• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పెళ్లిపీటలు ఎక్కనున్న వరుణ్ తేజ్; ఆమెతోనేనా?

  త్వరలో టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ పెళ్లి ప్రకటన వస్తుందని ఆయన తండ్రి, నటుడు నాగబాబు ప్రకటించారు. కానీ అమ్మాయి ఎవరనే విషయాన్ని వెల్లడించలేనని.. పెళ్లికూతురుకు సంబంధించిన విషయాలను తాను చెప్పదలుచుకోలేదని పేర్కొన్నారు. వివాహం అనంతరం వరుణ్ తన భార్యతో కలసి వేరే ఇంట్లో ఉంటాడని.. తాను తన భార్యతో కలసి మరో ఇంట్లో ఉంటానని నాగబాబు వివరించారు. కాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ పెళ్లి చేసుకోనున్నట్లు పుకార్లు వస్తున్నాయి.

  కటౌట్ కాదు.. కంటెంట్ ముఖ్యం; వరుణ్‌తేజ్

  ఏ సినిమా అయినా హిట్ కొట్టాలంటే కథ ముఖ్యమని టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ అన్నాడు. ‘కాంతారా’ విషయంలో అదే జరిగిందని ఆయన గుర్తుచేశారు. భావోద్వేగాలు చక్కగా పండితే ఏ సినిమా అయినా సక్సెస్ బాటలో నడుస్తుందని చెప్పారు. ఆ చిత్రంలో ఎవరు నటించారు.. బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అని ఎవరూ చూడరని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్, కాంతారా, పుష్ఫ చిత్రాల విషయంలో అదే జరిగిందని చెప్పుకొచ్చారు. కాగా వరుణ్ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నాడు.

  వరుణ్ తేజ్ సరసన విశ్వ సుందరి..?

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కింది. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్టర్‌గా వస్తున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది. అయితే, ఈ మూవీకి సంబంధించిన వార్తకొటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. వరుణ్ సరసన మాజీ విశ్వ సుందరి మానుషీ చిల్లర్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమెకు కథ వినిపించగా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. 2017లో ఈమె విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. కాగా, ఈ సినిమాలో వరుణ్ తేజ్ నేవీ అధికారిగా కనిపించనున్నారు. … Read more

  అక్టోబర్ 12 నుంచి VT12 షూటింగ్ ?

  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ప్రకటించిన VT12 మూవీ షూటింగ్ అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ పనుల్లో ప్రవీణ్ సత్తారు బిజీగా ఉన్నాడు. ఆ సినిమా విడుదలయ్యాక VT12 షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వరుణ్ బాడీ గార్డ్‌గా నటించనున్నట్లు తెలుస్తుండగా.. ఇటీవల ప్రకటించిన తన 13వ సినిమాలో ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించనున్నారు.

  చిరుకు శుభాకాంక్షలు చెప్పిన చరణ్, వరుణ్

  మెగాస్టార్ చిరంజీవికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తండ్రితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ప్రపంచంలోనే బెస్ట్ నాన్నకు హ్యాపీ బర్త్‌డే అంటూ ట్వీట్ చేశాడు. వరుణ్ సైతం చిరును ముద్దు పెట్టుకుంటున్న పిక్‌ను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. Courtesy Twitter:

  ‘ఫిదా’కు ఐదేళ్లు పూర్తి

  వ‌రుణ్ తేజ్, సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ ‘ఫిదా’. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నేటికి ఫిదా వ‌చ్చి ఐదేళ్లు పూర్త‌వుతుంది. ఫిదా సినిమా సాయిప‌ల్ల‌వి వంటి అద్భుత‌మైన న‌టిని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసింది. ఆమె న‌ట‌న‌కు అంద‌రు ఫిదా అయిపోయారు. వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ప‌ల్లెటూరు వాతావ‌ర‌ణం, అక్క‌డ వ్య‌క్తుల‌ ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా చూపించ‌డంతో సినిమా ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంది. సాయిప‌ల్ల‌వి డైలాగ్స్‌, తెలంగాణ యాస సినిమాను మ‌రో రేంజ్‌కి తీసుకెళ్లాయి. ఐదేళ్లు పూర్త‌యినా ఇప్ప‌టికీ సినిమా … Read more

  ఏజెంట్ అవ‌తార్‌లో వ‌రుణ్ తేజ్

  మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఇటీవ‌ల F3 మూవీతో న‌వ్వులు పూయించిన సంగ‌తి తెలిసిందే. ఆయన త‌ర్వాత మూవీ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో వ‌రుణ్ ఏజెంట్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. షూటింగ్ మొత్తం లండ‌న్‌లో జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. వ‌రుణ్ స్టైలిష్ ఏజెంట్‌గా క‌నిపించేంద‌కు త‌న లుక్ మార్చుకున్న‌ట్లు తెలుస్తుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా క‌థ ఇప్ప‌టికే సిద్ధంగా ఉంది. షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతుంద‌ని తెలుస్తుంది.

  స్టేజీపై స్టెప్పులేసిన వెంకీ..ఫ్యాన్స్‌కు పండ‌గే

  F3 చిత్ర‌బృందం ఇటీవ‌ల వైజాగ్‌లో స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్న చిత్ర‌బృందం స్టేజీపై డ్యాన్స్‌ల‌తో అల‌రించింది. ముఖ్యంగా వెంక‌టేశ్ కుర్రాడు బాబోయ్ పాట‌కు ఉత్సాహంగా డ్యాన్స్ వేయ‌డం ఫ్యాన్స్‌కు సంతోషాన్నిచ్చింది. సినిమాలోనే కాకుండా త‌మ అభిమాన హీరో ఇలా వేదిక‌పై డ్యాన్స్ చేయ‌డంతో పండ‌గ చేసుకున్నారు. F3 మూవీ థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికీ స‌క్సెస్‌పుల్‌గా ర‌న్ అవుతుంది.

  F3 మూవీ రివ్యూ

  F2కి మించి F3లో మూడు రెట్ల ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటుంద‌ని చిత్ర‌బృందం చెప్పిన‌ట్లుగానే కామెడీ చ‌క్క‌గా పండింది. వెంక‌టేశ్ రేచీక‌టి, వ‌రుణ్ తేజ్ న‌త్తి మేన‌రిజ‌మ్స్‌తో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించారు. స్టోరీ లైన్ చిన్నదే అయిన‌ప్ప‌టికీ కామెడీతో క‌థ‌ను న‌డిపించాడు ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి. త‌మ‌న్నా, మెహ్రిన్‌తో పాటు ఇత‌ర న‌టీన‌టులు వాళ్ల పాత్ర‌ల మేర‌కు చ‌క్క‌గా న‌టించారు. పూర్తి రివ్యూ కోసం visit website పై క్లిక్ చేయండి.

  F3 ‘ఫ‌న్‌’టాస్టిక్‌ మేకింగ్ వీడియో

  విక్ట‌రీ వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ న‌టించిన F3 మూవీ మే 27న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. సినిమా సెట్లో వెంకీ స‌ర‌దా సంద‌డి, వ‌రుణ్ తేజ్ ఫ‌న్నీ సీన్స్‌తో ఈ వీడియో అల‌రించింది. ఎఫ్‌2కి మించి ఈ మూవీలో కామెడీ ఉంటుంద‌ని వెంకీ ఇప్ప‌టికే హామీ ఇచ్చాడు. దీంతో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగిపోయాయి. త‌మ‌న్నా, మెహ్రిన్ హీరోయిన్లుగా క‌నిపించ‌నున్నారు.