ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం శివరాత్రి పండగను పురస్కరించుకొని థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో ఈ ప్రత్యేక కథనంలో ద్వారా పరిశీలిద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
గామి
విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా రూపొందిన అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్ ‘గామి’ (Gaami). విద్యాధర్ కాగిత ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్. ‘మానవ స్పర్శ సమస్యను ఎదుర్కొంటున్న ఓ అఘోర హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం’ అని దర్శకుడు తెలిపారు. విశ్వక్ అఘోరాకు నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.
భీమా
గోపీచంద్ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష రూపొందించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘భీమా’ (Bhimaa). మాళవికా శర్మ (Malvika Sharma), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) కథానాయికలుగా చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్ పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
షైతాన్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘షైతాన్’ (హిందీ) (Shaitaan). వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవగణ్‌తో పాటు ఆర్. మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
ప్రేమలు
మలయాళంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ‘ప్రేమలు’.. ఈ వారం తెలుగులో రిలీజవుతోంది. గిరీశ్ ఎ.డి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్ (Naslen K Gafoor), మ్యాథ్యూ థామస్ (Mathew Thomas), మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్ కానుంది.
రికార్డ్ బ్రేక్
నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’ (Record Break). ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.
వి లవ్ బ్యాడ్ బాయ్స్
అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ (We Love Bad Boys). రాజు రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.
రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి
రవితేజ నున్న, నేహా జురెల్ జంటగా సత్య రాజ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’ (Raju Gari Ammayi Naidu Gari Abbayi). హాస్యంతోపాటు ఊహించని మలుపులతో ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతుందని రవితేజ పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 9న రిలీజ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్ సిరీస్‌లు
హనుమాన్
ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘హనుమాన్’. సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత అంటే ఈ శుక్రవారం (మార్చి 8) మహా శివరాత్రినాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee 5) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
లాల్ సలామ్
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అతిథిపాత్రలో కనిపించిన ఈ ‘లాల్ సలామ్’ (Lal Salaam) మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ నెలలోపే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెడుతోంది. మార్చి 8న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది.
యాత్ర 2
యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది. మాజీ సీఎం వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని ఎక్కిన తీరును ఈ మూవీలో చూపించారు. 2019లో వచ్చిన యాత్రకు ఇది సీక్వెల్. ఈ చిత్రం కూడా మార్చి 8న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.
వళరి
‘గురు’ ఫేమ్ రితికా సింగ్ (Ritika Singh) కీలక పాత్రలో నటించిన హారర్ మూవీ ‘వళరి’ (Valari). శ్రీరామ్ కీలక పాత్ర పోషించాడు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’ (ETV Win)లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title | Category | Language | Platform | Release Date |
Anweshippin Kandethum | Movie | Malayalam / Telugu | Netflix | March 08 |
The Gentleman | Movie | English | Netflix | March 07 |
Damsel | Movie | English | Netflix | March 08 |
The Backup Plan | Movie | English | Netflix | March 08 |
Saagu | Movie | Telugu | Amazon / MX Player | March 08 |
Captain Miller | Movie | Hindi | Amazon | March 08 |
Show Time | Movie | Hindi | Disney + Hotstar | March 08 |
Maha Rani Season 2 | Web Series | Telugu/Hindi | Sony LIV | March 07 |
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్