• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week Movies: ఈ వారం మీ ఆనందాన్ని రెట్టింపు చేసే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!

    ఈ సమ్మర్‌లో ఇప్పటివరకూ చిన్న చిత్రాలే థియేటర్లలో సందడి చేశాయి. అయితే జూన్‌ తొలి వారంలోనూ చిన్న సినిమాలే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఇందులో స్టార్ హీరోయిన్లకు సంబంధించిన లేడీ ఒరియెంటేడ్‌ మూవీస్‌ ఉన్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లలో వస్తున్న చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్‌లు రాబోతున్నాయో ఓ లుక్కేయండి.

    థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు

    మనమే

    స్టార్‌ హీరో శర్వానంద్‌, హీరోయిన్‌ కృతిశెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Manamey). శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ప్రతీ ఒక్కరు కనెక్ట్ అయ్యే చిత్రం ఇదని మూవీ టీమ్‌ తెలిపింది. ఫ్యామిలీగా వెళ్లి ఈ సినిమాను అస్వాదించవచ్చని పేర్కొంది. 

    సత్యభామ

    ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama Movie). సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్‌.. పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఈ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. సత్యభామ ఓ విఫ్లవం అంటూ ఇటీవల కాజల్‌ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలు పెంచింది. 

    రక్షణ

    స్టార్‌ నటి పాయల్‌ రాజ్‌పుత్‌ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’ (Rakshana). ప్రణదీప్‌ ఠాకూర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రోషన్, మానస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. ఓ పోలీసు ఆఫీసర్‌ జీవితంలో జరిగిన సంఘటన స్ఫూర్తిగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. 

    లవ్‌ మౌళి

    నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’ (Love Mouli). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్‌ సంస్థ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎందుకు విడిపోతుంటారు? రాజీ పడితేనే బంధాలు నిలుస్తాయా? అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని నిర్మించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. 

    వెపన్‌

    సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన ‘వెపన్‌’ చిత్రానికి గుహన్‌ సెన్నియ్యప్పన్‌ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్‌, రాజీవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీసీ, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. జూన్‌ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు

    మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    https://telugu.yousay.tv/tfidb/ott

    TitleCategoryLanguagePlatformRelease Date
    Shooting StarsMovieEnglishNetflixJune 03
    Hitler and NazeesSeriesEnglishNetflixJune 05
    How To Rob A BankMovieEnglishNetflixJune 05
    Bade Mia Chote MiaMovieHindiNetflixJune 06
    Sweet ToothSeriesEnglishNetflixJune 06
    Hit ManMovieEnglishNetflixJune 07
    Perfect Match 2SeriesEnglishNetflixJune 07
    MaidanMovieHindiAmazon PrimeJune 05
    GunahSeriesHindiDisney + HotstarJune 05
    ClippedSeriesEnglishDisney + HotstarJune 04
    Star Wars: The EcolightSeriesEnglishDisney + HotstarJune 04
    The Legend Hanuman SeriesHindiDisney + HotstarJune 05
    GullakSeriesHindiSonyLIVJune 07
    Varshangalkku SheshamMovieMalayalamSonyLIVJune 07
    Boomer UncleMovieTamilAhaJune 07
    AbigailMovieEnglishBook My ShowJune 07
    Black OutMovieHindiJio CinemaJune 07
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv