తక్కువ సినిమాలతో ఎక్కువ స్టార్‌డమ్‌ను సంపాదించిన హీరోయిన్లలో ‘రకుల్ ప్రీత్ సింగ్’ (Rakul Preet Singh) ఒకరు. ‘కెరటం’ (Keratam) సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన రకూల్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఇచ్చిన సక్సెస్‌తో కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, మహేష్ బాబు, నాగార్జున ఇలా తెలుగులోని టాప్ హీరోల సరసన చకా చకా సినిమాలు చేసేసింది. ఓ దశలో అగ్ర కథానాయిక స్థాయికి ఎదిగింది. అటువంటి రకూల్ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఈ అమ్మడికి వచ్చింది. ఈ క్రమంలోనే రకూల్‌పై ఓ ఆసక్తికర చర్చ మెుదలైంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
రకూల్ ఉంటే సీక్వెల్ ఫట్టే?
2021లో వచ్చిన ‘కొండపొలం’ (Kondapolam) చిత్రం తర్వాత రకూల్ ప్రీత్ సింగ్ నేరుగా తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. రీసెంట్‌గా ‘భారతీయుడు 2‘తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. దీంతో రకూల్ ప్రీత్ సింగ్ గురించి ఓ ఆసక్తికర చర్చ నెట్టింట మెుదలైంది. ఈ అమ్మడు సీక్వెల్స్‌లో నటిస్తే ఆ సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు సైతం ఇస్తున్నారు. గతంలో తెలుగులో వచ్చిన ‘కిక్ 2’, ‘మన్మథుడు 2’ పరాజయాలను గుర్తు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య తెలుగులో విడుదలయ్యాయి. కానీ, ఊహించని స్థాయిలో అవి పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. రీసెంట్‌గా వచ్చిన ‘భారతీయుడు 2’ కూడా వాటి తరహాలోనే ఒకప్పటి బ్లాక్ బాస్టర్ చిత్రానికి సీక్వెల్. ఈ మూడు దారుణంగా ఫెయిల్ కావడం, ఆ చిత్రాల్లో రకూల్ హీరోయిన్‌గా చేయడాన్ని నెటిజన్లు లింక్ చేస్తున్నారు. సీక్వెల్స్‌లో ఈ అమ్మడు నటిస్తే ప్లాఫ్ తథ్యం అంటూ పోస్టులు పెడుతున్నారు.
గతంలోనూ ఇలాగే!
రకూల్ ప్రీత్ సింగ్ తరహాలోనే గతంలోనూ చాలా మంది హీరోయిన్స్‌పై ఈ తరహా కామెంట్స్ వినిపించాయి. ముఖ్యంగా పూజా హెగ్డేపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఈ అమ్మడిది ఐరెన్ లెగ్ అని, ఆమె చేసిన సినిమాలు కచ్చితంగా ఫ్లాప్ అవుతాయంటూ ప్రచారం చేశారు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయితే అందుకు కారణాన్ని హీరోయిన్స్‌కు అంటగట్టడం ఇటీవల కామన్‌గా మారిపోయింది. దర్శకుడు రాజమౌళిని సైతం ఈ తరహా ఫ్లాప్ సెంటిమెంట్స్ వెంటాడాయి. ఆయనతో సినిమా చేసిన హీరోకు నెక్స్ట్ ఫిల్మ్‌లో ఫ్లాప్ తప్పనిసరి అంటూ సోషల్ మీడియా ఉవ్వెత్తున ప్రచారం జరిగింది. ఇప్పటికీ అడపాదడపా ఈ తరహా కామెంట్స్ అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి.
రాబోయేవి సీక్వెల్స్ చిత్రాలే!
ప్రస్తుతం బాలీవుడ్‌లో రకూల్ ప్రీత్ సింగ్ బిజీ బిజీగా గడుపుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘మేరి పత్నికా రీమేక్’ ( Meri Patni Ka Remake), ‘దే దే ప్యార్ దే 2’ (De De Pyaar De 2), ‘ఇండియన్ 3’ (Indian 3) ప్రాజెక్ట్స్‌లో రకూల్ ప్రస్తుతం నటిస్తోంది. అయితే ఇందులో రెండు చిత్రాలు మళ్లీ సీక్వెల్స్ కావడం ఈ అమ్మడిని మరింత ఒత్తిడికి గురిచేసే అవకాశముంది. అటు ఓటీటీ చిత్రాల్లోనూ ఈ అమ్మడు నటిస్తోంది. రీసెంట్‌గా ‘బూ’ (Boo) అనే హార్రర్ థ్రిల్లర్‌లో రకూల్ నటించింది. ఇది నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఇక బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమ వివాహం చేసుకొని ప్రస్తుతం రకూల్ జీవితాన్ని సరదాగా గడుపుతోంది.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’