అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘పుష్ప 2’ సంబంధించి రోజుకో అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే నవంబర్ 17న ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌కు సంబంధించి మరో అప్డేట్ను నిర్మాణ సంస్థ రివీల్ చేసింది. మాస్ సెలబ్రేషన్స్‌కు సిద్ధంగా ఉండాలంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున అంచనాలు పెంచేసింది.
ట్రైలర్ రన్‌టైమ్ లాక్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా చేస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) విలన్ పాత్ర పోషిస్తున్నాడు. జగపతిబాబు, సునీన్, రావు రమేష్, అనసూయ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 17 సా. 6:03కి బిహార్ రాజధాని పాట్నలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రన్‌టైమ్‌ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ట్రైలర్ ఫైనల్ కట్ 2 నిమిషాల 55 సెకన్లు వచ్చినట్లు పేర్కొంది. ప్యూర్ మ్యాడ్ సెలబ్రేషన్స్‌తో ఈ ట్రైలర్‌ను వీక్షించండంటూ రాసుకొచ్చింది. పాట్నాలోని గాంధీ మైదానంలో 5 గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మెుదలవుతుందని స్ఫష్టం చేసింది.
పుష్ప జ్ఞాపకాల్లో రష్మిక
‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక మందన్న ఎంత క్యూట్‌గా చేసిందో అందరికీ తెలిసిందే. మరో రెండ్రోజుల్లో ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ కానున్న నేపథ్యంలో తొలి పార్ట్‌కు సంబంధించిన జ్ఞాపకాలను ఈ అమ్మడు గుర్తు చేసుకుంది. ‘పుష్ప 1’ సంబంధించి ఎలాంటి దృశ్యాలు ఇప్పటివరకూ పంచుకోలేదని అందుకే ఇప్పుడు పోస్టు చేస్తున్నా అంటూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో శ్రీవల్లి పాత్ర లుక్ టెస్ట్ ఫొటో, రష్యాలో అల్లు అర్జున్‌తో కలిసి దిగిన స్టిల్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో కలిసి దిగిన ఫొటోలతో పాటు ‘సామి’ మేకింగ్ వీడియో ఉన్నాయి. శ్రీవల్లి క్యారెక్టర్ కోసం తిరుపతి వెళ్లి రీసెర్చ్ కూడా చేసినట్లు రష్మిక తెలిపింది.
‘పుష్ప 2’ దెబ్బకు భయపడ్డ థమన్!
పుష్ప 2 టీమ్‌లో థమన్ భాగమైనట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై ‘బాకు మహారాజ్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో థమన్ స్పందించారు. ఈ సినిమాలో భాగమైన మాట నిజమేనని స్ఫష్టం చేశారు. అయితే ‘పుష్ప 2’ కోసం తాను మాత్రమే కాకుండా చాలా మంది మ్యూజిషియన్స్ వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. ‘పుష్ప 2 చాలా పెద్ద సినిమా. బిజినెస్ కూడా భయంకరంగా జరిగింది. 15 రోజుల్లో సినిమా మొత్తం ఎలా కంప్లీట్ చేయగలం. కొన్ని విషయాలను ఛాలెంజింగ్‌గా తీసుకోవచ్చు కానీ అదే సమయంలో భయపడాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. నేను ఈ సినిమాకు ఒక పార్ట్ మాత్రమే చేయగలిగాను. నేను చేసిన దానితో డైరెక్టర్, హీరో హ్యాపీగా ఉన్నారు’ అని చెప్పుకొచ్చారు.
శ్రీలీల పారితోషికం ఎంతంటే?
అల్లుఅర్జున్ – సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా సుకుమార్గా తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఐటెం సాంగ్ (Pushpa 2 Item Song)లో చేసిన హీరోయిన్ శ్రీలీలకు భారీ మెుత్తంలో పారితోషికం ముట్టచెప్పినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ‘కిస్సిక్కి’ అంటూ సాగే ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెట్, హీరోయిన్ పారితోషికం ఇతర మొత్తం కలిపి రూ.5 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!