ఒకప్పుడు సినిమా సక్సెస్‌ను కలెక్షన్స్ బట్టి కాకుండా ఎన్ని రోజులు ఆడింది అన్నదానిని కొలమానంగా తీసుకునేవారు. ఈ నేపథ్యంలోనే గతంలో హిట్టైన చాలా వరకూ చిత్రాలు 50 రోజులు, 100 రోజులు ఆడేవి. కొన్ని చిత్రాలైతే ఏకంగా 200 డేస్ ఫంక్షన్స్ కూడా జరుపుకున్నాయి. రామారావు, నాగేశ్వరరావు కాలంలో అయితే ఏడాది పొడవునా సినిమాలు ప్రదర్శితమైన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుత ఓటీటీ యుగంలో ఆ పరిస్థితి లేదు. బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సైతం నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దీంతో 50 రోజులు, 100 రోజులు అన్నమాటే ఇండస్ట్రీలో వినిపించడం లేదు. అయితే తారక్ లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) ఈ సైలెన్స్‌ను బద్దలు కొట్టింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
‘దేవర’.. హాఫ్ సెంచరీ
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara Record). సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇదిలా ఉంటే దేవర చిత్రం తాజాగా ఓ ఫీట్ సాధించింది. 52 కేంద్రాల్లో ఈ సినిమా 50 రోజులు (Devara 50 Days in 52 Centers) ప్రదర్శితమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. సీడెడ్, ఉత్తరాంధ్ర, కృష్టా, నైజాం, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు ఏరియాల్లోని ఏ ఏ థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుందో వివరించారు. ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్లలో ‘దేవర’ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఇది చూసిన తారక్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
ఓటీటీలోనూ ట్రెండింగ్
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ‘దేవర’ (Devara Record) చిత్రాన్ని ఇటీవలే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చింది. నవంబర్ 8 నుంచి తెలుగు, తమిళం, మలయాళం సహా పలు దక్షిణాది భాషల్లో ప్రసారం అవుతోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ‘దేవర’ జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఓటీటీలోనూ దేవరకు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా నెట్‌ఫ్లిక్స్‌లో రికార్టు స్థాయి స్ట్రీమింగ్ మినిట్స్‌ను తారక్ చిత్రం నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చి వారం అవుతున్నా ఇప్పటికీ టాప్-10లో దేవరోడు ట్రెండింగ్ అవుతున్నాడు. సినిమాను ఆల్రెడీ చూసిన వారే మళ్లీ మళ్లీ చూస్తున్నట్లు ఓటీటీ వర్గాలు తెలిపాయి.
త్వరలో సెట్స్‌పైకి ‘NTR 31’
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)తో తారక్ (Jr NTR) ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. NTR 31 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని అంటున్నారు. (Devara 50 Days in 52 Centers)ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైన వెంటనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం తారక్ ‘వార్ 2’ చిత్రంలో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ బాలీవుడ్ చిత్రంలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్.
రజనీ డైరెక్టర్‌తో తారక్ మూవీ?
తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar)తో తారక్ ఓ సినిమా చేయబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే స్టోరీకి సంబంధించిన డిస్కషన్ కూడా జరిగిందని అంటున్నారు. కథ పట్ల తారక్ సానుకూలంగా స్పందించాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఉంటుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ‘జైలర్’ను తెరకెక్కించి నెల్సన్ దిలీప్ కుమార్ సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇందులో రజనీని ఎంతో పవర్‌ఫుల్‌గా చూపించి ప్రశంసలు దక్కించుకున్నారు. ప్రస్తుతం ‘జైలర్ 2’ సినిమాతో నెల్సన్ బిజీగా ఉన్నారు. దాని తర్వాత తారక్ – నెల్సన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!