టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్ నేపథ్యం లేకుండా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్ ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీతా గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మ్యూజిక్ ఆల్బమ్‌లో విజయ్ కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఫొటోగ్రాఫర్‌గా మారి బాలీవుడ్ నటితో రొమాన్స్ చేశాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘సాహిబా’ వచ్చేసింది..
మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ (Jasleen Royal) రూపొందించిన ‘హీరియో’ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యింది. దాని తర్వాత ఆమె కంపోజ్ చేసిన మరో కొత్త సాంగ్ ‘సాహిబా’ (Sahiba Music Album) తాజాగా మ్యూజిక్ లవర్స్ ముందుకు వచ్చింది. ఇందులో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మ్యూజిక్ లవర్స్ హృదయాలను హత్తుకునేలా ఈ ఆల్బమ్ ఉంది. ఈ సాంగ్‌లో విజయ్ ఫొటోగ్రాఫర్‌గా కనిపించగా బాలీవుడ్ నటి రాధిక మదన్ (Radhika Madan) రాజవంశానికి చెందిన రాకుమారిగా చేసింది. ఈ ఫీల్‌గుడ్ లవ్ సాంగ్‌లో విజయ్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సాంగ్ మధ్యలో ముస్లిం కాస్ట్యూమ్‌లో కనిపించి ఔరా అనిపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. సాహీబా ఆల్బమ్ సెన్సేషన్ కావడం పక్కా అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
హీరియోను తలదన్నేలా..
గత కొద్ది రోజుల క్రితం సింగర్ జస్లీన్ విడుదల చేసిన ‘హీరియే’ ఆల్బమ్ (Heeriye Music Album) అద్భుతంగా ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ మ్యూజిక్ లవర్స్‌ను అలరించేందుకు ‘సాహిబా’ను జస్లీన్ రాయల్ రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ దేవరకొండ, రాధిక మదన్ కెమిస్ట్రీ మరో లెవెల్లో ఉందని చెప్పవచ్చు. ఈ ఆల్బమ్ ‘హీరియే’ సాంగ్‌ను మించి హిట్ అవుతుందని విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ అంచనా వేస్తున్నారు.
బాలయ్య వాయిస్ ఓవర్!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘VD 12’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఇది రాబోతోంది. ఈ సినిమాలో విజయ్ రగ్డ్ లుక్‌లో సరికొత్త మాస్ అవతారంతో కనిపించబోతున్నాడు. ఇందులో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse), రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ మూవీ టీజర్‌కు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వాయిస్ ఓవర్ అందిస్తారని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు.
విజయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతం విజయ్ వరుస ఫ్లాప్‌తో ఇబ్బందిపడుతున్నాడు. ఆయన రీసెంట్ చిత్రాలు లైగర్, ఖుషీ, ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో విజయ్ ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో ‘VD 12’తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘ఖుషీ’ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో మరో ప్రాజెక్ట్‌ను విజయ్ అనౌన్స్ చేశాడు. దీనిని యంగ్ డైరెక్టర్ ‘రాజావారు రాణివారు’ ఫేమ్ రవికిరణ్ కోలా (Ravi Kiran Kola) తెరకెక్కించనున్నాడు. అలాగే రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామా కూడా రౌడీ బాయ్ చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!