• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kalki 2898 AD Trending Posts: సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోన్న ‘కల్కి’.. డైరెక్టర్ కాళ్లు మెుక్కుతున్న నెటిజన్లు!

    ప్రభాస్‌ కల్కి (Kalki 2898 AD) చిత్రంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇన్ని రోజుల నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కిందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానులు అంటున్నారు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్‌ రికార్డులు అన్ని చెరిగిపోవడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం #Kalki2898AD హ్యాష్‌ ట్యాగ్‌ నెట్టింట విపరీతంగా ట్రెండింగ్‌ అవుతోంది. సినిమా చూసిన ఆడియన్స్‌ సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తమ ఫీలింగ్స్‌ను ఆసక్తికరమైన వీడియోల రూపంలో తెలియజేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆ పోస్టులు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    ‘కల్కి 2898 ఏడీ’ చూసిన ఓ అభిమాని నెట్టింట ఆసక్తికర పోస్టు పెట్టాడు. సినిమా లవర్స్‌.. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాళ్లు మెుక్కి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఓ వీడియోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌ అవుతోంది. 

    కల్కి సూపర్‌ హిట్‌ టాక్‌ చూసి.. మూవీ యూనిట్‌ మెుత్తం ఫుల్‌ జోష్‌లో ఉన్నట్లు అర్థం వచ్చేలా ఒక నెటిజన్‌ ఓ ఆసక్తిర వీడియోను పంచుకున్నాడు. ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాత అశ్వనిదత్‌ చిందులు వేస్తునట్లుగా మాస్టర్‌ సినిమాలోని డ్యాన్స్‌ క్లిప్‌ను ఎడిటింగ్‌ చేసి పంచుకున్నాడు.

    ప్రభాస్‌కు ఈ స్థాయి సక్సెస్‌ను అందించినందుకు రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ అందరూ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌కు మెుక్కుతున్నట్లు ఉన్న ఓ వీడియో పెద్ద ఎత్తున ట్రెండింగ్‌ అవుతోంది. ఖలేజా సినిమాలో ఓ సీన్‌ను ఎడిట్‌ చేసి పోస్టు చేశారు. 

    ప్రభాస్‌ గత చిత్రం ‘సలార్‌’ కేవలం యూత్‌కు మాత్రమే నచ్చిందని.. కానీ, కల్కి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ముఖ్యంగా మూవీలోని మహాభారతం ఎపిసోడ్‌కు పునకాలు వచ్చినట్లు పేర్కొన్నారు. 

    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకిరా నందన్‌ కూడా కల్కి థియేటర్‌ వద్ద సందడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లోకి అకిరా వెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

    కల్కి.. రెగ్యులర్‌ చిత్రం లాంటింది కాదని.. కచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన మూవీ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

    కల్కి సెకండాఫ్‌ ఒక మాస్టర్‌ పీస్‌ అని, చివరి 45 నిమిషాలు గూస్‌ బంప్స్‌ తెప్పించాయని ఓ అభిమాని పోస్టు పెట్టాడు. ప్రభాస్‌, అమితాబ్‌ తమ నటనతో థియేటర్లను షేక్‌ చేశారని చెప్పుకొచ్చాడు. 

    కల్కి సినిమా సక్సెస్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది. దీనికి అర్థం పట్టేలా ఓ అభిమాని షేర్‌ చేసిన వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv