• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Rajamouli Oscar Academy: మరోమారు దేశం గర్వపడేలా చేసిన రాజమౌళి..!

  భారత సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుల్లో ఎస్‌.ఎస్‌ రాజమౌళి కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. ఓటమి ఎరుగని దర్శకుడిగా గుర్తింపు పొందిన రాజమౌళి.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో మరోమారు తన సత్తా ఏంటో నిరూపించారు. అప్పటి వరకూ భారత చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిచయమైన రాజమౌళి పేరు.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గ్లోబల్‌ స్థాయిలో మారుమోగింది. ప్రముఖ హాలీవుడ్‌ దర్శకులు సైతం రాజమౌళి డైరెక్షన్‌ స్కిల్స్‌ చూసి ఆశ్చర్యపోయారు. అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే, తాజాగా రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. భార్యతో సహా ఆస్కార్‌ అకాడమీలో చేరేందుకు ఆహ్వానం లభించింది. 

  రాజమౌళికి అరుదైన గౌరవం

  దర్శకధీరుడు రాజమౌళికి అస్కార్‌ అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. దర్శకుల కేటగిరిలో రాజమౌళి (SS Rajamouli), కాస్ట్యూమ్‌ డిజైనర్‌ జాబితాలో రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పంపింది. అందులో భారత్‌ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మి, రితేశ్‌ సిద్వానీ, రవి వర్మన్‌ తదితరులు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.

  గతేడాది చరణ్‌, తారక్‌లకు ఆహ్వానం!

  టాలీవుడ్‌ నుంచి గతేడాది కొందరు ప్రముఖులు ఆస్కార్‌ అకాడమీలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కీలక పాత్రలు పోషించిన ‘రామ్ చరణ్‌’ (Ramcharan), ఎన్టీఆర్‌ (Jr NTR) లతో పాటు కీరవాణి, చంద్రబోస్‌, సెంథిల్‌కుమార్‌ సైతం ఈ అకాడమీలో సభ్యత్వం సాధించారు. ఇక ఈ ఏడాది కొత్త వారికి ఆహ్వానం పంపినందుకు సంతోషంగా ఉందని అకాడమీ నిర్వాహకులు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులకు అకాడమీ స్వాగతం పలుకుతోంది’ అని పిలుపునిచ్చారు. 

  రాజమౌళి స్థాయిని పెంచిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

  జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ గతేడాది ‘గోల్డెన్ గ్లోబ్స్’తో పాటు ‘ఆస్కార్’ కూడా గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు పాట’ బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరి కింద ఆస్కార్‌ను కైవసం చేసుకుంది. ఆస్కార్‌ అవార్డ్‌ కార్యక్రమానికి వచ్చిన జేమ్స్ కామెరాన్‌ను అప్పట్లో రాజమౌళి కలిశారు. తాను కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చూశానని.. అదోక అద్భుతం అంటూ ఆ సందర్భంగా రాజమౌళితో కామెరూన్‌ వ్యాఖ్యానించారు. తన భార్యకు కూడా ‘ఆర్ఆర్ఆర్‌’ చూడాలని సూచించినట్లు చెప్పారు. ప్రపంచస్థాయి దర్శకుడు రాజమౌళిని, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ప్రశంసించడంతో ఆ వార్త యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. 

  రాజమౌళి బిజీ బిజీ..!

  ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తన తర్వాతి మూవీని మహేష్‌ బాబుతో చేయనున్నారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్‌. ఈ సినిమాకి సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ కథా నేపథ్యం సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. వారం రోజుల్లో కథ ఫైనల్‌ అవుతుందని సంగీత దర్శకుడు కీరవాణి ఇటీవల వెల్లడించారు. కాగా, ఈ సినిమాలో మహేష్‌ను నెవర్ బిఫోర్ అవతార్‌లో రాజమౌళి చూపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్రపంచస్థాయి టెక్నిషియన్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించనున్నారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv