి బీట్ ఉన్న ‘పీలింగ్స్’ పాటను ‘పుష్ప 2’ మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతో ‘పుష్ప 2’ మేకర్స్‌కే తెలియాలి.
హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్
తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2) వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇవాళ ముంబయిలోనూ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే హోమ్ ల్యాండ్ అయిన తెలుగు స్టేట్స్ ఇప్పటివరకూ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించలేదు. దీంతో హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్‌ను ‘పుష్ప 2’ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు ఎంతో కీలకమైన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా ఇప్పటికే మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసుల అనుమతి సైతం లభిస్తే డిసెంబర్ 1న సాయంత్రం ఈవెంట్ జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఫోర్త్ సింగిల్ ‘పీలింగ్స్’ను కూడా రిలీజ్ చేసే అవకాశముంది.
సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బన్నీనే!
‘పుష్ప 2’ చిత్రానికి సంబంధించి గురువారం సెన్సార్ బోర్డ్ రివ్యూ పూర్తైంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఈ సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ‘పుష్ప 2’ ఓ అరుదైన ఘనతను సాధించింది. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన అత్యధిక నిడివి గల చిత్రాల జాబితాలో టాప్ – 3 నిలిచింది. గతంలో నందమూరి తారకరామారావు చేసిన దాన వీర శూర కర్ణ (3 గం.ల 43 నిమిషాలు), లవ కుశ (3 గం.ల 28 నిమిషాలు) చిత్రాలు నిడివి పరంగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కాబట్టి నిడివి పరంగా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బన్నీ టాప్‌లో ఉన్నాడని చెప్పవచ్చు.
నెట్టింట హీట్ పెంచేసిన రష్మిక!
ఈ తరం స్టార్ హీరోయిన్లలో యంగ్ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఒకరు. ఆమెను అంతా నేషనల్ క్రష్ అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. తాజాగా ‘పుష్ప 2’ ఈవెంట్‌కు హాజరైన రష్మిక తన గ్లామర్‌తో అక్కడి వారి మతి పోగొట్టింది. గ్రీన్ కలర్ శారీలో ఎద అందాలు చూపిస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారాయి. నేషనల్ క్రష్ అంటే ఆమాత్రం అందం ఉండాలిలే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ‘పుష్ప 2’ సినిమా లవర్స్ సైతం శ్రీవల్లి భలే గ్లామర్‌గా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలను మీరూ ఓసారి చూడండి.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’