• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nora Fatehi: కిర్రాక్ పోజులతో హీటెక్కిస్తున్న నోరా ఫతేహి.. త్వరలో వరుణ్ తేజ్‌తో రొమాన్స్!

    బాలీవుడ్ అందాల తెగింపు నోరా ఫతేహి మరోసారి తన హాట్ అందాలను సోషల్ మీడియాలో రచ్చకు పెట్టింది. చమ్కీలు పొదిగిన ట్రాన్సఫరెంట్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించింది.  చెవులకు లోతైన లోలాకులు వంటినిండా చమ్కీల మెరుపుతో నోరా అందం మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

     ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ రియల్లీ హాట్, ఏంజెల్‌లా ఉన్నావంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నోరా ఫతేహి తెలుగులో అడపా దడపా కనిపించినా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో ఇప్పటి వరకు నటించలేదు. బాహుబలి 1లో ‘మనోహరి’ అంటూ  ఐటెం సాంగ్ పాడిన ముగ్గురు వయ్యారి భామల్లో ఈ ముద్దుగుమ్మ కూడా ఉంది.

    ప్రస్తుతం వరుణ్‌ తేజ్ సరసన మట్కా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో కనువిందు చేయనుంది. మట్కాలో నోరా ఫతేహితో పాటు మరో హీరోయిన్‌ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. ఈ సినిమా కరుణ కుమార్ డైరెక్షన్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

    అటు పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాలోనూ ఈ సొగసుల కోవ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఇక నోరా పర్సనల్ విషయాలకొస్తే.. నోరా పుట్టి పెరిగింది కెనడాలో. చదువు కూడా బాగానే చదివింది. టోరంటోలోని యార్క్ యూనివర్సిసిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా సంపాదించింది.

    ఇక సుందరాంగికి డ్యాన్స్ అంటే మక్కువ. అందులోనూ బెల్లీ డ్యాన్స్‌ను ఇరగదీస్తుంది. 

    యాక్టింగ్‌పై ఉన్న ఇష్టంతో తొలుత మోడలింగ్ చేసిన నోరా.. ఆతర్వాత యాక్టింగ్‌ వైపు తన దృష్టి మరల్చింది. కెనడా నుంచి ఇండియాకు వచ్చాక ఇక్కడ కొన్ని చిన్న చిన్న యాడ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. 

    అలా బాలీవుడ్ నిర్మాతల దృష్టిలో పడిన  నోరా..2014లో బాలీవుడ్‌లో ‘రోర్’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఊపిరి సినిమాలో నాట్య మయూరిగా కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ బాంబ్.. టెంపర్ చిత్రంలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ పాటలో  రెచ్చిపోయింది.

    టెంపర్‌లో ఐటెం సాంగ్.. నోరాకు తెలుగులో మంచి అవకాశాలను తెచ్చిపెట్టింది. బాహుబలి, కిక్ 2, ఊపిరి, లోఫర్,  షేర్ చిత్రాల్లో తన అందచందాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంది.

    ప్రస్తుతం సెక్సీ డాల్ 100%, మడగావ్ ఎక్స్‌ప్రెస్, డ్యాన్సింగ్ డాడ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

    నోరా తన అందం, నటనతోనే కాకుండా పలు రియాల్టీ షోలు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహహించింది. డ్యాన్స్ ప్లస్, డ్యాన్స్ దివానే 3,  ఇండియా బెస్ట్ డ్యాన్సర్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరించింది.అంతేకాదు పలు పాప్ సాంగ్స్ ఆల్బమ్స్‌లోని తన అందాల దాడితో రచ్చ చేసింది. ‘బేబి మర్‌వాకే మనేగి’, ‘అచ్చా సిలా దియా’, డ్యాన్స్ మేరీ రాణి వంటి వీడియో ఆల్బమ్స్ బాగా ఆకట్టుకున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv