• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kajal Aggarwal: కాజల్‌ Vs పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!

    గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే థియేటర్లలో విడుదలై సందడి చేస్తూ వచ్చాయి. ఇందులో కొన్ని హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే మరికొన్ని ఫ్లాప్‌గా నిలిచి.. నెల అయినా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఈ వారం కూడా స్టార్‌ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాకపోవడం ఆడియన్స్‌ కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయితే ఈ వారం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న రెండు చిత్రాలు మాత్రం అందరిలో ఆసక్తి పెంచుతున్నాయి. ప్రముఖ హీరోయిన్స్‌ కాజల్‌ అగర్వాల్‌ నటించిన ‘సత్యభామ’, పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ‘రక్షణ’ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది. 

    తొలిసారి ఖాకీ డ్రెసుల్లో..

    కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో సుమన్‌ చిక్కాల తెరకెక్కించిన చిత్రం ‘సత్యభామ’ (Satyabhama). బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీసు అధికారిణిగా కనిపించనుంది. ఆమె పోలీసు ఆఫీసర్‌గా చేయడం కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లలోకి రానుంది. అటు పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) చేసిన లేడీ ఓరియెంటేడ్‌ చిత్రం ‘రక్షణ’ (Rakshana) కూడా జూన్‌ 7వ తేదీనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇందులోనూ పాయల్‌ కూడా తొలిసారి ఖాకీ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్‌ కానుండటంతో కాజల్‌, పాయల్‌ మధ్య కోల్డ్‌ వార్‌ మెుదలైనట్లు కనిపిస్తోంది. 

    యాక్షన్‌తో రాణించేనా!

    కాజల్‌ అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ గత చిత్రాలను పరిశీలిస్తే.. వీరు గ్లామర్‌తోనే ఆడియన్స్‌ను ఎక్కువగా అలరించారు. అటువంటిది తొలిసారి వీరిద్దరు ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా ఎంతో పవర్‌ఫుల్‌ అయినా పోలీసు అధికారిణి పాత్రల్లో థియేటర్లలోకి వస్తున్నారు. మరి వీరు యాక్షన్ సీక్వెన్స్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదలైన ‘సత్యభామ’, ‘రక్షణ’ ట్రైలర్స్‌ రెండూ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కాజల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ఇద్దరూ తమ యాక్షన్‌తో దుమ్మురేపినట్లే కనిపిస్తోంది. కాజల్‌, పాయల్‌ మధ్య ప్రస్తుతం నెలకొన్న థగ్‌ ఆఫ్‌ వార్‌లో విజయం ఎవరిదో ఈ శుక్రవారం (జూన్‌ 7) తేలిపోనుంది. 

    ఇతర చిత్రాలు

    ఈ శుక్రవారం సత్యభామ, రక్షణ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘లవ్‌ మౌళి’ (Love Mouli) చిత్రం.. అనేక వాయిదాల తర్వాత ఈ వారమే థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. అలాగే శర్వానంద్‌, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మనమే’ (Maname) కూడా ఈ నెల 7న రిలీజ్‌ కానుంది. ఈ మూవీకి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించాడు. మరోవైపు సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రలో నటించిన ‘వెపన్‌’ (Weapon) చితరం కూడా ఈ శుక్రవారం మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. వార్నర్‌ బ్రదర్స్‌, మార్వెల్‌ తరహాలో సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్‌ తెలిపారు. 

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

    ఈ వారం ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌ కాబోతున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఈ కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv