• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!

    వేటూరి సుందరరామమూర్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. గేయ రచయితగా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన కెరీర్‌లో 5 వేలకు పైగా పాటలకు సాహిత్య దానం చేశారు వేటూరి. వేటూరి పాటను కీర్తిస్తూ ఎన్నో పాటలు పుట్టుకు రావడం సుందర రామమూర్తి సాహిత్యానికి నిదర్శనం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా తన పాటలతో అందరినీ మరిపించగలరు. మంచి మెలోడీ పాటలనూ రాయగలరు. మరి, వేటూరి కలం నుంచి జాలువారిన కొన్ని మెలోడీ గీతాలేంటో తెలుసుకుందామా. 

    పూసింది పూసింది పున్నాగ

    సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని ‘పూసింది పూసింది పున్నాగ’ గేయం ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంది. పదాలను ప్రాసలో వాడటంలో వేటూరి ప్రావీణ్యమేంటో ఈ పాటలో తెలిసిపోతుంది. ఈ పాటలోని లిరిక్స్ ఆహ్లాదంగా ఉంటాయి. వేటూరి మాటకు కీరవాణి బాణీ కడితే ఈ పాటలా ఉంటుంది. మీరూ వినేయండి మరి.

    యమహా నగరి కలకత్తా పురి

    చూడాలని వుంది సినిమాలోని పాట ఇది. కలకత్తా నగర విశిష్ఠతను తెలియజేస్తూ సాగిపోతుంటుందీ గీతం. బెంగాళీ చరిత్రను ఒక పాటలో అవపోసన పడితే వచ్చేదే ఈ గేయం. ‘కలలకు నెలవట.. కళలకు కొలువుట.. విధులకు సెలవట.. అతిథుల గొడవట.. కలకట నగరపు కిటకిటలో’ అంటూ ప్రాసలో చేర్చేశారు. వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్(నేతాజీ)లకు జన్మనిచ్చిన చోటు అంటూ గేయంలో చరిత్రను ఇనుమడించారు.

    యమునాతీరం

    ఆనంద్ సినిమాలోని ‘యమునాతీరం’ పాట చాలా మందికి ఎంతో ఇష్టం. ఉదయం లేవగానే ఈ పాటను ఎంతో మంది వింటుంటారు. ఉల్లాసంగా ఉంటూ.. కొత్త ఉత్సాహాన్ని నింపుతుందీ పాట. ‘శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ.. చిగురించే రుతువల్లే విరబూసే ప్రేమ’ అంటూ సాగే గీతం నూతనోత్తేజాన్ని నింపుతుంది. హరిహరన్, చిత్ర వేటూరి సాహిత్యానికి ప్రాణం పోశారు.

    ఉప్పొంగెలే గోదావరి

    గోదావరి సినిమాలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ఎంతో అద్భుతం. గోదావరి గొప్పదనాన్ని వేటూరి పాటకన్నా గొప్పగా ఏదీ వర్ణించదేమో అన్నట్లుగా ఉంటుందీ గీతం. ‘వెతలు తీర్చే మా దేవేరి.. వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారి..రామ చరితకే పూదారి’ అంటూ గోదారి విశిష్ఠతను వర్ణించారు. బాల సుబ్రహ్మణ్యం పాటను మరోస్థాయికి తీసుకెళ్లారు. 

    తొలిసారి మిమ్మల్ని

    శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోని పాట ఇది. ఓ అబ్బాయిని చూసి మనసు పారేసుకున్న యువతి పాట పాడితే ఎలా ఉంటుందో ఈ గేయం చెబుతుంది. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు’ అంటూ నివేదిస్తుంది. 

    చుక్కల్లారా చూపుల్లారా

    ఆపద్భాందవుడు సినిమాలోని మధురమైన పాట ఇది. ‘చుక్కల్లారా చూపుల్లారా.. ఎక్కడమ్మా జాబిలీ.. మబ్బుల్లారా, మంచుల్లారా తప్పుకోండీ దారికీ’ అంటూ గేయం మొదలవుతుంది. ఇందులోని లిరిక్స్ శ్రోతలను కట్టిపడేస్తాయి. మీరూ ఈ మధుర గీతాన్ని ఆస్వాదించండి. 

    పచ్చందనమే

    సఖి సినిమాలోని తెలుగు వెర్షన్ పాటలను రాసింది వేటూరీనే. ఇందులో పచ్చందనమే పాట మ్యూజిక్ లవర్స్‌కి ఫేవరేట్ సాంగ్. ‘ఎర్రని రూపం ఉడికే కోపం.. మసకే పడితే మరకత వర్ణం.. అందం చందం అలిగిన వర్ణం’ అని సాగే లిరిక్స్ మెస్మరైజ్ చేసేస్తాయి. 

    జిలిబిలి పలుకుల

    సితార సినిమాలోని ‘జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘కలలను తెంచకు.. కలతను దాచకు’, ‘అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా..

    చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా’ వంటి వాక్యాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయీ పాటలో.

    మౌనమేళనోయి

    సాగర సంగమం సినిమాలోని పాటలన్నీ ప్రత్యేకం. అందులోనూ ‘మౌనమేళనోయి’ మెలోడీ మరెంతో స్పెషల్. ‘ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల.. తారాడే హాయిల’ అంటూ శ్రోతలను హాయిని చేకూర్చారు వేటూరి. అందుకే ఇప్పటికీ ఈ పాట వెంటాడుతూనే ఉంటుంది. 

    రెక్కలొచ్చిన ప్రేమ

    బస్ స్టాప్ సినిమాలోని ‘రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా’ పాట మ్యూజిక్ లవర్స్‌కి ఎంతో ఇష్టం. ‘ఆకాశం ఇల్లవుతుందా రెక్కలొచ్చాక.. అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక’ అంటూ ప్రశ్నిస్తూనే తత్వాన్ని చెప్పారు వేటూరి. ఈ పాటను ఓసారి వినేయండి మరి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv