RRR చిత్రానికి ఆస్కార్ రావటంతో రాజమౌళి తెరకెక్కించబోయే తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే మహేశ్ బాబు హీరోగా ప్రాజెక్ట్ అనౌన్స్ కావటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. RRRను మించి చిత్రం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి క్రేజ్ పెరగటంతో ఇప్పుడు పాన్ వరల్డ్‌ను మెప్పించే సినిమాను తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
SSMB29 ట్రెండింగ్
RRR ఆస్కార్ అవార్డు అందుకోవటంతో ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు సినిమా గురించి ట్రెండ్ చేస్తుంటే… మహేశ్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయారు. #SSMB 29 కూడా ట్రెండ్ చేశారు. రాజమౌళి, మహేశ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంచనాలు ఎలా ఉన్నాయంటూ పోస్టులు పెట్టి హోరెత్తించారు.
పూనకాలు లోడింగ్
వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా లాంఛ్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రకటన కాకముందే ఇలా ఉంటే అనౌన్స్‌మెంట్ చేస్తే సగం చచ్చిపోతారేమో అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. జక్కన్న, సూపర్ స్టార్ ఫొటోలను పెట్టి అగ్నిపర్వతం బద్ధలు కాబోతుందనే రేంజ్‌లో హైప్ పెంచుతున్నారు.
హాలీవుడ్ హీరోయిన్
మహేశ్ సరసన హీరోయిన్ గురించి చర్చ మెుదలయ్యింది. ఆస్కార్ వేడుకలో దీపికా పదుకొణె రాజమౌళిని కలిసిందని.. మహేశ్‌తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పిందని టాక్. ఇక ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. “ జక్కన్న హాలీవుడ్ హీరోయిన్లను చూశావు కదా.. అందులో ఎవర్నైనా టాలీవుడ్‌లోకి దింపేయ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మనదే ఆస్కార్
మహేశ్‌తో పాన్ వరల్డ్ చిత్రం తీయబోతున్న జక్కన్న బాక్సాఫీస్ షేక్ చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచేలా చేస్తాడంటూ అభిమానులు ట్విటర్‌లో సందడి చేస్తున్నారు. ఉత్తమ నటుడు, చిత్రం అవార్డులు మళ్లీ మనదే అనే కామెంట్లు చేస్తున్నారు.
శరవేగంగా పనులు
రాజమౌళి-మహేశ్ బాబు సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. కథను సిద్ధం చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. జేమ్స్ బాండ్ తరహాలో స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మిగతా పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అన్ని సవ్యంగా కుదిరితే ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.
ప్రస్తుతం బిజీ
రాజమౌళి సినిమా ప్రారంభం కావటానికి దాదాపు సంవత్సరం సమయం ఉంది. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్‌ను నిరాశ పరచకూడదని భావించిన సూపర్ స్టార్ మహేష్… త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుస షెడ్యూల్స్ జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు మహేశ్. ఆ తర్వాత దర్శక ధీరుడితో సినిమా పట్టాలెక్కనుంది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్