Tollywood Biggest Disasters 2023: ఈ ఏడాది డిజాస్టర్లుగా నిలిచిన స్టార్‌ హీరోల చిత్రాలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tollywood Biggest Disasters 2023: ఈ ఏడాది డిజాస్టర్లుగా నిలిచిన స్టార్‌ హీరోల చిత్రాలు ఇవే!

    Tollywood Biggest Disasters 2023: ఈ ఏడాది డిజాస్టర్లుగా నిలిచిన స్టార్‌ హీరోల చిత్రాలు ఇవే!

    December 20, 2023

    2023వ సంవత్సం కొందరి హీరోలకు ఊహించని విజయాలను అందిస్తే మరికొందరికి మాత్రం పీడకలను మిగిల్చింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని చిత్రాలు భాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుని ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇంతకి ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరు? ఇతర విశేషాలను ఇప్పుడు చూద్దాం. 

    శాకుంతలం

    గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘శాకుంతలం’. సమంత లీడ్‌ రోల్‌ చేసిన చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద చతికలపడింది. తీవ్ర నష్టాలను చవిచూసింది. సినిమాపై సామ్‌ పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది.

    ఏజెంట్‌

    యంగ్‌ హీరో అక్కినేని అఖిల్‌కు ఇండస్ట్రీలో ఇప్పటివరకూ సరైన హిట్‌ లేదు. దీంతో అతడు ‘ఏజెంట్’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది. అఖిల్‌ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా నిలిచింది. 

    ఆదిపురుష్‌

    ప్రభాస్‌ రాముడిగా తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’ చిత్రం ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓం రౌత్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. విడుదల తర్వాత అనేక విమర్శలను మూటగట్టుకుంది. 

    కస్టడీ

    ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి కలిసిరాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే నాగ చైతన్య హీరోగా చేసిన ‘కస్టడీ’ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తొలిసారి కానిస్టేబుల్‌ పాత్రలో చేసిన చైతూ.. సినిమాను విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో నిర్మాతలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. 

    రావాణాసుర

    రవితేజ తొలిసారి విలన్‌ షేడెడ్‌ పాత్రలో నటించిన చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. అయితే థియేటర్లలో ఈ చిత్రం ఊహించని విధంగా ఫ్లాప్‌ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ నటనకు మంచి మార్కులే పడినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపించలేకపోయింది. 

    గాండీవదారి అర్జున

    వరణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కిన ‘గాండీవదారి అర్జున’ చిత్రం కూడా ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసింది. 

    రామబాణం

    ఈ మధ్య సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న స్టార్‌ హీరో గోపిచంద్‌.. ఈ ఏడాది ‘రామబాణం’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం గోపిచంద్ ఆశలను అడియాశలు చేసింది. ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడింది. డిజాస్టర్‌గా నిలిచి హీరో గోపిచంద్‌కు అసంతృప్తిని మిగిల్చింది. 

    భోళాశంకర్‌

    మెగాస్టార్‌ హీరోగా మేహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళాశంకర్‌’. భారీ అంచనాలు, ప్రమోషన్స్‌తో ఊదరగొట్టిన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. 

    ఆదికేశవ

    మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్, శ్రీలీల జంటగా చేసిన ‘ఆదికేశవ’ చిత్రం కూడా ఇటీవల విడుదలై ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version