• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kalki 2898 AD Secrets: ‘కల్కి’ సక్సెస్‌ వెనక ఇంత కష్టం దాగుందా? మూవీ టీమ్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం.. సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని థియేటర్లలోనూ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. హాలీవుడ్‌ రేంజ్‌ విజువల్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నటీనటుల గెటప్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ స్థాయి సక్సెస్‌ కల్కి టీమ్‌కు అంత ఈజీగా రాలేదు. దీని వెనక అంతులేని శ్రమ దాగుంది. కల్కి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ (Secrets of Kalki 2898 AD) తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

    40 ఏళ్ల తర్వాత..

    కల్కి సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ (KALKI 2898 AD Hidden Truth) ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాష్కిన్‌ అనే ప్రతినాయకుడి పాత్రలో కమల్‌హాసన్‌ కనిపించారు. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఈ సినిమాలో నటించారట. 1985లో వచ్చిన ‘గిరాఫ్తార్’ అనే సినిమాలో చివరిగా అమితాబ్, కమల్‌ నటించారు. ఆ తర్వాత మళ్లీ కల్కిలోనే వీరిద్దరు కలిసి పనిచేశారు. 

    కమల్‌ లుక్‌ కష్టాలు..

    ‘కల్కి 2898 ఏడీ’ కమల్‌ హాసన్‌ చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. ఈ లుక్‌ ఫైనల్‌ చేసే క్రమంలో ఎన్నో గెటప్‌లను పరిశీలించారట. దేనితోనూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సంతృప్తి చెందలేదట. చివరకు లాస్‌ ఏంజెల్స్ వెళ్లి అక్కడ హాలీవుడ్‌ సినిమాలకు వర్క్ చేసే మేకప్‌ నిపుణులను కల్కి టీమ్‌ సంప్రదించట. అలా కమల్‌ హాసన్‌ ప్రస్తుత లుక్‌ బయటకొచ్చిందని సినీ వర్గాలు తెలిపాయి. 

    మేకప్‌కు కోసం 5 గంటలు

    కల్కి సినిమాలో అశ్వత్థామ గెటప్‌ కూడా ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. 81 ఏళ్ల వయసున్న అమితాబ్‌ బచ్చన్‌  (Amitabh Bachchan) ఈ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారు. అయితే అశ్వత్థామ మేకప్ వేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టేదని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇక తీయడానికి మరో 2 గంటలు పట్టేదట. దీంతో అమితాబ్‌ మేకప్‌ కోసమే అచ్చంగా 5 గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

    బుజ్జి కోసం రూ.4 కోట్లు

    ‘కల్కి’లో ప్రభాస్‌ రైడ్‌ చేసిన ‘బుజ్జి’ (KALKI 2898 AD Hidden Truth) అనే ఫ్యూచరిక్‌ వెహికల్‌ను ఎంతో కష్టపడి చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. బుజ్జి తయారీకి మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌తో పాటు, కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజినీరింగ్ టీమ్‌ సహకారం అందించింది. ఈ ఒక్క కారు కోసమే రూ.4కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. 

    700VFX షాట్స్‌

    కల్కి సినిమాలో కాశీ, శంబల, కాంప్లెక్స్‌ అనే మూడు ఫ్యూచరిక్‌ ప్రపంచాలను డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ క్రియేట్‌ చేశారు. కాశీని నిర్జీవంగా.. శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబలను చూపించారు. పుష్కలమైన వనరులను కలిగినట్లు కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దారు. ఇలా చూపించేందుకు మెుత్తం వీఎఫ్‌ఎక్స్‌నే ఉపయోగించారు. ఇందుకోసం 700 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉపయోగించినట్లు సమాచారం. 

    హాలీవుడ్‌ యంత్రాంగం

    ‘కల్కి 2898 ఏడీ’ విజువల్‌ వండర్‌గా ఉందంటూ పెద్ద ఎత్తున టాక్‌ వస్తోంది. హాలీవుడ్‌ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలు ఈ సినిమాకు పనిచేయడమే ఇందుకు కారణం. ప్రముఖ హాలీవుడ్‌ చిత్రాలైన హ్యారీ పోటర్‌, ఇంటర్‌స్టెల్లర్‌, డ్యూన్‌, బ్లేడ్‌ రన్నర్‌ వంటి భారీ హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన VFX టీమ్‌ ‘కల్కి’ కోసం పనిచేసింది.

    రికార్డు స్థాయి బడ్జెట్‌

    భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ (KALKI 2898 AD Hidden Truth)తో రూపొందించిన చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ.600 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నటీనటులు వేతనాలు, సెట్స్‌కు అయిన ఖర్చు కంటే.. నాణ్యమైన విజువల్స్‌, అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ కోసమే ఎక్కువ మెుత్తం ఖర్చు చేశారట.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv