దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌కు భారత మార్కెట్‌లో మంచి గుడ్‌విల్ ఉంది. ఆ సంస్థ రిలీజ్ చేసే స్మార్ట్‌ఫోన్స్ కోసం మెుబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డెట్స్‌తో స్మార్ట్ ఫొన్లను రిలీజ్ చేస్తుంటుంది. అయితే చాలా మందికి ఏ శాంసంగ్ ఫొన్ కొంటె బాగుంటుందో తెలియక కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్నారు. తమ అవసరం, బడ్జెట్‌ను బట్టి శాంసంగ్ ఫొన్లలో ఇప్పటి వరకు మంచి రేటింగ్ సాధించిన ఫొన్లను ఇక్కడ అందిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన ఫొన్‌ను ఎంచుకుని కొనుగోలు చేసుకోండి.
Samsung Galaxy A23 5G
శాంసంగ్ స్మార్ట్ ఫొన్లలో మీడియం బడ్జెట్ రేంజ్‌లో అధికం సేల్ అవుతున్న ఫొన్లలో Samsung Galaxy A23 ఒకటి. అమెజాన్‌లో ఈ ఫోన్ 28శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 28,990 కాగా.. ప్రస్తుతం రూ.20,999 వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ కేపాసిటితో లభిస్తోంది. 6.6 అంగులాల LCD డిస్‌ప్లే, 120 హెడ్జ్ రీఫ్రేష్ రేట్, 5000mAh బ్యాటరితో నడవనుంది. 50మెగా ఫిక్సెల్ కెమెరాతో ఆఫ్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఇందులో ఉంది. ఇక ఈ 5జీ ఫొన్ స్నాప్ డ్రాగన్ 695 Octa-Core processor, ఆండ్రాయిడ్ 12పై నడుస్తుంది.
Samsung Galaxy M34 5G
6.5-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే.. FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. దీని ప్రధాన కెమెరా 50MP+8MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. నైటోగ్రఫీ కెమెరా మోడ్‌లో లోలైట్‌లో మంచి ఫొటోలు వస్తాయి. 6000mAH శక్తివంతమైన బ్యాటరీ, Exynos 1280 ఆక్టా కోర్ 2.4GHz ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. దీని ధర రూ. 18,499. బడ్జెట్‌లో మంచి కెమెరా ఫొన్ శాంసంగ్‌లో కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
Samsung Galaxy A34 5G
శాంసంగ్ నుంచి మీడియం బడ్జెట్‌లో మంచి ప్రీమియం ఫీచర్స్ కావాలనుకునే వారికి ఈ స్మార్ట్ ఫొన్ సరైన ఎంపిక. దీనిలో ప్రధాన కెమెరా 48MP(OIS)+8MP+5MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఆఫ్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కలిగి ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా 13MPతో వచ్చింది. 6.6-అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ MTK D1080 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 13 మీద రన్ అవుతుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. 8జీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కెపాసిటితో అందుబాటులో ఉంది. దీని వాస్తవ ధర రూ. 35, 499 కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ.27,999 వద్ద లభిస్తోంది.
Samsung Galaxy S23
శాంసంగ్ ప్రీమియం ఫీచర్లతో డీజైన్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఎడిషన్ ఈ స్మార్ట్ ఫొన్. క్వాలిటి బిల్ట్ సెటప్‌తో ప్రీమియం లుక్‌లో వచ్చింది. దీని ప్రధాన కెమెరా 50 మెగా ఫిక్సెల్, ఫ్రంట్ కెమెరా.. 12 మెగాఫిక్సెల్ సెటప్‌తో ఉంటుంది. 8GB ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్ కెపాసిటీతో వచ్చింది. దీని అసలు ధర రూ. 89,999 కాగా ప్రస్తుతం రూ.74,999 వద్ద అందుబాటులో ఉంది.
Samsung Galaxy S23 Plus
ఇది కూడా శాంసంగ్ ఫ్లాగ్ షిప్ ఎడిషన్. అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ చేయబడింది. స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 పై ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. దీనిలోని ఫ్రంట్ కెమెరా AI ఆధారిత 12MP సెటప్ కలిగి ఉంటుంది. 6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో రూపొందింది. ప్రధాన కెమెరా.. 50MP + 10MP + 12MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చింది. 4700 mAh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది. అద్భుతమైన సెల్ఫీ ఫొటోలు, లోటైట్‌లో షార్ప్ ఇమేజ్‌లు, వీడియోలు తీయడంలో ఈ ఫొన్ దిట్ట. లాంచింగ్ టైంలో ఈ ఫొన్ ధర రూ. 1,16,999 కాగా.. ప్రస్తుతం అమెజాన్‌లో ₹94,999 వద్ద అందుబాటులో ఉంది.
Samsung Galaxy S23 Ultra
200MP శక్తివంతమైన కెమెరా సెటప్‌తో అయితే వచ్చింది. దీని ఇంటెలిజెంట్ పిక్సెల్ సెన్సార్ నైట్‌గ్రఫీతో అతి తక్కువ కాంతిలోనూ అద్భుతంగా ఫొటోలు తీయవచ్చు. Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. ప్రీమియం బాడీ, పెన్ టూల్, ఎపిక్ మోబైల్ గేమింగ్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని ధర రూ. ₹1,21,999
Samsung Galaxy Z Fold5
శాంసంగ్ నుంచి రిలీజైన లెటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫొన్. దీని మెయిన్ కెమెరా 50MPతో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 7.6 లార్డ్ ఫొల్డబుల్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, 120 హెడ్జ్ రీఫ్రేష్ రేటుతో అందుబాటులో ఉంటుంది. 12జీబీ ర్యామ్.. 128జీబీ నుంచి 1TB వరకు స్టోరేజ్ కెపాసిటీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇక దీని సెల్ఫీ కెమెరా 12 మెగాఫిక్సెల్‌తో అద్భుతమైన ఫొటోలు తీస్తుంది. దీని ధర ₹1,64,999
Samsung Galaxy Z FLIP5
ఇది 3.4 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో, అన్‌ఫోల్డ్ చేసినప్పుడు 6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో రూపొందింది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో ఇది మంచి పనితీరును అందించనుంది. ఈ డివైజ్ డ్యుయల్ 12 MP కెమెరా సెటప్‌తో వచ్చింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ IP58 రేటింగ్ కలిగి ఉంది. స్టైలీష్ లుక్‌లో ప్రీమియం ఫీచర్లతో FLIP5 అందుబాటులో ఉంది. దీని ధర రూ. ₹99,999
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!