The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది! 

    The Kerala Story Review In Telugu : ఆదా శర్మ నటన కన్నీళ్లు పెట్టించింది! మరో కాశ్మీర్ ఫైల్స్‌ను గుర్తు చేసింది! 

    May 5, 2023

    నటినటులు: ఆదా శర్మ, సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని, ప్రణయ్‌ పచౌరి, ప్రణవ్‌ మిశ్రా, విజయ్‌ కృష్ణ

    దర్శకత్వం: సుదీప్తోసేన్

    సంగీతం: వీరేష్‌ శ్రీవాల్స

    నిర్మాణ సంస్థ: సన్‌షైన్‌ పిక్చర్స్‌

    ‘ది కేరళ స్టోరీ‘ చిత్రం విడుదలకు ముందే తీవ్ర దుమారం రేపింది. తప్పిపోయిన కేరళ అమ్మాయిల ఇతివృత్తంతో దీన్ని తెరకెక్కించగా.. ఈ సినిమాను రిలీజ్‌ చేయోద్దంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఈ సినిమాను రూపొందించారని కేరళ సీఎం పినరయి విజయన్‌ సైతం మండిపడ్డారు. ఇలాంటి సినిమాను విడుదల చేయోద్ధంటూ కాంగ్రెస్‌, వామపక్షాలు, ముస్లిం సంఘాలు సైతం తీవ్రస్థాయిలో డిమాండ్‌ చేశాయి. వీటన్నింటినీ దాటుకొని ఎట్టకేళకు ఇవాళ ‘ది కేరళ స్టోరీ’ చిత్రం రిలీజ్‌ అయింది. మరీ సినిమా ఎలా ఉంది?. అందరూ అనుమానించినట్లు ఇందులో వివాదస్పద కంటెంట్‌ ఉందా? ది కేరళ స్టోరీ హిట్‌ కొట్టినట్లేనా? ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. 

    కథేంటి:

    షాలిని ఉన్ని క్రిష్ణన్‌ (ఆదాశర్మ) నర్స్‌ అవ్వాలన్న కోరికతో నర్సింగ్‌ కాలేజీలో చేరుతుంది. అక్కడి హాస్టల్‌ గదిలో గీతాంజలి (సిద్ది ఇద్నాని), నిమాహ్ (యోగితా బిహానీ), ఆసిఫా( సోనియా బలానీ) రూమ్‌మేట్స్‌గా ఉంటారు. ఆసిఫా తన రూమ్‌మేట్స్‌ అందర్ని ఇస్లాంలోకి మార్చాలని ఓ సీక్రెట్‌ ఎజెండాను కలిగి ఉంటుంది. కొందరు బయటి వ్యక్తుల సాయంతో వారు ఇస్లాం మతంలోకి మారేలా  చేస్తోంది. ఈ నేపథ్యంలో షాలిని తన పేరును ఫాతిమాకు మార్చుకుంటుంది. ఆ తర్వాతి నుంచి ఫాతిమా జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. గర్భవతి అయిన ఫాతిమా సిరియా ఎందుకు వెళ్లింది? అక్కడ  ISIS ఉగ్రవాదుల చేతుల్లో ఎలాంటి కష్టాలను అనుభవించింది? అనేది మిగిలిన కథ.

    ఎవరెలా చేశారంటే:

    ‘ది కేరళ స్టోరీ’ సినిమా అంతా ప్రధానంగా ఆదా శర్మ చుట్టే తిరుగుతుంది. ఆదాశర్మలోని గొప్ప నటిని ఈ సినిమా పరిచయం చేసిందనే చెప్పాలి. హిందూ మహిళగా, ముస్లిం యువతిగా రెండు వెర్షన్లలో ఆమె చాలా అద్భుతంగా నటించింది. సినిమా భారాన్నంతా మోస్తు తన నటనతో మెప్పించింది. ముఖ్యంగా ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న తర్వాత ఆదాశర్మ తనలోని అత్యుత్తమ నటిని బయటకు తీసుకొస్తుంది. అటు సిద్ధి ఇద్నాని, యోగిత బిహాని, సోనియా బలాని తమ నటనతో ఆకట్టుకున్నారు. తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. హాస్టల్‌ గదిలో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. 

    సాంకేతికంగా:

    దర్శకుడు సుదీప్తోసేన్ చాలా సున్నితమైన అంశాన్ని ఎంతో ధైర్యంగా తెరపైనా చూపించాడని చెప్పొచ్చు. సినిమాలో వచ్చే మత మార్పిడి సీన్లు చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. ఛాలెంజింగ్‌ సన్నివేశాలను కూడా ఏమాత్రం బెరుకు లేకుండా డైరెక్టర్‌ తెరకెక్కించాడు. ఈ క్రమంలో కొన్ని డైలాగులు, సీన్లు మరీ ఇబ్బంది కరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఐసిస్‌ బానిస శిబిరాల్లో మహిళలపై జరిగే దారుణాలు, ‌అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. ప్రధానంగా ఈ సినిమాను వినోదాత్మకంగా కాకుండా మత మార్పిడుల కోణంలో తీసినట్లు అనిపిస్తుంది. ఇకపోతే వీరేష్‌ శ్రీవాల్స అందించిన నేపథ్యం సంగీతం సినిమాకు బలం. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • ఆదాశర్మ నటన
    • డైరక్షన్‌ స్కిల్స్
    • నేపథ్య సంగీతం
    • సినిమాటోగ్రఫీ

    మైనస్‌ పాయింట్స్‌

    • హింసాత్మక సన్నివేశాలు
    • బోల్డ్‌ సీన్స్‌

    రేటింగ్‌: 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version