స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా, గ్లామర్ డాల్ అనుపమ పరమేశ్వరణ్ దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్కేర్ చిత్రానికి మొదటి రోజు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల అంచనాలను అందుకుని పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.23.7కోట్ల గ్రాస్(Tillu Square Day 1 Collections) కొల్లగొట్టినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా రూ.12 కోట్ల గ్రాస్ బాక్సాఫీస్ వద్ద వసూలు చేస్తే.. ఓవర్‌సీస్‌లోనూ అదే స్థాయిలో రూ.11 కోట్లు గ్రాస్ రాబట్టింది. ‘అట్లుంటది మనతోని’ అంటూ టిల్లు స్కేర్ ప్రభంజనాన్ని పోస్టర్ ద్వారా మూవీ మేకర్స్ చెప్పకనే చెప్పారు. శని, ఆది( వీకెండ్స్) ఉండటంతో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రాలతో పోలిస్తే ఇదే హయ్యేస్ట్ డే 1 కలెక్షన్స్‌గా చెప్పవచ్చు.
నెట్ వసూళ్లు ఎంతంటే?
ఇండస్ట్రీలో టాక్ ప్రకారం (Tillu Square Day 1 1 Net Collections) తొలి రోజు మంచి షేర్ రాబట్టింది. ఈ చిత్రం మెుదటి రోజున భారత్‌లో రూ.11.2 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రం ‘డీజే టిల్లు చిత్రం’ బ్లాక్ బాస్టర్ కావడం, హీరోయిన్ అనుపమ(Anupama Parameswaran) గ్లామర్ రోల్ చేయడం, సినిమా విడుదలకు ముందు రిలీజైన ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్.. టిల్లు స్కేర్ సినిమాకు థ్రియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందు రూ.23.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.18.50కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. 4.80కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి. దీని ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 24కోట్లుగా ఉంది. ప్రస్తుతం టిల్లు స్కేర్ హిట్ టాక్ సాధించడంతో లాభాల్లోకి అడుగుపెట్టడం పెద్ద కష్టం కాదు. మరో రెండు రోజుల్లో సులభంగా ఈ టార్గెట్‌ను రీచ్ చేసే అవకాశం ఉంది.
టిల్లు స్కేర్ సక్సెస్‌కు కారణం ఇదే!
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. లిప్‌లాక్ సీన్లతో పాటు, బెడ్రూం సీన్లు అలరిస్తాయి. ఇద్దరి మధ్య వచ్చే వన్‌లైనర్ పంచ్‌లు ప్రేక్షకులను వెంటాడుతాయి. ఇక మాఫియా డాన్ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు. ఇవన్నీ సినిమా విజయానికి కారణం అయ్యాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం