• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kalki 2898 AD Review: ఇండియన్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ‘కల్కి’.. సినిమా ఎలా ఉందంటే?

    నటీనటులు: ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, దుల్కర్ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, దిశా పటాని, రానా దగ్గుబాటి, అన్నా బెన్‌ తదితరులు

    రచన, దర్శకత్వం : నాగ్‌ అశ్విన్‌

    సంగీతం : సంతోష్‌ నారాయణన్‌

    ఎడిటింగ్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు

    నిర్మాతలు : అశ్విని దత్‌, ప్రియాంక దత్‌, స్వప్న దత్‌

    నిర్మాణ సంస్థ : వైజయంతీ మూవీస్‌ మేకర్స్

    విడుదల తేదీ : 27 జూన్‌, 2024

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్‌ ఉంది. ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నుంచే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ హాలీవుడ్ రేంజ్‌లో ఉండటంతో ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పీక్స్‌కు వెళ్లాయి. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌ రూపొందిన ఈ చిత్రం.. జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు అంచనాలను అందుకుందా? ప్రభాస్‌ ఖాతాలో మరో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    ‘కల్కి 2898 ఏడీ’ కథ.. మహాభారతంలో ధర్మరాజు ఆడిన అబద్దం నుంచి మెుదలవుతుంది. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్‌).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. మరోవైపు కాశీలో నివసించే భైరవ (ప్రభాస్‌) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం అతడికి 1 మిలియన్‌ యూనిట్లు అవసరం అవుతాయి. అయితే సుమతిని పట్టుకుంటే ఆ మెుత్తం లభిస్తుందని భైరవ తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్‌ యష్కిన్‌ (కమల్‌ హాసన్‌) పాత్ర ఏంటి? అతనికి సుమతి ఎందుకు కావాలి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? కాశీ, శంబాలా ప్రజలు ఎందుకు కష్టాల్లో మునిగిపోయారు? విజయ్‌ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌ పాత్రలు ఏంటి? అన్నది తెలియాలంటే కల్కి సినిమా చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన విశ్వరూపం చూపించాడు. భైరవ పాత్రలో అదరగొట్టాడు. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో మరోమారు తన మార్క్‌ ఏంటో చూపించాడు. తొలి అర్ధభాగంలో అతడి పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌ చేశాడు. బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అశ్వత్థామ పాత్రలో ఆయన నెవర్‌ బీఫోర్‌ నటనతో మెప్పించారు. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేనంత బాగా నటించారు అమితాబ్‌. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది. విలన్‌గా కమల్‌ హాసన్‌ నెక్స్ట్‌ లెవెల్‌ పర్‌ఫార్మెన్స్‌తో అదరహో అనిపించారు. దీపికా, దిశా పటాని పాత్రలు ఆకట్టుకున్నాయి. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, రాజమౌళి, రానా, ఆర్జీవీ క్యామియో మెప్పిస్తాయి. మిగిలిన పాత్రదారులు అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 

    డైరెక్షన్‌ ఎలా ఉందంటే

    దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పేరు.. కల్కితో గ్లోబల్ స్థాయిలో మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి అతిపెద్ద బలం నాగ్‌ అశ్విన్‌ రాసుకున్న కథ. నాగ్ అశ్విన్‌ టేకింగ్‌, విజన్‌, ప్రెజంటేషన్‌కు నూటికి నూరు శాతం మార్కులు ఇవ్వాల్సిందే. తొలి 40 నిమిషాలు కథ స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా ఎక్కడా బోర్‌ కొట్టకుండా నాగ్‌ అశ్విన్‌ జాగ్రత్త పడ్డారు. ఇక ఆ తర్వాత నుంచి కథలో వేగం పెరుగుతుంది. క్లైమాక్స్‌ వరకూ ఒకే ఇంటెన్సిటీతో సినిమాను నడిపించారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్‌ సీన్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. ఫ్యూచరిక్‌ వెహికల్స్‌, ఆయుధాలు, సెట్స్‌ విజువల్‌ వండర్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా చివరి 45 నిమిషాలు నెక్స్ట్‌ లెవల్లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశారు దర్శకుడు. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్‌ కాస్త తడబడినట్లు కనిపిస్తోంది. కొన్ని సన్నివేశాలు మరీ సాగదీతలా అనిపిస్తాయి. మాస్‌ ఆడియన్స్‌కు అలరించే అంశాలు లేకపోవడం మైనస్‌. దీపికా డబ్బింగ్‌ విషయంలోనూ నాగ్‌ అశ్విన్‌ కాస్త జాగ్రపడి ఉంటే బాగుండేది. అయితే మెుత్తంగా నాగ్‌ అశ్విన్‌.. డైరెక్టర్‌గా సూపర్‌ సక్సెస్‌ అయినట్లు చెప్పవచ్చు.

