Tillu Square Review In Telugu: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన టిల్లన్న.. సీక్వెల్‌ ఎలా ఉందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tillu Square Review In Telugu: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన టిల్లన్న.. సీక్వెల్‌ ఎలా ఉందంటే?

    Tillu Square Review In Telugu: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన టిల్లన్న.. సీక్వెల్‌ ఎలా ఉందంటే?

    March 29, 2024

    నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌, మడోన్నా సెబాస్టియన్‌, మురళీధర్‌ గౌడ్‌, ప్రిన్స్‌, ప్రణీత్‌ రెడ్డి కల్లెం, ఫిష్‌ వెంకట్‌, రాజ్‌ తిరణ్‌దాస్‌, శ్రీరామ్‌ రెడ్డి తదితరులు..

    దర్శకత్వం : మల్లిక్‌ రామ్‌

    సంగీతం: రామ్‌ మిర్యాల, శ్రీచరణ్‌ పరకాల, ఎస్‌.ఎస్‌ థమన్‌,

    సినిమాటోగ్రఫీ : నవీన్ నూలు

    ఎడిటింగ్‌ : నవీన్ నూలి

    నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య

    నిర్మాణ సంస్థ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్ఛ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌

    విడుదల తేదీ : 29-03-2024

    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్‌, ప్రమోషన్‌ పోస్టర్స్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? టిల్లు పాత్రలో సిద్ధూ మరోమారు మాయ చేశాడా? ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    ‘డీజే టిల్లు’ ఎక్కడైతే ముగిసిందో టిల్లు స్క్వేర్‌ కథ (Tillu Square Review in Telugu) అక్కడ నుంచే మెుదలైంది. దెబ్బ నుంచి కోలుకున్న టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ).. ‘టిల్లు ఈవెంట్స్’ పేరుతో కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేస్తాడు. దాని ద్వారా వెడ్డింగ్ ప్లానింగ్స్‌, డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి లైఫ్‌లోకి లిల్లీ జోసెఫ్ (అనుపమా) ప్రవేశిస్తుంది. తన బర్త్‌డే స్పెషల్‌గా టిల్లూను ఓ సాయం కోరుతుంది. రాధికా విషయంలో దెబ్బ తిన్న టిల్లు ఇప్పుడు ఏం చేశాడు? వీరి మధ్యకు మాఫియా డాన్ మెహబూబ్ అలీ (మురళీ శర్మ) ఎందుకు వచ్చాడు? రాధికా (నేహా శెట్టి) టిల్లు లైఫ్‌లోకి మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది తెలియాలంటే థియేటర్‌లో చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారు

    స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్‌ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్‌ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. ఇక మాఫియా డాన్‌ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్‌ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు.

    డైరెక్షన్‌ ఉందంటే

    డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్.. ‘డీజే టిల్లు’ తరహాలోనే ‘టిల్లు స్క్వేర్‌’ను కూడా ఫన్‌ & ఎంటర్‌టైన్‌మెంట్‌ తరహాలోనే తెరకెక్కించారు. టిల్లు పాత్రను ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా చూపించి మంచి మార్కులు కొట్టేశారు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అంటూ అనుపమా పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా మెప్పిస్తుంది. తొలి పార్ట్‌తో పోలిస్తే రొమాన్స్‌లో మరింత ఘాటు పెంచి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. అయితే కామెడీ, డైలాగ్స్‌ పరంగా సినిమా ఎంతో బాగున్నప్పటికీ.. కాన్సెప్ట్‌ను మాత్రం రొటీన్‌గా చూపించాడు దర్శకుడు. డీజే టిల్లు ఫ్లేవర్‌తోనే సీక్వెల్‌ను నడిపించాడు. కీలక సమయాల్లో వచ్చే ట్విస్ట్‌లు అంతగా వర్కౌట్‌ కాలేదు. సెకండాఫ్‌లో మురళీశర్మ చెప్పే డైలాగ్స్‌ విషయంలో మల్లిక్‌ రామ్‌ జాగ్రత్త వహించాల్సింది. ఎందుకంటే అవి లాజిక్స్‌కు దూరంగా అనిపిస్తాయి. అయితే న్యారేషన్‌, కామెడీ పరంగా చూస్తే మల్లిక్‌ రామ్‌ డైరెక్టర్‌గా సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. సినిమా ఎక్కడా బోర్‌ కొట్టకుండా ఔట్‌ అండ్ ఔట్ ఎంటర్‌టైనింగ్‌గా మూవీని ఆయన తెరకెక్కించాడు. 

    టెక్నికల్‌గా

    టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు చక్కటి పనితీరును కనబరిచాయి. రామ్ మిర్యాల, అచ్చు అందించిన సాంగ్స్.. భీమ్స్ ఇచ్చిన నేపథ్య సంగీతం మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్‌గా బ్యూటిఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలు ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఖర్చుకు నిర్మాతలు వెనకాడలేదు.

    ప్లస్‌ పాయింట్స్‌

    • సిద్ధు జొన్నలగడ్డ నటన
    • కామెడీ
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్

    • రొటీన్ స్టోరీ
    • ఆకట్టుకోని ట్విస్టులు

    Telugu.yousay.tv Rating : 3.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version