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు అత్యుత్తమ పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఎక్కువ మార్కులు ఇవ్వాల్సిందే. సినిమాటోగ్రాఫర్‌ అద్భుత పనితీరు కనబరిచారు. సంతోష్‌ నారాయణన్‌ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా నేపథ్యం సంగీతం యాక్షన్‌ సన్నివేశాలను చాలా బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో వారు ఎక్కడా రాజీపడలేదు. ప్రతీ సీన్‌ చాలా రిచ్‌గా ఉంది. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథ, దర్శకత్వం
    • ప్రభాస్‌ 
    • ప్రధాన తారాగణం నటన
    • హాలీవుడ్‌ రేంజ్‌ విజువల్స్‌
    • కురుక్షేత్రం ఎపిసోడ్‌

    మైనస్‌ పాయింట్స్‌

    • తొలి 40 నిమిషాల ఎపిసోడ్‌
    • దీపికా డబ్బింగ్‌
    • ఎడిటింగ్‌

    Telugu.yousay.tv Rating : 4/5  

    Public Talk On Kalki 2898 AD

    ప్రభాస్‌ కల్కి (Kalki 2898 AD) చిత్రంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇన్ని రోజుల నిరీక్షణకు తగ్గ ఫలితం దక్కిందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానులు అంటున్నారు. కల్కి దెబ్బకు బాక్సాఫీస్‌ రికార్డులు అన్ని చెరిగిపోవడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు. 

    కల్కి సినిమాను పెద్ద సక్సెస్‌ చేసినందుకు కృష్ణంరాజు రెండో భార్య శ్యామలా దేవి ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో ప్రభాస్‌ను చూస్తే 1000 రెబల్‌ స్టార్లు కలిసినట్లు ఉందని పేర్కొన్నారు.

    కల్కి సినిమాలో విజయ్‌ దేవరకొండ.. ఓ ముఖ్యపాత్రలో కనిపించడంపై రౌడీ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. విజయ్‌ పాత్రకు సంబంధించిన క్లిప్‌ను నెట్టింట ట్రెండ్‌ చేస్తున్నారు. కల్కి లాంటి బ్లాక్ బాస్టర్‌ తమ హీరో భాగస్వామి అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    అటు దుల్కర్‌ సల్మాన్ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఈ సినిమాలో దుల్కర్‌ క్యామియో అద్భుతంగా ఉందంటూ అతడి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్‌ చేస్తున్నారు. 

    కల్కిలో రాజమౌళి పాత్ర కూడా తమను ఎంతో సర్‌ప్రైజ్‌ చేసిందని పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అతడి ఎంట్రీకి తాము ఫిదా అయినట్లు చెబుతున్నారు. 

    ‘కల్కి 2898 ఏడీ’ చూసిన ఓ అభిమాని నెట్టింట ఆసక్తికర పోస్టు పెట్టాడు. సినిమా లవర్స్‌.. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాళ్లు మెుక్కి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఓ వీడియోను షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్‌ అవుతోంది. 

    కల్కి సూపర్‌ హిట్‌ టాక్‌ చూసి.. మూవీ యూనిట్‌ మెుత్తం ఫుల్‌ జోష్‌లో ఉన్నట్లు అర్థం వచ్చేలా ఒక నెటిజన్‌ ఓ ఆసక్తిర వీడియోను పంచుకున్నాడు. ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, నిర్మాత అశ్వనిదత్‌ చిందులు వేస్తునట్లుగా మాస్టర్‌ సినిమాలోని డ్యాన్స్‌ క్లిప్‌ను ఎడిటింగ్‌ చేసి పంచుకున్నాడు.

    ప్రభాస్‌కు ఈ స్థాయి సక్సెస్‌ను అందించినందుకు రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ అందరూ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌కు మెుక్కుతున్నట్లు ఉన్న ఓ వీడియో పెద్ద ఎత్తున ట్రెండింగ్‌ అవుతోంది. ఖలేజా సినిమాలో ఓ సీన్‌ను ఎడిట్‌ చేసి పోస్టు చేశారు. 

    ప్రభాస్‌ గత చిత్రం ‘సలార్‌’ కేవలం యూత్‌కు మాత్రమే నచ్చిందని.. కానీ, కల్కి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ముఖ్యంగా మూవీలోని మహాభారతం ఎపిసోడ్‌కు పునకాలు వచ్చినట్లు పేర్కొన్నారు. 

    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకిరా నందన్‌ కూడా కల్కి థియేటర్‌ వద్ద సందడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లోకి అకిరా వెళ్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

    కల్కి.. రెగ్యులర్‌ చిత్రం లాంటింది కాదని.. కచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన మూవీ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

    కల్కి సెకండాఫ్‌ ఒక మాస్టర్‌ పీస్‌ అని, చివరి 45 నిమిషాలు గూస్‌ బంప్స్‌ తెప్పించాయని ఓ అభిమాని పోస్టు పెట్టాడు. ప్రభాస్‌, అమితాబ్‌ తమ నటనతో థియేటర్లను షేక్‌ చేశారని చెప్పుకొచ్చాడు. 

    కల్కి సినిమా సక్సెస్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది. దీనికి అర్థం పట్టేలా ఓ అభిమాని షేర్‌ చేసిన వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv